RRR: ‘తొక్కుకుంటూపోవాలే’.. ట్రెండింగ్‌లో ఈ నలుగురు హీరోలు ‘తగ్గేదేలే’!

తమ అభిమాన నటుడి సినిమా విడుదలవుతుంటే చాలు చాలామంది ఆనందంలో మునుగుతారు. ‘ఇంకో ఏడు రోజుల్లో, మరో 72 గంటల్లో సినిమా వచ్చేస్తుంది’ అని లెక్కలు వేసుకుంటుంటారు.

Published : 07 Mar 2022 01:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ అభిమాన నటుడి సినిమా విడుదలవుతుంటే చాలు చాలామంది ఆనందంలో మునుగుతారు. ‘ఇంకో ఏడు రోజుల్లో, మరో 72 గంటల్లో సినిమా వచ్చేస్తుంది’ అని లెక్కలు వేసుకుంటుంటారు. టీజర్‌, ట్రైలర్లలోని సంభాషణలు, హీరోల ఇంటర్వ్యూల్లోని ఆసక్తికర విశేషాల్ని సోషల్‌ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు. ‘రాధేశ్యామ్‌’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాల విడుదల దగ్గరపడుతుండటంతో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌, ప్రభాస్‌ అభిమానులు ఇదే పనిచేశారు. సంబంధిత చిత్రాలకు సంబంధించిన డైలాగులు, పోస్టర్లు, హీరోల ఫొటోలు ట్వీట్‌పై ట్వీట్‌ చేసి ట్రెండింగ్‌లో నిలిపారు.

ట్విటర్‌లో ఒక్కో రోజు పలు రంగాలకు సంబంధించిన విషయాలు ట్రెండింగ్‌లో నిలుస్తుంటాయి. ఆదివారం సాయంత్రం.. ఎంటర్‌టైనింగ్‌ విభాగంలో ‘‘తొక్కుకుంటూపోవాలే’’ (#ThokkukuntuPovaale) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (#RRR) చిత్రం, ఎన్టీఆర్‌ (#ManOfMassesNTR) పేర్లు ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇదే డైలాగ్‌+ తన సతీమణి ఉపాసనతో దిగిన ఫొటోతో రామ్‌ చరణ్‌ (#RamCharan), రాధేశ్యామ్‌ (#RadheShyam) సినిమా ప్రచారంలో భాగంగా దిగిన స్టిల్స్‌, ఇంటర్వ్యూలతో ప్రభాస్‌ (#Prabhas) ట్రెండింగ్‌ జాబితాలోకి వచ్చారు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ (#ViratKohli) ‘పుష్ప’ (#PushpaTheRise) సినిమాలోని ‘తగ్గేదే లే’ (#ThaggedheLe) అనే మ్యానరిజంను అనుసరించాడు. ఆ వీడియోను ‘పుష్ప’ టీమ్‌ ట్వీట్‌ చేయగా కొన్ని క్షణాల్లో వైరల్‌గా మారింది. దాంతో ఆ సినిమా హీరో అల్లు అర్జున్‌ (#AlluArjun) పేరు ట్రెండ్‌ అవుతోంది.

‘‘తొంగి తొంగి నక్కి నక్కి కాదే తొక్కుకుంటూపోవాలే’’.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలో ఎన్టీఆర్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది. ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 25న విడుదలకానుంది. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ కుమార్‌ రూపొందించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకొస్తుంది. ‘పుష్ప’ గతేడాది విడుదలై ఘన విజయం అందుకుంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని