Upasana: ‘పుష్ప’ గాయని వెడ్డింగ్‌లో ఉపాసన సందడి

ప్రైవేటు ఆల్బమ్స్‌, పలు బాలీవుడ్‌ చిత్రాలకు పాటలు పాడి గాయనిగా బీటౌన్‌లో ఫేమ్‌ సొంతం చేసుకున్నారు కనికాకపూర్‌. తాజాగా ఆమె రెండో వివాహం చేసుకున్నారు...

Updated : 21 May 2022 10:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రైవేటు ఆల్బమ్స్‌, పలు బాలీవుడ్‌ చిత్రాలకు పాటలు పాడి గాయనిగా బీటౌన్‌లో ఫేమ్‌ సొంతం చేసుకున్నారు కనికాకపూర్‌. తాజాగా ఆమె రెండో వివాహం చేసుకున్నారు. లండన్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో లండన్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో హిందూ సంప్రదాయంలో ఈ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో రామ్‌చరణ్‌ సతీమణి, కనిక స్నేహితురాలు ఉపాసన పాల్గొని సందడి చేశారు. నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉప్సీ నెట్టింట షేర్‌ చేశారు.

లఖ్‌నవూకు చెందిన కనిక లండన్‌కు చెందిన రాజ్‌ అనే వ్యాపారవేత్తను 1988లో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆమె విదేశాల్లోనే సెటిలయ్యారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు. అయితే.. మనస్పర్థలు తలెత్తడంతో 2012లో కనిక-రాజ్‌ విడిపోయారు. ఆ తర్వాత ఆమె కెరీర్‌పై దృష్టి పెట్టి, వరుస ఆల్బమ్స్‌ రిలీజ్‌ చేసి మంచి సక్సెస్‌ అందుకున్నారు. ‘రాగిణి ఎంఎంఎస్‌’ సినిమాలోని ‘బేబీ డాల్‌’, ‘చిట్టియాన్‌ కలైయాన్‌’ ఇలాంటి సూపర్‌హిట్ సాంగ్స్‌ని ఆలపించారు. ఇటీవల, అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ సినిమాలోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’ హిందీ వెర్షన్‌ని కనికానే పాడారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని