నేను చెప్పేవరకూ ఎఫైర్‌ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు: రష్మిక

నటుడు విజయ్‌ దేవరకొండ(Geetha Govindam), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందాన్న (Rashmika Mandanna) చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. చాలా వేదికల్లో ఈ వ్యవహారంపై వీరిద్దరికి ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇటీవల...

Published : 11 Aug 2022 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు విజయ్‌ దేవరకొండ (vijay devarakonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక (Rashmika Mandanna) చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని సోషల్‌ మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి. చాలా వేదికల్లో ఈ వ్యవహారంపై వీరిద్దరికీ ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. ఇటీవల ‘కాఫీ విత్‌ కరణ్‌’ ప్రోగ్రాంలో ‘రష్మిక’పై విజయ్‌ దేవరకొండ అభిప్రాయం అడగ్గా ‘డార్లింగ్‌’ అంటూ సంభోదించాడు. అయితే ఈ వ్యవహారంపై బాలీవుడ్‌ మీడియా రష్మికను ప్రశ్నించగా ఆమె ఆసక్తికరంగా స్పందించింది. విజయ్‌ దేవరకొండతో మీరు డేటింగ్‌లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎందుకు స్పందించట్లేదు? అని అడిగిన ప్రశ్నకు ఆమె.. ‘నేనొక నటిని. సంవత్సరానికి అయిదారు సినిమాలు చేస్తున్నాను. మామూలుగా అయితే మీరు నా సినిమాల గురించి ప్రశ్నించొచ్చు. కానీ మీ బాయ్‌ఫ్రెండ్‌ ఎవరు? ఎవరితో డేట్‌ చేస్తున్నారు? లాంటి ప్రశ్నలనే ఎక్కువగా అడుగుతున్నారు. నా వ్యక్తిగత జీవితంపై ఉన్న ఆసక్తి కారణంగా ఇటువంటి ప్రశ్నలను అడుగుతున్నారని నాకు తెలుసు. కానీ నా నోటితో నేను చెప్పేంతవరకు అలాంటి ఎఫైర్‌ వార్తలను సీరియస్‌గా తీసుకోవద్దు. ఆ వార్తలతో ఎంజాయ్‌ చేసేవాళ్లను చేయనివ్వండి’ అంటూ సమాధానమిచ్చింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక ‘గుడ్‌బై’ అనే చిత్రంతో బీ టౌన్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఇంకా సిద్ధార్థ్‌ మల్హోత్రా సరసన ‘మిషన్‌ మజ్ను’ అనే స్పై థ్రిల్లర్‌లో నటిస్తోంది. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న రణ్‌బీర్‌కపూర్‌ చిత్రం ‘యానిమల్‌’లోనూ రష్మికనే కథానాయిక. ఇక సౌత్‌ విషయానికొస్తే ఇక్కడా నాలుగైదు సినిమాలలో నటిస్తూ రష్మిక కెరీర్‌లో దూసుకుపోతోంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని