Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Telugu Movies: ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలివే!

Published : 02 Aug 2021 09:25 IST

ఇటీవల థియేటర్లు తెరుచుకోవడంతో ‘తిమ్మరుసు’, ‘ఇష్క్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తున్నాయి. గతవారంలాగే ఈ వారం కూడా థియేటర్‌తో పాటు, ఓటీటీల్లోనూ పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుట పడుతున్న నేపథ్యంలో పెద్ద చిత్రాలు రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు తొలివారంలో థియేటర్‌/ఓటీటీల్లో సందడి చేయనున్న సినిమాలేంటో చూసేయండి.

ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌-9 (ఆగస్టు 5)

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్‌ ప్రియులను అలరించే చిత్రాల్లో ‘ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌’ సిరీస్‌ ఒకటి. ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటివరకూ ఎనిమిది చిత్రాలు విడుదలై సందడి చేయగా, 9వ చిత్రం ‘ఎఫ్‌9’ త్వరలో భారతీయ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయంగా విడుదలైన ఈ సినిమా కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. విన్‌ డీజిల్‌, మిచెల్లీ రోడ్రిగోజ్‌, టైర్సీ గిబ్సన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా ఆగస్టు 5న ఇంగ్లీష్‌, హిందీతో పాటు, ఇతర భారతీయ భాషల్లోనూ విడుదల కానుంది. జస్టిన్‌ లిన్‌ దర్శకత్వం వహించారు.


ది సూసైడ్‌ స్క్వాడ్‌(ఆగస్టు 5)

యాక్షన్‌ చిత్రాలను ఇష్టపడే వారి కోసం మరో హాలీవుడ్‌ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. జేమ్స్‌ గన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్‌ హీరో ఫిల్మ్‌ ‘ది సూసైడ్‌ స్క్వాడ్‌’. మార్గట్‌ రోబీ, ఇడ్రిస్‌ ఎల్బా, జాన్‌ సెనా తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 5న అమెరికాతో పాటు భారత్‌లోనూ విడుదల కానుంది.


ఎస్‌ఆర్‌ కల్యాణమండపం(ఆగస్టు 6)

కిరణ్‌ అబ్బవరం, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎస్‌ఆర్‌ కల్యాణమండపం’. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీధర్‌ గాదె దర్శకత్వం వహించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా థియేటర్లు తెరుకోవడంతో ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు కళాశాలలో చదువుకునే యువకునిగా, ఇటు కల్యాణమండపాన్ని నడిపే వ్యక్తిగా కథానాయకుడు కనిపించనున్నాడు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని పాటలు యువతను విశేషంగా అలరిస్తున్నాయి.


ముగ్గురు మొనగాళ్లు(ఆగస్టు 6)

శ్రీనివాస్ రెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ముగ్గురు మొన‌గాళ్లు’. అభిలాష్ రెడ్డి దర్శక‌త్వం వ‌హిస్తున్నారు. క‌ళ్లు క‌నిపించని, చెవులు వినిపించ‌ని, మాట్లాడ‌లేని ముగ్గురు వ్యక్తుల క‌థ ఇది. స‌ర‌దాగా సాగుతూనే ఓ హత్య కేసు మిస్టరీ కథా నేపథ్యంతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. ఈ సినిమాలో రాజా ర‌వీంద్ర, దివంగ‌త న‌టుడు టీఎన్ఆర్  కీల‌క పాత్రలు పోషించారు. చిత్ర మందిర్ స్టూడియోస్ ప‌తాకంపై  అచ్యుత్ రామారావు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి  సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు(ఆగస్టు6)

హస్వంత్‌ వంగ, నమ్రత దరేకర్‌, కల్యాణ్‌ గౌడ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’. వై.యుగంధర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తనికెళ్ల భరణి, తులసి, రాజా రవీంద్ర, పూజా రామచంద్రన్‌, ఐడ్రీమ్‌ అంజలి తదితరలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా కూడా ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు సాహిత్య సాగర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.


మెరిసే మెరిసే (ఆగస్టు6)

దినేష్‌ తేజ్‌, శ్వేతా అవస్తి జంటగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. పవన్‌ కుమార్‌.కె దర్శకుడు. వెంకటేష్‌ కొత్తూరి నిర్మాత. కార్తిక్‌ కొడగండ్ల స్వరాలందించారు. ఈ ప్రేమకథా చిత్రం కూడా ఆగస్టు 6న థియేటర్‌లలో విడుదల కానుంది.


క్షీర సాగర మథనం(ఆగస్టు6)

భావోద్వేగంతో కూడిన ఏడు పాత్రల సమాహారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘క్షీరసాగర మథనం’. మానస్‌ నాగులపల్లి, సంజయ్‌ రావు‌, అక్షంత్‌ సోనేశ్వర్‌,  గౌతమ్‌ ఎస్‌ శెట్టి, ఛరిష్మా, మహేశ్‌ కొమ్ముల తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిల్‌ పంగులూరి దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకానుంది. ఈ సినిమాకి అజయ్‌ అరసాడ సంగీతం అందించారు. యువతను ఆకట్టుకునేలా ‘క్షీర సాగర మథనం’ తీర్చిదిద్దినట్లు చిత్ర బృంద గతంలో తెలిపింది.


ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే..

డయల్‌ 100(ఆగస్టు 6)

మనోజ్‌ బాజ్‌పాయ్‌, నీనా గుప్త కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘డయల్‌ 100’. రెన్సిల్‌ డిసిల్వా దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 6న జీ5 వేదికగా విడుదల కానుంది. పోలీస్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీస్‌ అధికారికి ఫోన్‌ కాల్‌ వస్తుంది. ఒక మహిళ ఏడుస్తూ ‘నేను చనిపోవాలనుకుంటున్నా’ అని చెబుతుంది. అందరూ అది ఫేక్‌ కాల్‌ అనుకుంటారు. కానీ, కొద్దిసేపటి తర్వాత మళ్లీ ఆ మహిళ ఫోన్‌ చేసి, ‘బిడ్డను కోల్పోవడం అంటే ఏంటో మీకు తెలుసా? నాకు తెలుసు’ అని ఆ మహిళ సమాధానం ఇస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆ పోలీస్‌ ఆఫసర్‌కూ, మహిళకూ ఉన్న సంబంధం ఏంటి? ప్రమాదంలో పడిన తన కుటుంబాన్ని పోలీస్‌ ఆఫీసర్‌ ఎలా కాపాడుకున్నాడు? అన్నదే ‘డయల్‌ 100’. సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.


ఆగస్టు 4, 2021

ఐ మే డెస్ట్రాయ్‌ యు(సీజన్‌-1) హెచ్‌బీవో

మాన్‌స్టర్స్‌ ఎట్‌ వర్క్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

షార్ట్‌సర్క్యూట్‌ సీజన్‌-1 (డిస్నీ+ హాట్‌స్టార్‌)

టర్నర్‌ అండ్‌ హూచ్‌ (డిస్నీ+ హాట్‌స్టార్‌)

ఆగస్టు 6, 2021

స్టార్‌ వార్స్‌: గార్డెన్‌ రామ్‌సే: అన్‌ ఛార్టెడ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)

స్టార్‌ వార్స్‌: ది బ్యాడ్‌ బ్యాచ్‌(డిస్నీ+ హాట్‌స్టార్‌)

ది మిస్టీరియస్‌ బెనిడిక్ట్‌ సొసైటీ((డిస్నీ+ హాట్‌స్టార్‌)

బ్రేకింగ్‌ బాబీ బోన్స్‌(సీజన్‌-1) (నేషన్‌ జియోగ్రాఫిక్‌)


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని