టీజర్‌తోనే అదరగొట్టిన ‘టక్‌ జగదీష్‌’

నేచురల్‌ స్టార్‌ నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంతలా అలరించిందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ జోడీ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా ఓ కుటుంబ కథా చిత్రం తెరకెక్కుతోంది.

Updated : 23 Feb 2021 17:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నాని-శివ నిర్వాణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘నిన్ను కోరి’ ఎంతలా అలరించిందో సినీ అభిమానులందరికీ తెలిసిందే. కాగా.. మరోసారి ఈ జోడీ ప్రేక్షకుల ముందు సందడి చేసేందుకు సిద్ధమైంది. అన్నదమ్ముల కథతో నాని హీరోగా నటిస్తున్న చిత్రం ‘టక్‌ జగదీష్‌’. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు.

ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజును పురస్కరించుకొని ఒక రోజు ముందుగానే చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఒక డైలాగ్‌ కూడా లేకుండా కేవలం పాటతోనే చిత్ర నేపథ్యం ఏంటో చెప్పేశారు. ‘నిన్ను చూసి నికరంగా రొమ్ము ఇరుచుకున్నాది’ అంటూ తన కుటుంబం కోసం జగదీష్‌ ఏం చేశాడో చూపించారు. షైన్స్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్‌ 23న విడుదల కానుంది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ‘టక్‌ జగదీష్‌’ టీజర్‌ను మీరూ చూసేయండి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని