Tollywood: సంక్రాంతి టు ఉగాది.. ఆ ఓటీటీలో నాన్‌స్టాప్‌ వినోదం.. కొత్త సినిమాలివే!

తమ యూజర్లకు నాన్‌స్టాప్‌ వినోదాన్ని పంచేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ సిద్ధమవుతోంది. తమ యాప్‌లో స్ట్రీమింగ్‌ కాబోయే కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల జాబితాను ప్రకటించింది.

Published : 04 Jan 2023 01:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఏడాది సంక్రాంతి నుంచి ఉగాది వరకు ప్రేక్షకులకు నాన్‌స్టాప్‌ వినోదం పంచేందుకు ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha) సిద్ధమైంది. త్వరలో తమ యాప్‌లో స్ట్రీమింగ్‌ కాబోయే కొత్త సినిమాలు,సిరీస్‌లు, రియాలిటీ షో వివరాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు ఓ వీడియోనూ విడుదల చేసింది. థియేటర్లలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉన్న చిత్రాల జాబితాను ఇప్పుడే ప్రకటించి, ఆసక్తి పెంచుతోంది. కొత్తగా ఏం రాబోతున్నాయంటే..

సినిమాలు

* మైఖేల్‌ (సందీప్‌ కిషన్‌ హీరో)

* వినరో భాగ్యము విష్ణు కథ (కిరణ్‌ అబ్బవరం హీరో)

* కల్యాణం కమనీయం (సంతోశ్‌ శోభన్‌ హీరో)

ఆహా ఒరిజినల్‌ ఫిల్మ్స్‌/ వెబ్‌ సిరీస్‌లు

* ఇంటింటి రామాయణం

* సత్తిగాని రెండెకరాలు

* పాపం పసివాడు

* న్యూసెన్స్‌

* బాలుగాని టాకీస్‌

* గీతా సుబ్రహ్మణం 3

* బీఎఫ్‌ఎఫ్‌ 2

* విడుదల తేదీలను ఇంకా ఖరారు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని