Telugu Movies: ఈ వారం చిన్న చిత్రాలదే హవా.. థియేటర్‌/ఓటీటీ మూవీస్‌ ఇవే!

Telugu Movies: ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ అలరించే చిత్రాలు ఏంటి? ఏయే ఓటీటీ వేదికల్లో ఏ చిత్రాలు స్ట్రీమింగ్‌ అవుతాయి? చూసేయండి.

Updated : 22 May 2023 12:53 IST

Telugu movies: వేసవిలో వరుస సినిమాలు విడుదలవుతున్నా కొన్ని మాత్రమే అలరిస్తున్నాయి. ఇక మే చివరి వారంలో థియేటర్‌ను చిన్న చిత్రాలే పలకరించనున్నాయి. అలాగే ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు క్యూ కడుతున్నాయి.

ట్రెండింగ్‌ మూవీ ‘మళ్లీ పెళ్లి’

ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మళ్లీ పెళ్లి’ (Malli Pelli). నరేష్‌ వి.కె, పవిత్ర లోకేష్‌ కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే 26 థియేటర్‌లలో విడుదల కానుంది. ‘‘మళ్లీ పెళ్లి’ అంటే ప్రధాన పాత్రల మధ్య జరిగే రొమాన్స్‌ అనుకోకండి. ఇందులో ప్రేమ, భావోద్వేగాలు, గాఢత కలిగిన డ్రామాతో పాటు సంచలనాత్మక కథాంశం ఉంది. అలాగే సమకాలీన సామాజిక సమస్యలను చర్చిస్తుంది’’ అని ఎం.ఎస్‌.రాజు చెబుతున్నారు. నరేష్‌, పవిత్రా లోకేష్‌ కీలక పాత్రల్లో ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ట్రెండింగ్‌లో ఉంది.


30మంది కొత్త నటీనటులతో..

సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’ (Mem Famous). ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిలింస్‌ పతాకాలపై శరత్‌ చంద్ర, అనురాగ్‌ రెడ్డి, చంద్రు మనోహర్‌ సంయుక్తంగా నిర్మించారు. సిరిరాశి, మణి, మౌర్య చౌదరి, కిరణ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తెలంగాణలోని ఒక ఊరిలో జరిగే కథ ఇది. ఈ కథకు తగ్గట్లుగా 30మంది కొత్త నటీనటుల్ని ఎంపిక చేసి సినిమా చేశాం.సినిమా అంతా మంచి మటన్‌ ధావత్‌ ఇచ్చినట్లుంటుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.


కేరళలో అదరగొట్టి..

జూడే ఆంథోని జోసెఫ్‌ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్‌, అసిఫ్‌ ఆలీ, లాల్‌ తన్వి రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘2018’. ఇటీవల మలయాళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. 10 రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఈ క్రమంలో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. మే 26 ‘2018’ తెలుగు వెర్షన్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.


వీటితో పాటు, మరికొన్ని చిన్న చిత్రాలు ‘గ్రే’, ‘హీరో ఆఫ్‌ ఇండియా’, ‘#మెన్‌టూ’ ‘జైత్ర’ తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలివే!

ఓటీటీలో సల్మాన్‌ చిత్రం

సల్మాన్‌ఖాన్‌ కథానాయకుడిగా ఫర్హద్‌ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఎంటర్‌టైనర్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కి జాన్‌’ (Kisi Ka Bhai Kisi Ki Jaan). పూజా హెగ్డే కథానాయిక. తెలుగు హీరో వెంకటేశ్‌ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తమిళ సూపర్‌ హిట్‌ ‘వీరమ్‌’కు రీమేక్‌గా దీన్ని తెరకెక్కించారు. మే 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.


ఎట్టకేలకు వస్తున్న ‘భేదియా’

వరుణ్‌ ధావన్‌ (Varun Dhawan) కృతి సనన్‌ (Kriti Sanon) జంటగా నటించిన హారర్‌ కామెడీ మూవీ ‘భేదియా’ (bhediya ott release). తెలుగులో దీన్ని ‘తోడేలు’ పేరుతో విడుదల చేశారు. అమర్‌ కౌశిక్‌ తెరకెక్కించారు.  ప్రముఖ స్ట్రీమింగ్‌ వేదిక జియో సినిమాలో మే 26వ తేదీ నుంచి ‘భేదియా’ స్ట్రీమింగ్‌ కానుంది.


సిటడెల్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌

ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ సిరీస్‌ ‘సిటడెల్‌’ (Citadel). రిచర్డ్‌ మ్యాడన్‌ (Richard Madden), ప్రియాంక చోప్రా (Priyanka Chopra), జోన్స్‌, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఏప్రిల్‌ 28 నుంచి వారానికి ఒక ఎపిసోడ్‌ చొప్పున అందిస్తున్నారు. చివరి ఎపిసోడ్‌ మే 26 స్ట్రీమింగ్‌ కానుంది.


నెట్‌ఫ్లిక్స్‌

  • విక్టిమ్‌/సస్పెక్ట్‌ (హాలీవుడ్) మే 23
  • మదర్స్‌ డే (హాలీవుడ్‌)  మే 25
  • ఫ్యూబర్‌ (వెబ్‌సిరీస్‌) మే 25
  • బ్లడ్‌ అండ్‌ గోల్డ్‌ (హాలీవుడ్‌) మే 26

    అమెజాన్‌ ప్రైమ్‌

  • మిస్సింగ్‌ (ఒరిజినల్‌ మూవీ) మే 24

జీ5

  • సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (ఒరిజినల్‌ మూవీ) మే 23

డిస్నీ+హాట్‌స్టార్‌

  • అమెరికన్‌ బోర్న్‌ చైనీస్‌ (వెబ్‌సిరీస్‌) మే 24
  • సిటీ ఆఫ్‌ డ్రీమ్స్‌ (వెబ్‌సిరీస్‌) మే 26

ఆహా

  • గీతా సుబ్రహ్మణ్యం (తెలుగు సిరీస్‌-3) మే 23
  • సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మే 26

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని