telugu movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

telugu movies: ఈ వారం థియేటర్‌, ఓటీటీలో వస్తున్న చిత్రాలివే!

Published : 09 May 2022 10:18 IST

telugu movies: గత వారం బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలు సందడి చేయగా, ఈసారి సింహం సింగిల్‌గా వస్తుందంటూ అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు ఒక్కడే థియేటర్‌కు వస్తున్నారు. మరి ఈ వారం థియేటర్‌, ఓటీటీలో వచ్చే చిత్రాలు వాటి విశేషాలు చూసేద్దామా!

‘పోకిరి’ని మరిపించేలా..

‘సర్కారువారి పాట’(Sarkaru Vaari Paata) సినిమా చేస్తుంటే ‘పోకిరి’నాటి రోజులు గుర్తుకు వచ్చాయని అంటున్నారు అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు(Mahesh babu). ఆయన కీలక పాత్రలో పరశురామ్‌ తెరకెక్కించిన చిత్రమిది. కీర్తి సురేశ్‌(Keerthy Suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అంతేకాదు, మహేశ్‌బాబు ఇందులో ఫుల్‌ ఎనర్జీతో నటించారని అర్థమవుతోంది.‘నేను విన్నాను.. నేను ఉన్నాను’, ‘100 వయాగ్రాలు వేసుకుని శోభనానికి రెడీ అయిన పెళ్లి కొడుకు గదికి వచ్చినట్లు వచ్చారు’ అంటూ డైలాగ్‌లు మహేశ్‌ అభిమానులతో విజిల్స్‌ వేయిస్తున్నాయి.   బ్యాంకు రుణాలు, ఆర్థికలావాదేవీల ఇతివృత్తంగా పరశురామ్‌ ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata)రూపొందించారు. సముద్రఖని, వెన్నెల కిషోర్‌, తదితరులు కీలక పాత్రలు పోషించారు.


భ్రూణహత్యల నేపథ్యంలో...

రణ్‌వీర్‌ సింగ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’(Jayeshbhai Jordaar). మే 13న విడుదల కానున్న ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో రణవీర్‌ భార్యగా షాలినీ పాండే కనిపించనుంది. బొమన్‌ ఇరానీ, రత్నపాఠక్‌ షా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దివ్యాంగ్‌ ఠక్కర్‌ దర్శకత్వం వహించారు. భ్రూణహత్యల నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రంలో ఆడపిల్ల తండ్రిగా రణ్‌బీర్‌ కనిపించనున్నాడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ఆదిత్య చోప్రా, మనీశ్‌ శర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు.


ఈ వారం ఓటీటీలో వస్తున్న చిత్రాలివే!

జీ5లో ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’

చిన్న సినిమాగా విడుదలై, ఊహించనంత పెద్ద విజయం అందుకుంది ‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’(The kashmir files). విమర్శకుల ప్రశంసలతోపాటు వసూళ్లను రికార్డు స్థాయిలో రాబట్టింది. అలాంటి ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూసేందుకు ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు ఈ వారం తెర పడనుంది.  మే 13 నుంచి ఈ సినిమా ‘జీ 5’లో స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌, పల్లవి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వం వహించారు.


కమర్షియల్‌ ‘బీస్ట్‌’ ఎప్పుడంటే..

విజయ్‌-నెల్సన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘బీస్ట్‌’(Beast). ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా మే 11న ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. టెర్రరిజం నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో విజయ్‌(Vijay) రా ఏజెంట్‌ పాత్రలో నటించారు. ఓ ప్రముఖ షాపింగ్‌మాల్‌ని టెర్రరిస్టులు హైజాక్‌ చేయడం.. టెర్రరిస్టుల చేతుల్లో బంధిగా ఉన్నవారిలో ఓ రా ఏజెంట్‌ కూడా ఉండటం.. ఇలాంటి అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్‌ ఫుల్‌ ఎనర్జిటిక్‌ లుక్‌లో కనిపించారు. ఆయనకు జోడీగా పూజాహెగ్డే(Pooja hegde) నటించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చారు.

ఓటీటీలో రాబోతున్న మరికొన్ని చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ ఫ్లిక్స్‌

* సేవేజ్‌ బ్యూటీ(వెబ్‌ సిరీస్‌) మే12

జీ5

* తాలెదండ (కన్నడ) మే 13

* ముగిలిపేట్‌ (కన్నడ) మే13

అమెజాన్‌ ప్రైమ్‌

* ది మాట్రిక్స్‌ రెసరెక్షన్స్‌ (తెలుగు డబ్బింగ్‌) మే12

* మోడర్న్‌ లవ్‌ ముంబై (హిందీ సిరీస్‌)మే 13

* వుషు (మలయాళం)  మే13

డిస్నీ+హాట్‌స్టార్‌

* స్నీకరెల్లా (హాలీవుడ్‌ ) మే 13

ఆహా

* కుతుకు పత్తు (తమిళం) మే 13

వూట్‌

* ఆదా ఇష్క్‌(హిందీ సిరీస్‌) మే12

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని