Upasana: బేబీ బంప్‌తో ఉపాసన
తొలిసారి మాతృదినోత్సవాన్ని చేసుకుంటున్నారు రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana). ఈ మేరకు తాజాగా ఆమె ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు.
హైదరాబాద్: మెగా ఇంటి కోడలు, రామ్‌చరణ్ సతీమణి ఉపాసన (Upasana) తొలిసారి మాతృ దినోత్సవాన్ని చేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆమె ఇన్‌స్టాలో ఓ ఫొటో షేర్ చేశారు. ఇందులో ఆమె తొలిసారి బేబీ బంప్‌తో కనిపించారు. సమాజం లేదా వివాహబంధం కోసం తాను పిల్లలు కనాలనే నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అలాగే, పిల్లలకు జన్మనివ్వాలనే కోరిక వెనుక ఒక ప్రత్యేక కారణం ఉందని తెలిపారు.
‘‘మాతృత్వంలోకి అడుగుపెడుతున్నందుకు నేను గర్విస్తున్నాను. సమాజం పెట్టుకున్న అంచనాలకు అనుగుణంగా నేను దీన్ని స్వాగతించలేదు. ఒక వారసత్వాన్ని కొనసాగించడానికో లేదా, నా వైవాహిక బంధాన్ని బలోపేతం చేయాలనే కోరికతోనే నేను తల్లిని కావాలని నిర్ణయించుకోలేదు. నా బిడ్డ ఆనందంగా ఉండేందుకు అవసరమైన అమితమైన ప్రేమను పంచడానికి మానసికంగా సిద్ధమైనప్పుడే నేను పిల్లలను కనాలని నిర్ణయించుకున్నా’’ అని ఉప్సీ రాసుకొచ్చారు. ఈ ట్వీట్ చూసిన పలువురు నెటిజన్లు ఆమెకు అభినందనలు చెబుతున్నారు. సమంత, కాజల్, త్రిష, శ్రియ, కియారా అడ్వాణీ, సంయుక్త, సోనాలి బింద్రే వంటి సినీ తారలు.. మదర్స్‌డే శుభాకాంక్షలతోపాటు హార్ట్ సింబల్‌ను జత చేస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: రష్యాలో ఐఫోన్లపై అమెరికా ‘హ్యాకింగ్’..!
-
General News
CM Jagan: రైతులకు ట్రాక్టర్లు, హార్వెస్టర్లను పంపిణీ చేసిన సీఎం జగన్
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
YS bhaskar reddy: భాస్కరరెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
World News
26/11 Attack: భారత్‌కు అప్పగింత నిర్ణయాన్ని సవాల్ చేసిన 26/11 దాడుల నిందితుడు తహవూర్ రాణా
-
Movies News
Project K: ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ రికార్డులు ‘ప్రాజెక్ట్-కె’ బ్రేక్ చేస్తుంది: రానా