Twinkle Khanna: కరణ్‌, ఆయన పార్టీలను బ్యాన్‌ చేయండి: నటి

బాలీవుడ్‌లో బెస్ట్‌ పార్టీ హోస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత కరణ్‌ జోహార్‌. సందర్భం ఏదైనా సరే సెలబ్రిటీల కోసం ఆయన ఏర్పాటు చేసే పార్టీలు గ్రాండ్‌గా ఉంటాయి....

Published : 29 May 2022 01:25 IST

నిర్మాత పార్టీలపై అక్షయ్‌కుమార్‌ సతీమణి సరదా వ్యాఖ్యలు

ముంబయి: బాలీవుడ్‌లో బెస్ట్‌ పార్టీ హోస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు నిర్మాత కరణ్‌ జోహార్‌. సందర్భం ఏదైనా సరే సెలబ్రిటీల కోసం ఆయన ఏర్పాటు చేసే పార్టీలు గ్రాండ్‌గా ఉంటాయి. ఆయన ఇచ్చే పార్టీలపై నటుడు అక్షయ్‌కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా తాజాగా స్పందించారు. కరణ్‌, ఆయన పార్టీలను బ్యాన్‌ చేయాలంటూ ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. తన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం సాయంత్రం బాలీవుడ్‌ స్టార్స్‌ అందరికీ కరణ్‌ ఓ గ్రాండ్ పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పార్టీలో తారలందరికీ డ్రింక్స్‌, ఫుడ్‌ సప్లయ్‌ చేశారు. ట్వింకిల్‌ ఖన్నా సైతం ఈ పార్టీలో పాల్గొన్నారు.

కాగా, తాజాగా ఆమె పార్టీ అనంతరం ఉండే ఇబ్బందులను తెలియజేస్తూ ఓ వీడియోని నెట్టింట షేర్‌ చేశారు. ‘‘ఫ్రీ డ్రింక్స్ కారణంగా వచ్చిన హ్యాంగోవర్‌ ఇది..!! పార్టీకి వెళ్లే ముందు ఇలా ఉన్నాను. పార్టీ తర్వాతి రోజు ఉదయాన్నే నిద్రమత్తులో ఇలా ఉన్నా. ఇప్పుడు ఎవరైనా.. ‘‘కరణ్‌ పార్టీకి వెళ్లావు కదా. ఎలా జరిగింది?’’ అని అడిగితే.. ఏం గుర్తు లేదు. పార్టీలో నేను మర్యాదగా ప్రవర్తించానా? లేదా?. పార్టీలో అందరూ ఎక్కువగా మద్యం సేవించారు అది ఒక్కటే గుర్తుంది. ఫ్రీ డ్రింక్స్ కారణంగా వచ్చిన హ్యాంగోవర్‌ ఇది..!! కాబట్టి, బ్యాన్‌ డ్రింక్స్.. బ్యాన్‌ పార్టీ.. బ్యాన్‌ కరణ్‌’’ అని ఆమె వీడియోలో చూపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని