Upasana: నేను అందంగా లేనని ట్రోల్స్ చేశారు : ఉపాసన
రామ్‌చరణ్ (Ram Charan)తో తన అనుబంధం ఎలా మొదలైందో తెలియజేశారు ఆయన సతీమణి ఉపాసన (Upasana). ఫ్రెండ్స్ నుంచి భార్యాభర్తలుగా ఎలా మారారో తెలియజేస్తూ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముంబయి: పెళ్లైన కొత్తలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు నటుడు రామ్‌చరణ్ (Ramcharan) సతీమణి ఉపాసన (Upasana) చెప్పారు. శరీరాకృతిపరంగా తనపై పలువురు నెగెటివ్ కామెంట్స్ చేశారని అన్నారు. ట్రోల్స్ ఎదురైనప్పటికీ తాను ఏమాత్రం కుంగుబాటుకు గురికాలేదని.. ప్రస్తుతం తానొక ఛాంపియన్‌గా ఫీలవుతున్నానని తెలిపారు. తాజాగా ముంబయిలో ఓ మీడియాతో మాట్లాడిన ఉప్సీ.. చరణ్‌తో తన రిలేషన్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు.
‘‘చరణ్ నేనూ కామన్ ఫ్రెండ్స్ వల్ల పరిచయమయ్యాం. మొదటి నుంచి తను నన్ను ఏదో ఒక విషయంలో ఛాలెంజ్ చేస్తూనే ఉండేవాడు. నేను కూడా తనకి సవాళ్లు విసిరేదాన్ని. అలా, మేమిద్దరం మరింత ఉన్నతంగా ఎదిగాం. మా మధ్య ప్రేమ మొదలైంది. మేమిద్దరం ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంటాం. ‘నువ్వు ప్రేమలో పడటం కాదు.. ప్రేమలో వికసిస్తుంటావు’ అని చరణ్ నాతో చెప్పాడు. ఆ మాట విని నేనెంతో ఆనందించా. రాను రాను చరణ్ చెప్పిన మాట నిజమేననిపించింది. ఎందుకంటే ప్రతిరోజూ నా జీవిత భాగస్వామి నుంచి ఏదో ఒక విషయం నేర్చుకుంటూనే ఉన్నాను. నా ఆంటీ, సోదరి మా పెళ్లి విషయంలో కీలకపాత్ర పోషించారు. ఎందుకంటే మా ఇద్దరివి భిన్నమైన కుటుంబనేపథ్యాలు. నమ్మకం, ప్రశంసలు, కొన్ని సమయాల్లో రాజీలు పడుతూ మా బంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నాం’’
‘‘చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరూ నన్ను ఏదో ఒక విషయంలో జడ్జ్ చేస్తూనే ఉండేవారు. సమాజంలో ఉన్న ప్రతిఒక్కరూ ఇలాంటివి ఎదుర్కొన్నవారే. శరీరాకృతి, బ్యాక్‌గ్రౌండ్ ఇలా పలు విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటాం. పెళ్లైన కొత్తలో నేనూ బాడీ షేమింగ్ ఎదుర్కొన్నా. నేను అందంగా లేనని, బాగా లావుగా ఉన్నానని, డబ్బు కోసమే చరణ్ నన్ను పెళ్లి చేసుకున్నాడని మాట్లాడారు. ఇలాంటి విమర్శలు చేసిన వాళ్లను నేను నిందించాలనుకోవడం లేదు. ఎందుకంటే, వాళ్లకు నా గురించి ఏమీ తెలియదు. అందుకే వాళ్లు అలా మాట్లాడి ఉండొచ్చు. గడిచిన పదేళ్లలో వాళ్లకు నా గురించి తెలిసింది. దానివల్ల ఇప్పుడు వాళ్లకు నాపై అభిప్రాయం మారిపోయింది. విమర్శలను మనం తీసుకునే విధానంలో ఉంటుంది. ట్రోల్స్ వచ్చాయని నేను కుంగిపోలేదు. వాటిని జయించా. ఇప్పుడు నా విషయంలో నేను ఎంతో ఆనందంగా ఉన్నా. ఈ రోజు నేనొక ఛాంపియన్‌గా ఫీలవుతున్నా. ఎందుకంటే ఆ విమర్శలను ఎలా ఎదుర్కొన్నానో నాకు మాత్రమే తెలుసు. నేను మరింత ధైర్యవంతురాలినయ్యాను’’ అని ఉపాసన వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Air India: ఎట్టకేలకు 39 గంటల తర్వాత.. రష్యా నుంచి అమెరికాకు ఎయిరిండియా విమానం
-
India News
Odisha Train Accident: మృతుల్ని గుర్తించేందుకు కృత్రిమ మేధ
-
Movies News
Balakrishna: బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రానికి అదిరిపోయే టైటిల్
-
General News
Top 10 News @ 9AM: ఈనాడు.నెట్ టాప్ 10 న్యూస్ @ 9AM
-
India News
Odisha Train Accident: టీవీ దృశ్యాలతో కుమారుడిని గుర్తించిన నేపాల్ జంట
-
Ap-top-news News
Amaravati: మంత్రి నాగార్జున కసురుకొని.. బయటకు నెట్టేయించారు: కుటుంబం ఆవేదన