Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
Telugu movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఆసక్తికర చిత్రాలు.. వెబ్‌సిరీస్‌లు ఇవే!
Telugu Movies: గత వారం థియేటర్‌ను చిన్న చిత్రాలు ముంచెత్తగా, ఈ వారం ఆ సందడి కాస్త తగ్గింది. సినీ ప్రేక్షకులు ఎన్నాళ్లగానో వేచిచూస్తున్న సినిమాతో పాటు, ఇంకా థియేటర్‌లో ఏయే చిత్రాలు విడుదలవుతున్నాయి.. ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైనవి ఏంటి? చూసేయండి.
కామెరూన్ విజువల్ వండర్ వచ్చేస్తోంది!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్2’ (Avatar2). జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ పేరుతో డిసెంబరు 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ‘అవతార్2’ (Avatar: The Way of Water)లో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్‌లెట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మానవుల కారణంగా ‘పాండోరా’ను కోల్పోయిన నావీ తెగ ఎటు పయనించింది. సముద్రంతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడ వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తదితర విషయాలను ‘అవతార్2’లో చూపించనున్నారు.
పాన్ ఇండియా మూవీ ‘శాసనసభ’
ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా వేణు మడికంటి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘శాసనసభ’ (Sasanasabha). తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని సంయుక్తంగా నిర్మించారు. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు.
అరుణ్ విజయ్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్
తమిళ్ హీరో అరుణ్ విజయ్ (Arun Vijay) నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’ (Aakrosham). డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. ఇందులో అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. జీఎన్‌ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్‌కి జోడీగా పలక్ లాల్వానీ నటిస్తోంది.
తెలుగులో మొదటి మోషన్‌క్యాప్చర్ మూవీ
అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘పసివాడి ప్రాణం’ (pasivadi pranam). ఎన్.ఎస్.మూర్తి దర్శకుడు. తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్నమైన ‘లైవ్ కమ్ యానిమేషన్’ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’లో నటించి మెప్పించిన ఇప్పటి సీరియల్ నటి సుజిత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. డిసెంబరు 16న సినిమా థియేటర్‌లలో విడుదల కానుంది.
శ్రీలీల కన్నడ చిత్రం ఇప్పుడు తెలుగులో..
విరాట్, శ్రీలీల, అపూర్వగౌడ కీలక పాత్రల్లో నటించిన కన్నడ చిత్రం ‘ఐ లవ్ యు ఇడియట్’ (I Love you idiot). ఏపీ అర్జున్ దర్శకుడు. 2019లోనే ‘కిస్’ పేరుతో కన్నడలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు డిసెంబరు 17న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.
విభిన్న ప్రేమకథా చిత్రం ‘సుందరాంగుడు’
కృష్ణసాయి హీరోగా.. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘సుందరాంగుడు’ (Sundarangudu). వినయ్‌బాబు దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్ - ఎమ్.ఎస్.కె. ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు - చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మించారు.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఆహా
* ఇంటింటి రామాయణం (తెలుగు) డిసెంబరు 16
నెట్‌ఫ్లిక్స్
* డాక్టర్ జి (హిందీ) డిసెంబరు 11
* అరియిప్పు (మలయాళం)డిసెంబరు 16
* కోడ్‌నేమ్: తిరంగా (హిందీ) డిసెంబరు 16
* ఇండియన్ ప్రిడేటర్: బీస్ట్ ఆఫ్ బెంగళూర్ (హిందీ సిరీస్) డిసెంబరు 16
* ద రిక్రూట్ (వెబ్‌సిరీస్) డిసెంబరు 16
జీ5
* స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ (హాలీవుడ్) డిసెంబరు 12
డిస్నీ+హాట్‌స్టార్
* నేషనల్ ట్రెజర్: ఎడ్జ్‌ఆఫ్ హిస్టరీ (వెబ్‌సిరీస్) డిసెంబరు 14
* జగమేమాయ (తెలుగు) డిసెంబరు 15
* గోవిందా నామ్‌మేరా (హిందీ) డిసెంబరు 16
అమెజాన్ ప్రైమ్ వీడియో
* ఫిజిక్స్ వాలా (హిందీ సిరీస్) డిసెంబరు 15
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
మద్యం మత్తులో భార్య, కుమార్తె హత్య
-
Ap-top-news News
మార్చి నెల జీతాలు ఎప్పుడొస్తాయో?
-
Crime News
Duranto Express: బొలెరో వాహనాన్ని ఢీకొట్టిన దురంతో ఎక్స్‌ప్రెస్..
-
Crime News
Couple Suicide: కరోనా దెబ్బకు నెమ్మదించిన వ్యాపారం.. అధిక వడ్డీలకు అప్పులతో..
-
Crime News
హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రకు సూత్రధారి ఫర్హతుల్లానే!
-
General News
Bhadrachalam: రాములోరి పెళ్లికి ఖమ్మం గోటి తలంబ్రాలు