Klinkara: క్లీంకార ఫస్ట్‌ బర్త్‌డే.. ఆ వీడియోను మరోసారి షేర్‌ చేసిన ఉపాసన

చిరంజీవి మనవరాలు, రామ్‌ చరణ్ కుమార్తె క్లీంకార మొదటి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాసన షేర్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది. 

Updated : 20 Jun 2024 10:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామ్‌ చరణ్.. ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార మొదటి పుట్టినరోజు నేడు. దీంతో ఆ చిన్నారికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈసందర్భంగా తన కుమార్తెకు విషెస్‌ చెబుతూ ఉపాసన ఓ ఎమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు. ‘నా ప్రియమైన క్లీంకారకు  (Klinkaara) పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ రాకతో మా జీవితాలు పరిపూర్ణమయ్యాయి. మా జీవితాల్లో ఆనందం నింపినందుకు ధన్యవాదాలు’ అంటూ విషెస్‌ చెప్పారు. ఇక తాను షేర్‌ చేసిన వీడియోను ఇప్పటికి మిలియన్‌ సార్లు చూసినట్లు తెలిపారు.

ఆ వీడియోలో చరణ్‌ (Ram Charan), ఉపాసనలతో పాటు ఇరు కుటుంబాల వారు క్లీంకార పుట్టినప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు. గతేడాది ఉపాసన పుట్టినరోజు నాడు చరణ్‌ ఈ వీడియోను షేర్‌ చేశారు. ఇప్పుడు దాన్నే మరోసారి ఆమె (Upasana) పంచుకున్నారు. పాప పుట్టిన సమయంలో తమ కుటుంబంలో ఎలాంటి సందడి వాతావరణం నెలకొందో అన్న అంశాన్ని ఈ వీడియోలో చూపించారు. క్లీంకార నామకరణ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విజువల్స్‌ సైతం అందులో ఉన్నాయి.

ఎప్పటికీ మరిచిపోలేని ఓ అనుభవం... కల్కి

మరోవైపు క్లీంకారకు నెటిజన్లతో పాటు ప్రముఖులు విషెస్‌ చెబుతున్నారు. ‘లిటిల్ వండర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని కాజల్‌ కామెంట్ పెట్టగా.. ‘హ్యాపీ బర్త్‌డే లిటిల్ స్టార్‌’ అని కియారా అడ్వాణీ, రకుల్‌ ప్రీత్ సింగ్‌ రిప్లై పెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని