Telugu Movies: ఈ వారం ఇటు థియేటర్ అటు ఓటీటీ సందడే సందడి
upcoming telugu movies: ఫిబ్రవరిలో వరుస చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా ఈనెల రెండో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు రాబోతున్నాయి.
Telugu Movies: సాధారణంగా ఫిబ్రవరి నెలలో కొత్త సినిమాలు థియేటర్‌కు రావడానికి అంత ఆసక్తి చూపవు. కారణం విద్యార్థులకు పరీక్షల సమయం. కానీ, ఈసారి ప్రతివారం ఒకట్రెండు ఆసక్తికర చిత్రాలు సందడి చేయనున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీ (Ott Movies)లో అలరించేందుకు సిద్ధమైన సినిమాలేంటో చూసేద్దామా!
ప్రేక్షకుల ముందుకు వస్తున్న మరో కన్నడమూవీ
చిత్రం: వేద (Vedha); నటీనటులు: శివ రాజ్‌కుమార్, గన్వి లక్ష్మణ్, శ్వేత చెన్నగప్ప, ఉమాశ్రీ, అదితి సాగర్; సంగీతం: అర్జున్ జన్య; నిర్మాత: గీతా శివరాజ్‌కుమార్; దర్శకత్వం: హర్; విడుదల తేదీ: 09-02-2023
కల్యాణ్‌రామ్ ట్రిపుల్ ధమాకా
చిత్రం: అమిగోస్ (Amigos); నటీనటులు: కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram), ఆషికా రంగనాథ్, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు; సంగీతం: జిబ్రాన్; నిర్మాత: మైత్రీ మూవీమేకర్స్; దర్శకత్వం: రాజేంద్రరెడ్డి; విడుదల: 10-02-2023
యువతీ యువకులు లిఫ్ట్‌లో ఇరుక్కుపోతే..
చిత్రం: పాప్‌కార్న్ (Popcorn); నటీనటులు: ఆవికా గోర్, సాయి రోనక్, తదితరులు; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; నిర్మాత: భోగేంద్రగుప్త; దర్శకత్వం: మురళీగంధం; విడుదల తేదీ: 10-02-2023
ఐపీఎల్: ఇట్స్ ప్యూర్ లవ్
చిత్రం: ఐపీఎల్ (IPL: It’s Pure Love); నటీనటులు: విశ్వ కార్తికేయ, నితిన్ నషా, అర్చనా గౌతమ్, అవంతిక తదితరులు; సంగీతం: వెంగి; నిర్మాత: బీరం శ్రీనివాస్; దర్శకత్వం: సురేష్ లంకపల్లి; విడుదల: 10-02-2023
చిత్రం: దేశం కోసం భగత్ సింగ్ (desam kosam bhagath singh); నటీనటులు: రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్, జీవా, సుధ తదితరులు; నిర్మాత, దర్శకత్వం: రవీంద్ర గోపాల; విడుదల తేదీ: 10-02-2023
చిత్రం: చెడ్డీ గ్యాంగ్ తమాషా (cheddi gang tamasha); నటీనటులు: వెంకట్, గాయత్రి, విజయ్ కార్తిక్, క్రాంతి కిరణ్, తేజ, దేవినేని చైతన్య తదితరులు; నిర్మాత: క్రాంతి కిరణ్; దర్శకత్వం: వెంకట్ కల్యాణ్ జి; విడుదల తేదీ: 10-02-2023
ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు
థియేటర్‌లో అలరించిన యాక్షన్ హంగామా
చిత్రం: తునివు/తెగింపు (thunivu); నటీనటులు: అజిత్, సముద్రఖని, మంజు వారియర్ తదితరులు; సంగీతం: జిబ్రాన్; నిర్మాత: బోనీ కపూర్; దర్శకత్వం:హె.వినోద్; స్ట్రీమింగ్ తేదీ: 08-02-2023; స్ట్రీమింగ్ వేదిక: నెట్‌ఫ్లిక్స్
అమ్మాయి కుట్ర ఎలా బయటపడింది?
చిత్రం: రాజయోగం (rajayogam); నటీనటులు: సాయి రోనక్, అంకిత సాహా, బిస్మీ వాస్, అజయ్ ఘోష్ తదితరులు; సంగీతం: అరుణ్ మురళీధరన్; నిర్మాత: దారక్ నందకిషోర్; దర్శకత్వం: రామ్ గణపతి; స్ట్రీమింగ్ తేదీ: 09-02-2023; స్ట్రీమింగ్ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్
సొంతంగా డబ్బులు ముద్రిస్తే..
వెబ్‌సిరీస్: ఫర్జీ (farzi); నటీనటులు: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, కేకే మేనన్, రాశీఖన్నా తదితరులు; నిర్మాత, దర్శకత్వం: రాజ్ అండ్ డీకే; స్ట్రీమింగ్ తేదీ: 10-02-2023; స్ట్రీమింగ్ వేదిక: అమెజాన్ ప్రైమ్ వీడియో
పెళ్లి తర్వాత అబ్బాయి పడిన తిప్పలు..
చిత్రం: కళ్యాణం కమనీయం (kalyanam kamaneeyam); నటీనటులు: సంతోష్ శోభన్, ప్రియా భవానీ శంకర్, దేవి ప్రసాద్, పవిత్రా లోకేశ్; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్; నిర్మాత: యువి కాన్సెప్ట్స్; దర్శకత్వం: అనిల్ కుమార్ ఆళ్; స్ట్రీమింగ్ తేదీ: 10-02-2023; స్ట్రీమింగ్ వేదిక: ఆహా
ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు..
నెట్‌ఫ్లిక్స్
- బిల్ రస్సెల్: లెజెండ్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 8
- ద ఎక్స్ఛేంజ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 8
- యు (వెబ్‌సిరీస్-4) ఫిబ్రవరి 9
- డియర్ డేవిడ్ (హాలీవుడ్) ఫిబ్రవరి 9
- యువర్ ప్లేస్ ఆర్ మైన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10
- టెన్ డేస్ ఆఫ్ ఎ గుడ్‌మాన్ (హాలీవుడ్) ఫిబ్రవరి 10
డిస్నీ+హాట్‌స్టార్
- నాట్ డెడ్ ఎట్ (వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 09
- హన్నికాస్ లవ్ షాదీ డ్రామా (రియాల్టీ షో) ఫిబ్రవరి 10
సోనీలివ్
- నిజం విత్ స్మిత (టాక్ షో) ఫిబ్రవరి 10
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
PBKS vs KKR: మ్యాచ్‌కు వర్షం అంతరాయం.. కోల్‌కతాపై పంజాబ్ విజయం..
-
World News
Pope Francis: నేను ఆరోగ్యంగా ఉన్నా: పోప్ ఫ్రాన్సిస్
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు: చంద్రబాబు