Unstoppable: ఇంటర్‌ స్టెల్లర్‌ కబుర్లు చెప్పకమ్మా.. సుకుమార్‌పై బాలయ్య పంచ్‌లు

‘ఇంటర్‌స్టెల్లర్‌’ దర్శకులతో ఇదే గొడవయ్యా. సినిమాలూ అలాగే ఉంటాయి. గెటప్‌లూ అలానే ఉంటాయి’ అంటూ

Published : 26 Dec 2021 21:04 IST

హైదరాబాద్‌: ‘‘ఇంటర్‌స్టెల్లర్‌’ దర్శకులతో ఇదే గొడవయ్యా. సినిమాలూ అలాగే ఉంటాయి. గెటప్‌లూ అలానే ఉంటాయి’ అంటూ సుకుమార్‌ను ఆటపట్టించారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (bala krishna). ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న షో ‘అన్‌స్టాపపబుల్‌’ (Unstoppable). తాజాగా ఈ కార్యక్రమానికి ‘పుష్ప’ (Pushpa) టీమ్‌ అల్లు అర్జున్‌ (Allu arjun), రష్మిక(Rashmika), దర్శకుడు సుకుమార్‌ (sukumar) వచ్చి సందడి చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ- సుకుమార్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ‘మీరు నాకు చాలా పరిచయం కానీ, నేను మీకు పరిచయం తక్కువ’ అని సుకుమార్‌ అంటే ‘ఎలాగో చెప్పండి’ అని బాలకృష్ణ ఎదురు ప్రశ్నించారు. ‘ప్రత్యక్షంగా కాకపోయినా, ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ పెరిగాం కాబట్టి, మీరు మాకు బాగా పరిచయం’ అని అనగానే ‘ఇంటర్‌స్టెల్లర్‌ కబర్లు చెప్పకమ్మా’ అంటూ బాలయ్య పంచ్‌డైలాగ్‌ వేశారు. దీంతో సుకుమార్‌ నవ్వాపుకోలేకపోయారు. ‘రష్మిక’ నవ్వుతుంటే చాలా అందంగా ఉందని బాలకృష్ణ కితాబిచ్చారు. ఇక అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో డైలాగ్‌ చెబుతూ తొడకొట్టారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని