Ugadi: ఉగాది జోష్ పెంచిన బాలయ్య.. కొత్త సినిమా పోస్టర్లతో టాలీవుడ్‌లో సందడి..
ఉగాది సందర్భంగా కొత్త సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి. ఫస్ట్‌లుక్ పోస్టర్లతో.. విడుదల తేదీ ప్రకటనలతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు సినీ రంగంలో ఉగాది పోస్టర్ల సందడి నెలకొంది. పండగ వచ్చిందంటే సినీ ప్రియులు.. అభిమాన తారల సినిమా అప్‌డేట్స్ కోసం ఎదరుచూస్తుంటారు. అందుకు తగ్గట్లుగానే ఉగాది సందర్భంగా కొత్త సినిమా కబుర్లతో సోషల్‌మీడియా కళకళలాడుతోంది. కొన్ని సినిమాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చి పండగ తీసుకురాగా.. మరికొన్ని పోస్టర్లతో, ట్రైలర్‌లతో అలరించాయి. ‘ఈ సారి మీ ఊహలకు మించి’ అంటూ బాలకృష్ణ తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా.. చిరంజీవి తన తర్వాతి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మరి ఉగాది సందర్భంగా విడుదల చేసిన కొత్త సినిమా పోస్టర్లను చూసేద్దాం (Ugadi 2023 movie updates).
బాలకృష్ణ (Balakrishna) అభిమానులకు తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌తో బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. అఖండ , వీర సింహారెడ్డి లాంటి బ్లాక్ బాస్టర్ హిట్స్‌తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య అదే జోరుతో తన కొత్త సినిమా ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ‘ఈసారి మీ ఊహలకు మించి ఉంటుంది’ అంటూ పవర్‌ఫుల్ లుక్‌తో ఉన్న ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది(#nbk108). ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా షూటింగ్‌లో జాయిన్ అయింది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న చిరంజీవి (Chiranjeevi) ఉగాది పండగ పురస్కరించుకొని తన తర్వాతి సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తోన్న ‘భోళా శంకర్’ (Bhola Shankar) సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. చిరంజీవి సరసన తమన్నా (Tamannaah) నటిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ (Keerthy Suresh)కీలక పాత్ర పోషిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Nara Lokesh: వైకాపా ఇసుక మాఫియాకు ఇదే ప్రత్యక్షసాక్ష్యం: నారా లోకేశ్ సెల్ఫీ
-
Politics News
Chidambaram: భాజపా అసహనానికి ఇదే నిదర్శనం: చిదంబరం
-
General News
KTR: ప్రజల కోసం ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ధరణి పోర్టల్: కేటీఆర్
-
World News
Japan: ఒకే రన్‌వేపైకి రెండు విమానాలు.. ఒకదాన్నొకటి తాకి..
-
Politics News
ChandraBabu: అక్రమాలను అడ్డుకోండి: సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ