KRK: ‘టు టు టు’.. నయన్‌, సమంత మధ్యలో సేతుపతి.. డ్యాన్స్‌ అదరహో

విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్‌’. తెలుగులో ‘కణ్మణి ర్యాంబో ఖతీజా’ పేరుతో థియేటర్లలో సందడి చేస్తోంది.

Published : 05 May 2022 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ సేతుపతి, నయనతార, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన తమిళ చిత్రం ‘కాతువాకుల రెండు కాదల్‌’. తెలుగులో ‘కణ్మణి రాంబో ఖతీజా’ పేరుతో విడుదలై, థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘టు టు టు’ అనే ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదలైంది. ఇందులో.. ఇద్దరు భామల మధ్య నలిగిపోతున్న ప్రేమికుడిగా కనిపించారు విజయ్‌ సేతుపతి. ఆయన డ్యాన్స్‌, హావభావాలు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. నయన్‌, సమంత.. ఒకరితో ఒకరు పోటీపడి స్టెప్పులేశారు. ఈ హుషారైన గీతాన్ని శ్రీసాయి కిరణ్‌ రచించగా అనిరుధ్‌, సాహితి చాగంటి, సంజన ఆలపించారు. అనిరుధ్‌ స్వరాలందించాడు. సినిమా విడుదలకు ముందే ఈ పాట లిరికల్‌ వీడియో విడుదలై, మంచి వ్యూస్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియో సంస్థ నిర్మించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని