upcoming movies: తుపాను ముందు నిశ్శబ్దం.. ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే!

ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రానున్న ‘కల్కి 2898 ఏడీ’ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో కేవలం వారం ముందు వచ్చేందుకు పెద్ద సినిమాలేవీ ఆసక్తి చూపకపోవడంతో చిన్న సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాయి. మరి థియేటర్‌లో రాబోతున్న ఆ సినిమాలేంటి? ఓటీటీలో ఏయే చిత్రాలు అలరించనున్నాయి?

Updated : 17 Jun 2024 10:25 IST

కాండ్రకోట మిస్టరీ

వరుణ్‌సందేశ్‌ కథానాయకుడిగా రాజేశ్‌ జగన్నాథం స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘నింద’ (Nindha Movie). కాండ్రకోట మిస్టరీ... అనేది ఉపశీర్షిక. అనీ, తనికెళ్లభరణి, భద్రం, సూర్య కుమార్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘విభిన్న కాన్సెప్ట్‌తో వస్తున్న చిత్రమిది. జూన్‌ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాండ్రకోట మిస్టరీ వెనక కథేమిటి? నింద ఎవరిపై అన్నది ఈ సినిమాలో కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది.


మంచి దెయ్యం..

ఇటీవల ‘చారి 111’ అంటూ అలరించిన హాస్యనటుడు వెన్నెల కిషోర్ ఇప్పుడు హార‌ర్ థ్రిల్ల‌ర్‌తో రాబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో న‌టిస్తున్న చిత్రం ఓఎమ్‌జీ (OMG) ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. నందితా శ్వేతా హీరోయిన్. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


హనీమూన్‌ వినోదం

చైతన్యరావు, హెబ్బా పటేల్‌ జంటగా నటించిన చిత్రం ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’ (Honeymoon Express). బాల రాజశేఖరుని దర్శకత్వం వహిస్తున్నారు. కె.కె.ఆర్‌, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. తనికెళ్ల భరణి, సుహాసిని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ‘రొమాంటిక్‌ కామెడీ కథతో రూపొందుతున్న చిత్రమిది. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుంది. చైతన్యరావు, హెబ్బా జోడీ ఆకట్టుకుంటుంది ’ అని సినీ వర్గాలు తెలిపాయి.  జూన్‌ 21న  ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ వారం ఓటీటీ వేదికగా అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

ఈ సారి జీతూ భయ్యా ఏం చేయబోతున్నాడు?

నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా అలరించిన వెబ్ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ (Kota Factory3) ఒకటి. ఐఐటీల్లో అడ్మిషన్స్ కోసం జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థులు, వాళ్లు ఎదుర్కొనే ఒత్తిళ్లు, సవాళ్లు, వాళ్లకు అండగా నిలిచే ఓ జీతూ భయ్యా చుట్టూ తిరిగే సిరీస్ ఇది. ఇప్పటికే రెండు సీజన్లు విజయవంతమవగా ఇప్పుడు ‘కోటా ఫ్యాక్టరీ3’ రాబోతోంది. జూన్‌ 20వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.


థియేటర్‌లో అలరించి..

సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’ (Baak Movie). ఖుష్బూ సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే సొంతం చేసుకుంది. తెలుగులో ‘బాక్‌’ పేరుతో విడుదలై ఇక్కడా అలరించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులకు థ్రిల్‌తో పాటు వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 21 నుంచి తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


 • నెట్‌ఫ్లిక్స్‌
 • ఏజెంట్‌ ఆఫ్‌ మిస్టరీ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 18
 • అవుట్‌ స్టాండింగ్‌ (హాలీవుడ్) జూన్‌ 18
 • మహరాజ్‌ (హిందీ సిరీస్‌) జూన్‌ 19
 • అమెరికాస్‌ స్వీట్‌ హార్ట్స్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 20
 • నడిగర్‌ (మలయాళం) జూన్‌ 21
 • ట్రిగర్‌ వార్నింగ్‌ (హాలీవుడ్‌) జూన్‌21
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • బ్యాడ్‌కాప్‌ (హిందీ) జూన్‌ 21
 • జియో సినిమా
 • ది హోల్డోవర్స్‌ (ఇంగ్లీష్‌) జూన్‌ 16
 • హౌస్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌ 2 (వెబ్‌సిరీస్) జూన్‌ 17
 • ఇండస్ట్రీ (వెబ్‌సిరీస్) జూన్‌ 19
 • బిగ్‌బాస్‌ ఓటీటీ 3 (రియాల్టీ షో ) జూన్‌21
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని