Saturday Night: సినిమా ప్రమోషన్‌లో హీరోయిన్లకు చేదు అనుభవం

తమ కొత్త సినిమా ప్రమోషన్‌ కోసం షాపింగ్‌మాల్‌కు వెళ్లిన మలయాళీ నటీమణులు సానియా  అయ్యప్పన్‌ , గ్రేసీ ఆంటోనీలకు చేదు అనుభవం ఎదురైంది.

Published : 29 Sep 2022 01:24 IST

కొయ్‌కోడ్‌: తమ కొత్త సినిమా (Saturday Night) ప్రమోషన్‌ కోసం షాపింగ్‌మాల్‌కు వెళ్లిన మలయాళీ హీరోయిన్లు సానియా అయ్యప్పన్‌ (Saniya Iyappan), గ్రేసీ ఆంటోనీ (Gracy Antony)లకు చేదు అనుభవం ఎదురైంది. ఈవెంట్‌ పూర్తి చేసుకొని బయటకు వస్తోన్న వారిద్దర్నీ ఆడియన్స్‌ చుట్టుముట్టారు. వారిలోని కొందరు సానియా, గ్రేసీలతో అసభ్యంగా ప్రవర్తించారు. సహనం కోల్పోయిన సానియా ఓ వ్యక్తిని కొట్టబోయారు. సంబంధిత దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇలాంటి ఘటనలు ఎవరికీ ఎదురుకాకూడదంటూ సానియా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భావోద్వేగ పోస్ట్‌ పెట్టారు. ‘‘నా తదుపరి సినిమా (సాటర్‌డే నైట్‌) ప్రమోషన్స్‌లో భాగంగా టీమ్‌తో కలిసి కొయ్‌కోడ్‌లోని ఓ ప్రముఖ మాల్‌కు వెళ్లా. అభిమానులు, యువత భారీ సంఖ్యలో హాజరు కావడంతో వారిని కంట్రోల్‌ చేయటం మాల్‌ సెక్యురిటీకి కష్టమైంది. దాంతో, వేడుక పూర్తైన వెంటనే బృందంతో కలిసి బయటకు వస్తోన్న సమయంలో నా సహ నటితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ ప్రాంగణమంతా రద్దీగా ఉండటంతో ఆ వ్యక్తిని ఆమె గుర్తుపట్టలేకపోయింది. ఆ తర్వాత కొంత సమయానికే ఇలాంటి ఘటనే నేనూ ఎదుర్కొన్నా’’ అని సానియా పేర్కొన్నారు. నివిన్‌ పాలీ, సిజు విల్సన్‌, కురుప్‌, సానియా, గ్రేసీ ప్రధాన పాత్రల్లో రోషన్‌ ఆండ్రూస్‌ తెరకెక్కించిన ‘సాటర్‌డే నైట్‌’ చిత్రం అక్టోబరు 7న విడుదలకానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని