Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

బాక్సాఫీస్‌ వద్ద వేసవి సినిమాల సందడి కొనసాగుతోంది. ప్రతి వారం కచ్చితంగా ఓ సరికొత్త సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది.

Published : 31 May 2022 09:43 IST

Telugu Movies:  బాక్సాఫీస్‌ వద్ద వేసవి సినిమాల సందడి కొనసాగుతోంది. ప్రతి వారం కచ్చితంగా ఓ సరికొత్త సినిమా ప్రేక్షకులను పలకరిస్తోంది. మరి జూన్‌ మొదటి వారంలో అలరించే చిత్రాలేవో చూసేద్దామా!

స్ఫూర్తినింపే బయోపిక్‌ ‘మేజర్‌’

మొదటి నుంచి విభిన్న చిత్రాలు, కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు అడవి శేష్‌(Adivi Sesh). ఇప్పుడు ‘మేజర్‌’(Major)తో థియేటర్‌లలో సందడి చేసేందుకు వస్తున్నారు. 26/11 ఉగ్రదాడుల్లో పౌరుల ప్రాణాలను కాపాడుతూ అమరుడైన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. సయీ మంజ్రేకర్‌, శోభిత దూళిపాళ్ల కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు శశి కిరణ్‌ తిక్క దర్శకత్వం వహించారు. జూన్‌ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్‌లలో విడుదల కానుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో అతికొద్ది మందికోసం ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు.


సింహం.. పులి.. చిరుత.. ప్రకృతి

విలక్షణ నటులందరినీ ఒకే తెరపై చూపించటం అంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే దానికి తగినట్లు కథ, పాత్రల్లో బలం లేకపోతే సినిమా తేలిపోతుంది. కానీ, తమిళ దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ ఆ అడ్వెంచర్‌ చేస్తున్నారు. ఆయన దర్శకత్వంలో కమల్‌హాసన్‌(Kamal Haasan),విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi), ఫహద్‌ ఫాజిల్‌(Fahadh Faasil), కీలక పాత్రల్లో నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘విక్రమ్‌’(Vikram). సూర్య అతిథి పాత్రలో మెరవబోతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఉన్న ఈ సినిమా జూన్‌ 3న తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఇక అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన నేపథ్య సంగీతం హైలైట్‌ అని చెప్పవచ్చు. ఇందులో సింహం(విజయ్‌ సేతుపతి) పులి(ఫహద్‌ ఫాజిల్‌) చిరుత(?) మధ్య జరిగిన ఘర్షణ ఏంటి? అందులో ప్రకృతి(కమల్‌హాసన్‌) సృష్టించిన ప్రళయం ఏంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


పృధ్వీరాజ్‌ చౌహాన్‌ జీవిత కథ

అక్షయ్‌కుమార్‌(Akshay kumar) ప్రధాన పాత్రలో మానుషి(Manushi chhillar) కథానాయికగా రూపొందుతున్న చిత్రం ‘సమ్రాట్ పృధ్వీరాజ్‌’(samrat prithviraj chauhan). చంద్రప్రకాశ్‌ ద్వివేది తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూన్‌ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.  తెలుగుతో పాటు.. పలు దక్షిణాది భాషల్లో విడుదల కానుంది. రాజ్‌పూత్‌ యోధుడు పృధ్వీరాజ్‌ చౌహాన్‌ వీరగాథ ఆధారంగా తీసిన ఈ సినిమాను యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. సంజయ్‌దత్‌, సోనూసూద్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.


ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలివే!

థియేటర్‌లో అలరించి..

విశ్వక్‌సేన్‌(Vishwak sen) కథానాయకుడిగా విద్యా సాగర్‌ చింతా తెరకెక్కించిన రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘అశోకవనంలో అర్జున కల్యాణం’(Ashoka vanamlo arjuna kalyanam). చిన్న సినిమాగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ ‘ఆహా’లో జూన్‌ 3 నుంచి స్ట్రీమింగ్‌కానుంది. రుక్సార్‌ థిల్లాన్‌, రితికా నాయక్‌ నాయికలుగా మెరిసి, విశేషంగా ఆట్టుకున్నారు. గోపరాజు రమణ, కేదార్‌ శంకర్‌, కాదంబరి కిరణ్‌ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు.


9 గంటల పాటు ఏం జరిగింది?

తారకరత్న, అజయ్‌, మధుశాలిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ ‘9అవర్స్‌’ (9 hours). ప్రముఖ దర్శకుడు క్రిష్‌ అందించిన కథతో నిరంజన్‌ కౌశిక్‌, జాకబ్‌ వర్గీస్‌లు దర్శకత్వం వహించారు.  డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌2వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.  ‘డెక్కన్‌ ఇంపీరియల్‌ బ్యాంక్‌’లో 9గంటల పాటు ఏం జరిగిందన్న ఆసక్తికర కథాంశంతో ఈ సిరీస్‌ తెరకెక్కించారు. వై.రాజీవ్‌ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందిస్తున్నారు.


నెట్‌ఫ్లిక్స్‌

* జనగణమన (మలయాళం) జూన్‌ 2

* సర్వైవింగ్‌ సమ్మర్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 3

* ద పర్‌ఫెక్ట్‌ మదర్‌ (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 3

అమెజాన్‌ ప్రైమ్‌

* ద బాయ్స్‌ (వెబ్‌ సిరీస్‌3) జూన్‌3

బుక్‌ మై షో

* బెల్‌ఫాస్ట్‌ (హాలీవుడ్‌) జూన్‌3

ఎంఎక్స్‌ ప్లేయర్‌

* ఆశ్రమ్‌ (హిందీ సిరీస్‌3) జూన్‌3

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని