Updated : 18 Apr 2022 13:36 IST

Tollywood: ముందు ‘ఆచార్య’.. వెనుక ‘కేజీయఫ్‌2’.. అడుగు పడటం లేదు

పాన్‌ ఇండియా సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. ఈ క్రమంలో తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త సినిమాల విడుదలకు అడుగు పడటం లేదు. ఎందుకంటే ప్రస్తుతం ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లు వాటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు ‘ఆర్‌ఆర్ఆర్‌’, మరోవైపు ‘కేజీయఫ్‌2’ సినిమాలు ఫుల్ జోష్‌తో దూసుకుపోతుండగా, మరో వారం ఆగితే చిరంజీవి ‘ఆచార్య’ విడుదల కానుంది. దీంతో  ‘ఎందుకొచ్చిన గొడవ’ అనుకుని పలు సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. కేవలం చిన్న సినిమాలు మాత్రమే ఈ వారం వస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చేసినిమాలేవో చూసేద్దామా!

యథార్ధ సంఘటనలతో...

ప్రముఖ నృత్య దర్శకుడు శేఖర్‌ సమర్పణలో... గగన్‌ విహారి, అపర్ణ దేవి జంటగా రూపొందిన చిత్రం ‘1996 ధర్మపురి’. విశ్వజగత్‌  దర్శకత్వం వహిస్తున్నారు. భాస్కర్‌ యాదవ్‌ దాసరి నిర్మాత. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘జగిత్యాల జిల్లా ధర్మపురిలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. గడీలో పనిచేసే ఓ జీతగాడు... బీడీలు చుట్టుకునే ఓ అమ్మాయి మధ్య నడిచే ప్రేమకథగా తెరకెక్కించారు దర్శకుడు. శేఖర్‌ మాస్టర్‌ ఈ సినిమాతో అభిరుచిగల నిర్మాత అనిపించుకుంటారు. చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుంద’’న్నాయి సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాతో పాటు, ‘వన్‌ బై టు’ ‘బొమ్మల కొలువు’, ‘తపన’,‘నాలో నిన్న దాచానే’ తదితరు చిత్రాలు ఏప్రిల్‌ 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఓటీటీలో గని

వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘గని’. బాక్సింగ్‌ నేపథ్యంలో సాగే కథాంశంతో దీన్ని తెరకెక్కించారు. అయితే, అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. బాక్సర్‌ కావాలని కలలు కనే ఓ యువకుడు.. కుటుంబం, ప్రత్యర్థుల నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? తల్లికిచ్చిన మాట కోసం అతడు బాక్సింగ్‌కు దూరమవుతాడా? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించారు.  ‘ఆహా’ ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ నెల 22న ‘గని’ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

అమెజాన్‌ ప్రైమ్‌

* ఓ మై డాగ్‌ - ఏప్రిల్‌ 21

* గిల్లీమైండ్స్‌ - ఏప్రిల్‌ 22

జీ5

* అనంతం(తమిళ సిరీస్‌)- ఏప్రిల్‌22

నెట్‌ఫ్లిక్స్‌

* తులసీదాస్‌ జూనియర్‌ (హిందీ) ఏప్రిల్‌ 19

* బెటర్‌ కాల్‌సాల్‌ (వెబ్‌ సిరీస్‌-6) ఏప్రిల్‌ 19

* కుథిరైవాల్‌ (తమిళ చిత్రం) ఏప్రిల్‌ 20

* ద మార్క్‌డ్‌ హార్ట్‌  ఏప్రిల్‌ 20

సోనీ లివ్‌

* అంతాక్షరి (మలయాళం)ఏప్రిల్‌ 22

వూట్‌

* బ్రోచరా (హిందీ) ఏప్రిల్‌ 18

* లండన్‌ ఫైల్స్‌ (హిందీ) ఏప్రిల్‌ 21

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని