OTT Movies: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్
తెలుగుతో పాటు, వివిధ భాషల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి
OTT Movies: ఇప్పటికే పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ఓటీటీలోనూ కొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దామా!
‘ముఖచిత్రం’ వచ్చేస్తోంది!
ప్రియ వడ్లమాని, వికాశ్ వశిష్ట, విశ్వక్‌సేన్ కీలక పాత్రల్లో నటించిన కోర్టురూమ్ డ్రామా ‘ముఖచిత్రం’. గంగాధర్ దర్శకుడు. గతేడాది డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలుగు ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
‘పవర్’ఫుల్ టాక్ షో టైమ్ వచ్చేస్తోంది!
బాలకృష్ణ (Balakrishna) వ్యాఖ్యాతగా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే’. రెండో సీజన్‌లో భాగంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో సందడి చేశారు. ఇప్పుడు ఈ షోలో అలరించడానికి అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) సిద్ధమయ్యారు. ఆయనతో బాలకృష్ణ జరిపిన సరదా సంభాషణలు, ఇతర విశేషాలకు సంబంధించిన ఎపిసోడ్ ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 9గంటల నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రం
హాస్యనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు కోవై సరళ. ఆమె కీలక పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘సెంబి’. డిసెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈసినిమా విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పుడు ఫిబ్రవరి 3 నుంచి డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా కానుంది. ప్రభు సాల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రోడ్ జర్నీ నేపథ్యంలో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
మరో థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్
సినిమాలతో పాటు, ఓటీటీ ప్రేక్షకులను వెబ్‌సిరీస్‌లు ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ జాబితాలో అలాంటి మరో వెబ్‌సిరీస్ రానుంది. ‘జహనాబాద్ ఆఫ్ లవ్ అండ్ వార్’. రాజీవ్ బర్న్వల్ దర్శకత్వం వహించారు. రిత్విక్ భౌమిక్, పరంభ్రట ఛటర్జీ, హర్షిత గౌర్‌లు కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి సోనీలివ్ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే మరొకొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
* క్లాస్ (వెబ్‌సిరీస్- సీజన్-1) ఫిబ్రవరి 3
* ట్రూ స్పిరిట్ ఫిబ్రవరి 3
* ఇన్‌ఫయీస్టో (హాలీవుడ్) ఫిబ్రవరి 3
* స్ట్రామ్ బాయిల్ ఫిబ్రవరి 3
* వైకింగ్ ఊల్ఫ్ ఫిబ్రవరి 3
జీ5
* వీకం (మలయాళం) ఫిబ్రవరి 3
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
SRH vs RR: ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్.. మెట్రో రైళ్ల సంఖ్య పెంపు
-
India News
Delhi Airport: ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ
-
Crime News
Andhra News: అమర్తలూరు పోలీస్ స్టేషన్లో వైకాపా కార్యకర్తల వీరంగం
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..