ఆ యాడ్‌లోని చిన్నారి కృతిశెట్టినే..!

తొలిసినిమాతోనే సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయిక కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’లో ఆమె వైష్ణవ్‌తేజ్‌ సరసన బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు.....

Published : 01 Mar 2021 01:14 IST

చిన్నప్పుడే కెమెరా ముందుకొచ్చిన బేబమ్మ

హైదరాబాద్‌: తొలిసినిమాతోనే సూపర్‌హిట్‌ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు కథానాయిక కృతిశెట్టి. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’లో ఆమె వైష్ణవ్‌తేజ్‌ సరసన బేబమ్మగా నటించి ప్రేక్షకుల హృదయాలు కొల్లగొట్టారు. మొదటి సినిమానే అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా ఆమె నటించిన విధానం చూసి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. అయితే, కృతి చిన్నతనంలోనే కెమెరా ముందు తళుక్కున మెరిశారు.

స్కూల్‌కు వెళ్లే వయసులో ఉన్నప్పుడే మొట్టమొదటిసారి ఓ వస్త్ర దుకాణాల వాణిజ్య ప్రకటనలో కృతిశెట్టి పాల్గొన్నారు. అనంతరం ‘లైఫ్‌బాయ్‌’, ‘డైరీమిల్క్‌ చాక్లెట్‌’తోపాటు ఓ పెన్నుల కంపెనీ యాడ్‌లో కూడా ఆమె నటించారు. హృతిక్‌రోషన్‌ కథానాయకుడిగా 2019లో విడుదలైన ‘సూపర్‌ 30’లో సైతం కృతిశెట్టి ఓ సన్నివేశంలో కనిపించారు. మన బేబమ్మ నటించిన కొన్ని వాణిజ్య ప్రకటనలను మీరూ ఓసారి చూసేయండి..!




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని