OTT Movies: ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలు/సిరీస్‌లివే
ఓటీటీ వేదికగా ఈ వారం సందడి చేసేందుకు సిద్ధమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లేంటో చూసేయండి..
ఇంటర్నెట్ డెస్క్: థియేటర్లలానే ఇప్పుడు ఓటీటీ కూడా ప్రేక్షకుల జీవితంలో భాగమైంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు.. వెండితెరపై సందడి చేసిన సినిమాలతోపాటు కొత్త వెబ్‌సిరీస్‌లను ప్రతివారం అందిస్తున్నాయి. అలా ఈ వారం విడుదలకు సిద్ధమైన ప్రాజెక్టులేవంటే..?
ముగ్గురి కథ.. అమిగోస్
నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘అమిగోస్’ (Amigos). యాక్షన్ డ్రామా నేపథ్యంలో దర్శకుడు రాజేంద్ర రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 10న బాక్సాఫీసు ముందుకు వచ్చింది. విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 1 నుంచి ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’(Netflix)లో స్ట్రీమింగ్ కానుంది.
హిందీ.. అల వైకుంఠపురములో
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన సూపర్‌హిట్ తెలుగు సినిమా ‘అల వైకుంఠపురములో’.. హిందీలో ‘షెహజాదా’ (Shehzada)గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా దర్శకుడు రోహిత్ ధావన్ రీమేక్ చేశారు. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదలై అంతగా ఆకట్టుకోని ఈ సినిమా ఏప్రిల్ 1 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదే ప్లాట్‌ఫామ్ వేదికగా సందడి చేయనున్న మరికొన్ని సినిమాలివీ..
* ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ) మార్చి 31
* కిల్ బాక్సూన్ (కొరియన్) మార్చి 31
* మర్డర్ మిస్టరీ 2 (హాలీవుడ్) మార్చి 31
తండ్రిని చంపిన హంతకుణ్ని పట్టుకుందా?
బాలీవుడ్ నటులు సారా అలీఖాన్ (Sara Alikhan), విక్రాంత్ మాస్సే ప్రధాన పాత్రల్లో పవన్ కృపాలని రూపొందించిన చిత్రం ‘గ్యాస్‌లైట్’ (GasLight). ఈ సినిమా నేరుగా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్’ (Disney+Hotstar)లో మార్చి 31న విడుదలకాబోతుంది. తన తండ్రిని చంపిన హంతకుణ్ని కనిపెట్టే కూతురి పాత్రలో సారా నటించింది. మరి, ఆమె.. హంతకుణ్ని పట్టుకోగలిగిందా, లేదా? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సంతోష్ శోభన్, నటి గౌరి జి. కిషన్ జంటగా నటించిన ఫీల్‌గుడ్ ప్రేమకథా చిత్రం ‘శ్రీదేవి.. శోభన్‌బాబు’ (sridevi shoban babu). ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. గత నెలలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ‘డిస్నీ+హాట్‌స్టార్’లో సందడి చేస్తోంది. ఇదే ఓటీటీలో ఇంకా ఏవేవీ రిలీజ్ కాబోతున్నాయంటే..?
* డూగీ కామియలోహ ఎండీ (హిందీ): మార్చి 31
అమెజాన్ ప్రైమ్ వీడియో
- ది పవర్ (వెబ్‌సిరీస్) మార్చి 31
జీ5
- అగిలన్ (తమిళ్) మార్చి 31
- అయోధ్య (తమిళ్) మార్చి 31
- యునైటెడ్ కచ్చే (హిందీ) మార్చి 31
ఆహా
‘పుష్ప’ ఫేం (కేశవ) జగదీష్ ప్రతాప్ బండారి ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’ Sathi Gani Rendu Ekaralu). అభినవ్ రెడ్డి దర్శకత్వం ఈ సినిమా ఏప్రిల్ 1 నుంచి ‘ఆహా’ (aha)లో స్ట్రీమింగ్ కానుంది. ఇదే ఓటీటీలో డాక్యుమెంటరీ ‘గోదారి’ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
సన్‌నెక్ట్స్
- భగీర (తమిళ్): మార్చి 31
- మిస్టర్ బ్యాచ్‌లర్ (కన్నడ): మార్చి 31
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం రెడ్‌కార్నర్ నోటీస్ జారీ చేసిన ఇంటర్‌పోల్
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
Andhra news: ఐబీ సిలబస్ విధివిధానాల కోసం కమిటీల ఏర్పాటు
-
Ram Pothineni: ‘స్కంద’ మాస్ చిత్రం మాత్రమే కాదు..: రామ్
-
BJP: మధ్యప్రదేశ్ అసెంబ్లీ బరిలో కేంద్రమంత్రులు, ఎంపీలు.. 39మందితో భాజపా రెండో జాబితా!