Upasana: వీటిని ఇప్పటి వరకు షేర్‌ చేయలేదంటే ఆశ్చర్యంగా ఉంది: ఉపాసన

తాజాగా ఉపాసన (Upasana) తన సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు షేర్‌ చేసింది. వాటికి పెట్టిన క్యాప్షన్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Published : 29 May 2023 12:26 IST

హైదరాబాద్‌: తెలుగు ఇండస్ట్రీలో స్టార్‌ కపుల్‌ అనగానే మొదట గుర్తొచ్చేది రామ్‌ చరణ్‌-ఉపాసననే. వీళ్లిద్దరూ అభిమానులతో ఎప్పుడూ టచ్‌లో ఉంటారు. సోషల్‌మీడియా వేదికగా వాళ్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటుంటారు. మరి కొన్ని రోజుల్లో వీళ్లు తల్లిదండ్రులు కానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉపాసన (Upasana) తన మూడో నెల రోజులను గుర్తుచేసుకుంది. అప్పుడు తీయించుకున్న ఫొటోలను షేర్‌ చేసింది. ప్రస్తుతం అవి వైరలవుతున్నాయి. వాటికి ఆమె పెట్టిన క్యాప్షన్‌ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

‘ఆశ్చర్యంగా ఉంది..  నా గ్యాలరీలో ఉన్న ఇంత మంచి ఫొటోలను నేను ఇప్పటి వరకు షేర్‌ చేయలేదా..!’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇక ఈ ఫొటోలకు నెటిజన్లతో పాటు సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. ‘ఎంతో అందంగా ఉన్నావు’ అని మహేశ్‌ బాబు భార్య నమ్రత శిరోద్కర్‌ (Namrata Shirodkar) కామెంట్‌ పెట్టగా హార్ట్‌ సింబల్స్‌తో ఉపాసన రిప్లై ఇచ్చింది. ఇక ప్రస్తుతం రామ్‌ చరణ్‌ (Ram Charan) కూడా షూటింగ్‌లకు బ్రేక్‌ తీసుకుని ఉపాసనతో ఉంటున్నాడు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని