Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Telugu Movies: థియేటర్‌లలో వేసవి వినోదాల విందు కొనసాగుతోంది. అలాగే పలు కొత్త చిత్రాలు సైతం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమయ్యాయి.
Telugu Movies: ప్రతి వారం సరికొత్త సినిమాలు థియేటర్‌ను పలకరిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుండగా, ఈ వారమూ అదే పంథా కొనసాగనుంది. మరి జూన్ రెండో వారంలో ప్రేక్షకులను అలరించే చిత్రాలేంటి? ఓటీటీలో ఏయే సినిమాలొస్తున్నాయా?
చాలా నెలల తర్వాత సిద్ధార్థ్
‘ఆశే ఈ లోకాన్ని నడిపిస్తుంది. అదే ఆశ మన లైఫ్‌ను నిర్ణయిస్తుంది. ఆ ఆశను నెరవేర్చుకోవడానికి ధనమే ఇంధనం. దాని సంపాదించుకోవడానికి ఒక్కొక్కడిదీ ఒక్కో దారి. ఆ దారి అందరికీ ఒకటే అయినప్పుడు..’ అంటూ తన కథ చెబుతున్నారు సిద్ధార్థ్. ఆయన కథానాయకుడిగా కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్కర్’ (Takkar). దివ్యాంశ కౌశిక్ కథానాయిక. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో ‘టక్కర్’ రూపొందించినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమా జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
రెండు గంటల పాటు వినోదాన్ని పంచేలా..
వి.జె. సన్నీ, సప్తగిరి హీరోలుగా డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘అన్‌స్టాపబుల్’ (unstoppable). రజిత్ రావు నిర్మాత. నక్షత్ర, అక్సాఖాన్ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఒత్తిడికి ఒక మాత్రలా పని చేస్తుందని, రెండు గంటల పాటు ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటారని చిత్ర బృందం చెబుతోంది.
తండ్రీతనయుల విమానం గోల
వీరయ్య దివ్యాంగుడు అయినా కొడుకుని మాత్రం ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. కొడుక్కి విమానం ఎక్కడం అంటే ఇష్టం. ఎప్పుడూ పదే పదే తండ్రిని అదే అడుగుతాడు. మరి తండ్రీ కొడుకుల ఈ విమానం చివరికి ఏమైందో తెలియాలంటే ‘విమానం’ (Vimanam) సినిమా చూడాల్సిందే అంటున్నారు సముద్రఖని. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రమిది. మాస్టర్ ధ్రువన్, మీరా జాస్మిన్, అనసూయ, రాహుల్‌రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివ ప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నారు. జూన్ 9న సినిమా విడుదల కానుంది.
ఏనుగు కథ
మాస్టర్ శశాంత్... మరో ఇద్దరు ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘పోయే ఏనుగు పోయే’ (poye enugu poye). కె.ఎస్.నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. పవనమ్మాళ్ కేశవన్ నిర్మాత. ఏనుగు కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా జూన్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఏనుగులు ప్రధాన పాత్ర పోషించిన ‘అడవి రాజా’, ‘అడవిరాముడు’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. అదే తరహాలో సినిమా రూపొందింది’ అని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు/వెబ్‌సిరీస్‌లు
సోనీలివ్
- 2018 (మలయాళం/తెలుగు) జూన్07
నెట్‌ఫ్లిక్స్
- బర్రకుడ క్వీన్స్ (వెబ్‌సిరీస్) జూన్ 05
- ఆర్నాల్డ్ (వెబ్‌సిరీస్) జూన్ 07
- నెవర్ హావ్ ఐ ఎవర్ (వెబ్‌సిరీస్) జూన్ 08
- టూర్ డి ఫ్రాన్స్(వెబ్‌సిరీస్) జూన్ 08
- బ్లడ్ హౌండ్స్ (కొరియన్ సిరీస్) జూన్ 09
అమెజాన్ ప్రైమ్
- మై ఫాల్ట్ (హాలీవుడ్) జూన్ 08
జీ5
- ది ఐడల్ (వెబ్‌సిరీస్) జూన్ 5
డిస్నీ+హాట్‌స్టార్
- అవతార్: ది వే ఆఫ్ వాటర్ (హాలీవుడ్) జూన్ 07
- సెయింట్ ఎక్స్ (వెబ్‌సిరీస్) జూన్07
- ఎంపైర్ ఆఫ్ లైట్ (హాలీవుడ్) జూన్ 09
- ఫ్లామిన్ హాట్ (హాలీవుడ్) జూన్ 10
జియో సినిమా
- బ్లడీ డాడీ (హిందీ) జూన్ 09
- యూపీ 65 (హిందీ సిరీస్) జూన్ 08
యాపిల్ టీవీ ప్లస్
- ది క్రౌడెడ్ రూమ్ (వెబ్‌సిరీస్) జూన్ 08
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Motkupalli Narasimhulu : జైలులో చంద్రబాబుకు ఏదైనా జరిగితే జగన్‌దే బాధ్యత : మోత్కుపల్లి
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu : క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో సవాల్ చేసిన చంద్రబాబు
-
Narendra Modi: శివతత్వం ప్రతిబింబించేలా వారణాసి క్రికెట్ స్టేడియం..
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని