Upasana: సురేఖ అత్తమ్మను మిస్ అవుతున్నా: ఉపాసన
ప్రెగ్నెన్సీ తర్వాత మొదటిసారి ఫొటోలు షేర్ చేశారు రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. తాజాగా ఆమె పుట్టింటి వారితో సరదాగా గడిపారు.
హైదరాబాద్: రామ్‌చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెగ్నెన్సీని ప్రకటించిన తర్వాత పుట్టింటి వారిని కలిసిన ఆమె ఎంతో సరదాగా గడిపారు. వారి ఆశీస్సులు తీసుకున్నారు. జీవితంలోని మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నట్లు తెలిపారు. అయితే, తన అత్తమ్మ, చిరంజీవి సతీమణి సురేఖను మిస్ అవుతున్నట్లు చెప్పారు. ‘‘నా జీవితంలో ఎంతో ముఖ్యమైన మహిళల ఆశీస్సులతో మాతృత్వంలోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ సమయంలో అత్తమ్మను మిస్ అవుతున్నా’’ అని ఉపాసన పేర్కొంటూ.. తల్లి శోభనా కామినేని, అమ్మమ్మ, ఇతర కుటుంబసభ్యులతో దిగిన ఫొటోలను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీటిని చూసిన మెగా ఫ్యాన్స్.. ‘కంగ్రాట్స్’ అని చెబుతున్నారు.
చరణ్-ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నారంటూ సోమవారం మధ్యాహ్నం చిరంజీవి శుభవార్త చెప్పారు. ‘‘హనుమాన్ జీ ఆశీర్వాదాలతో ఈ విషయాన్ని పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఉపాసన, రామ్‌చరణ్‌లు తల్లిదండ్రులుగా తమ తొలి బిడ్డను ఆహ్వానించబోతున్నారు. ప్రేమతో.. మీ సురేఖ-చిరంజీవి, శోభన-అనిల్ కామినేని’’ అని పేర్కొన్నారు. ఈ వార్తతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లపాటు ప్రేమలో ఉన్న రామ్‌చరణ్-ఉపాసన పెద్దల అంగీకారంతో 2012లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manoj Manchu: మంచు మనోజ్ సరికొత్త టీవీ షో.. ఎక్కడో తెలుసా?
-
TTD: గరుడ వాహనంపై మలయప్పస్వామి.. భక్త జనసంద్రంగా తిరుమల
-
Manchu Lakshmi: నా సంపాదన.. నా ఖర్చు.. మీకేంటి నొప్పి: మంచు లక్ష్మి ట్వీట్
-
Antilia Case: అంబానీని భయపెట్టేందుకే.. ఆయన ఇంటి ముందు పేలుడు పదార్థాలు!
-
ISRO: విక్రమ్, ప్రజ్ఞాన్‌లతో కమ్యూనికేషన్‌కు యత్నం.. ఇస్రో ఏం చెప్పిందంటే!
-
Anantapuram: పాఠశాలలో దారుణం.. పుట్టిన రోజు నాడే చిన్నారి మృతి