Upcoming Movies: బాక్సాఫీస్‌కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో

ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ హవా కొనసాగుతోంది. ఈ క్రమంలో మరో భారీ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. మరి థియేటర్‌తో పాటు, ఓటీటీలో ప్రేక్షకులను అలరించనున్న ఆ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటి?

Published : 08 Jul 2024 09:48 IST

‘భారతీయుడు’ మళ్లీ వస్తున్నాడు

దాదాపు పాతికేళ్ల కిందట అవినీతి, లంచగొండితనంపై ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసిన చిత్రం ‘భారతీయుడు’ (Bharateeyudu 2). కమల్‌హాసన్‌ (Kamal Haasan) కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్‌గా ‘భారతీయుడు2’ రాబోతోంది. దాదాపు ఐదారేళ్ల పాటు చిత్రీకరణ జరుపుకొన్న ఈ మూవీ పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు విడుదలవుతోంది. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్ర తొలి భాగం జులై 12న (Bharateeyudu 2 release date) పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సేనాపతిగా కమల్‌హాసన్‌ మళ్లీ సందడి చేయబోతున్నారు. ఆయనతోపాటు, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా, బ్రహ్మానందం, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండటంతో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు అవినీతి ఉద్యోగులపై కత్తిదూసిన చేసిన సేనాపతి ఈసారి అవినీతి చేస్తున్న రాజకీయనాయకులపై పోరాటం చేయనున్నారు.


కుటుంబ కథతో ‘సారంగదరియా’

రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘సారంగదరియా’ (Sarangadariya). పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడు. ఉమాదేవి, శరత్‌చంద్ర నిర్మాతలు. మధ్య తరగతి కుటుంబంలో జరిగిన సంఘర్షణల నేపథ్యంలో సాగే చిత్రమిదని, ఇంటిల్లిపాదికీ నచ్చేలా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. జులై 12న ఈ చిత్రం థియేటర్‌లో విడుదల కానుంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/సిరీస్‌లివే!

సామాజిక సందేశంతో...

వైవిధ్యమైన చిత్రాలు, పాత్రలు ఎంచుకుంటారు నటుడు ఫ‌హాద్ ఫాజిల్‌(Fahad Faasil). ఆయన కీలక పాత్రలో న‌టించిన మ‌ల‌యాళ (Malayalam) మూవీ ధూమం. అపర్ణ బాలమురళి కథానాయిక. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్‌ నిర్మించిన ఈ చిత్రం గతేడాది విడుదలై సామాజిక సందేశంతో ఇవ్వడంతో పాటు, బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ ఆహాలో జులై 11వ (Dhoomam telugu ott) తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా పోస్టర్ పంచుకుంది.

 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • కమాండర్‌ కరణ్‌ సక్సేనా (హిందీ సిరీస్‌) జులై 08
 • మాస్టర్‌ మైండ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 10
 • అగ్నిసాక్షి (తెలుగు సిరీస్‌) జులై 12
 • షో టైమ్‌ (వెబ్‌సిరీస్‌) జులై 12
 • నెట్‌ఫ్లిక్స్‌
 • రిసీవర్‌ (వెబ్‌సిరీస్) జులై 10
 • వైల్డ్‌ వైల్డ్ పంజాబ్‌ (హిందీ ) జులై 10
 • వైకింగ్స్‌ : వాల్‌ హల్లా 3 (వెబ్‌సిరీస్‌) జులై 11
 • సోనీలివ్‌
 • 36 డేస్‌ (హిందీ సిరీస్‌) జులై 12
 • జియో సినిమా
 • పిల్‌ (హిందీ సినిమా) జులై 12
 • మనోరమా మ్యాక్స్‌
 • మందాకిని (మలయాళం) జులై 12
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని