
Telugu movies: ఓటీటీ దద్దరిల్లేలా.. ఈ వారం ఎన్ని సినిమాలు వస్తున్నాయో తెలుసా?
Telugu ott movies: వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న క్రమంలో ఈ వారం చిన్న సినిమాలు విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి. అయితే, అనుకోని కారణాల వల్ల చివరి నిమిషంలో అవి వెనక్కి తగ్గాయి. మరోవైపు ఈ వారం ఓటీటీలో సినిమాల మోత మోగిపోనుంది. మరి ఇటు థియేటర్, అటు ఓటీటీలో వచ్చే ఆ సినిమాలేంటో చూసేద్దామా!
చాలా గ్యాప్ తర్వాత..
రాజశేఖర్(Rajasekhar) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్’(Shekar). జీవిత దర్శకురాలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘జోసెఫ్’కు రీమేక్‌గా ‘శేఖర్’ రూపుదిద్దుకుంది.ఇందులో రాజశేఖర్ వయసు పైబడిన వ్యక్తిగా సరికొత్త లుక్‌తో సందడి చేయనున్నారు. ‘‘శేఖర్’ చిత్రానికి ప్రతి ఒక్కరూ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అని దర్శకురాలు జీవిత చెబుతున్నారు. కొత్త పాత్రలో రాజశేఖర్ ఏవిధంగా మెప్పిస్తారో చూడాలి. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: ఎన్.మల్లిఖార్జున్.
నవ్వులు పంచేందుకు సిద్ధమైన సంపూ
సంపూర్ణేష్‌బాబు(Sampoornesh babu), సోనాక్షి జంటగా నటిస్తున్న సినిమా ‘ధగడ్ సాంబ’. ఎన్‌ఆర్ రెడ్డి దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న థియేటర్‌లలో విడుదలకు సిద్ధమవుతోంది. ‘సంపూర్ణేష్ బాబును ఇప్పటిదాకా చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా కథా కథనాలు ఉంటాయి’ అని చిత్ర బృందం చెబుతోంది. జ్యోతి, చలాకీ చంటి, మిర్చి మాధవి, ఆనంద్ భారతి తదితరులు ఇందులో నటించారు.
ఏజెంట్ అగ్నిగా...
క్వీన్ కంగనా రనౌత్(Kangana ranaut) ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం ‘ధాకడ్’(Dhaakad). రజనీష్ ఘయ్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ మే20న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ఏజెంట్ అగ్ని పాత్రలో కంగనా పూర్తిగా ఒదిగి పోయింది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. మానవ అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో ఏజెంట్ అగ్ని క్రూరుడైన ప్రతినాయక పాత్ర రుద్రవీర్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఉత్కంఠభరితమైన పోరాటాలతో పూర్తి శక్తిమంతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా ‘ధాకడ్’ ఉండనుంది’’ అని దర్శకుడు రజనీష్ చెబుతున్నారు. మరి ఏజెంట్ అగ్నిగా కంగనా ఎలా అదరగొట్టిందో చూడాలి.
భయపెడుతూ.. నవ్విస్తూ..
ఏ భాషలోనైనా అలరించే కథా నేపథ్యం ఉన్న చిత్రాలంటే హారర్ కామెడీ మూవీలే. బాలీవుడ్ నటుడు కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా అనీస్ బాజ్మీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భూల్ భులాయా2’(Bhool Bhulaiyaa 2). టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. మే 20న థియేటర్‌లలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో ఈ వారం సందడే సందడి
ఓటీటీని షేక్ చేసేలా...
ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ram charan) కథానాయకులుగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్ యాక్షన్ డ్రామా ‘RRR’. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా మే 20 నుంచి జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. T-VOD పద్ధతిలో అద్దె చెల్లించి సినిమా చూడాల్సి ఉంటుంది.
అంచనాలను అందుకోలేక..
చిరంజీవి(Chiranjeevi), రామ్‌చరణ్(Ram charan) కీలక పాత్రల్లో కొరటాల శివ తెరకెక్కించిన యాక్షన్ డ్రామా ‘ఆచార్య’(Acharya). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మెగా అభిమానులకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఇప్పుడు ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ప్రైమ్ వీడియో వేదికగా మే 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రెండు వారాల్లోనే ఓటీటీలోకి..
యువ నటుడు శ్రీవిష్ణు కథానాయకుడిగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భళా తందనాన’(Bhala thandanana). మే 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మే 20వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో అందుబాటులోకి రానుంది.
నో థియేటర్ డైరెక్ట్ ఓటీటీ
మోహన్‌లాల్(Mohan lal) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘12th మ్యాన్’(12th man). జీతూ జోసెఫ్ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 20 డిస్నీ+హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. ‘దృశ్యం’, ‘దృశ్యం2’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు మోహన్‌లాల్-జీతూ జోసెఫ్. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందంటే అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈసారి పంచాయతీలో వచ్చిన సమస్యలేంటి?
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ ‘పంచాయత్’(Panchayat). లాక్‌డౌన్ సమయంలో విడుదలై నవ్వులు పూయించిన ఈ హిందీ వెబ్ సిరీస్ ఇప్పుడు సీజన్-2(Panchayat season 2)కి సిద్ధమైంది. మే 20నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. దీపక్ మిశ్ర దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో జితేంద్ర కుమార్, రఘువీర్ యాదవ్, నీనా గుప్తా ప్రధాన పాత్రలో నటించారు.
నెట్‌ఫ్లిక్స్
* ది ఇన్విజబుల్ మ్యాన్ (హాలీవుడ్ మూవీ) మే16
* ద హంట్ (హాలీవుడ్) మే 16
* వూ కిల్డ్ సారా (వెబ్ సిరీస్-3) మే 18
జీ5
* జోంబ్లివీ (హిందీ చిత్రం) మే20
వూట్
* హనీమూన్ (కన్నడ) మే 20
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ENG vs IND: ఆ ‘తుపాన్’ మన మీదకొస్తే..!
-
Crime News
Prayagraj: కుమార్తె మృతదేహంతో ఐదు రోజులుగా ఇంట్లోనే.. బతికించేందుకు క్షుద్రపూజలు
-
General News
Health: యోగా చేయండి.. జ్ఞాపక శక్తి పెంచుకోండి
-
Movies News
Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే
-
Politics News
బిహార్‌లో మజ్లిస్‌కు షాక్.. నలుగురు ఎమ్మెల్యేలు జంప్!
-
India News
GST: గబ్బర్ సింగ్ ట్యాక్స్ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Maharashtra crisis: మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా.. గవర్నర్ ఆమోదం
- Allu Arjun: ‘పుష్ప’తో మక్కల్ సెల్వన్ ఢీ.. లెక్కల మాస్టారి స్కెచ్ అదేనా?
- బీచ్‌లో కాలక్షేపం కోసం ₹5 లక్షల కోట్ల కంపెనీకి సీఈఓ రాజీనామా!
- Rajamouli: అలా చేస్తేనే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది: రాజమౌళి
- Viral Video: గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడిన చీమలు.. ఏ కేసు పెట్టాలని నెటిజన్లకు అధికారి ప్రశ్న!
- Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!
- Mahesh babu: బిల్ గేట్స్‌తో మహేశ్‌బాబు.. పిక్ వైరల్.. ఎక్కడ కలిశారంటే?
- Karnataka: అప్పు తిరిగి చెల్లించలేదని.. అక్కాచెల్లెళ్లను వివస్త్రలను చేసి దాడి!
- WhiteHat Jr: 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్
- Shivani Rajasekhar: ‘మిస్ ఇండియా’ పోటీ నుంచి తప్పుకున్న శివానీ రాజశేఖర్.. కారణమిదే