Updated : 01 Aug 2022 13:32 IST

Telugu movies: ఈ వారం థియేటర్‌లో రెండే చిత్రాలు.. ఓటీటీలో ఎన్నో తెలుసా?

ఇంటర్నెట్‌డెస్క్‌: వేసవి సినిమాల సందడి తర్వాత జులై నెల పూర్తిగా నిరాశపరిచింది. గత నెలలో విడుదలైన ఒక్క సినిమా కూడా ప్రేక్షకుడిని మెప్పించలేకపోయింది. ఈ క్రమంలో ఆశలన్నీ ఆగస్టుపైనే..! మరి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలేంటో చూసేద్దామా!

సరికొత్త అవతారంలో కల్యాణ్‌రామ్‌

‘శరణు కోరితే ప్రాణ భిక్ష. ఎదిరిస్తే మరణం’ అంటున్నారు కల్యాణ్‌ రామ్‌ (Kalyan Ram). ఆయన కథానాయకుడిగా వశిష్ఠ్‌ తెరకెక్కించిన చిత్రం ‘బింబిసార’ (Bimbisara). ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ (NTR Arts) పతాకంపై హరికృష్ణ.కె నిర్మించారు. సంయుక్తా మేనన్‌ (Samyuktha Menon) కేథరిన్‌ (Catherine) కథానాయికలు. ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చరిత్రకు వర్తమానానికి ముడిపెడుతూ సాగే విభిన్నమైన సోషియో ఫాంటసీ చిత్రమిది. ఇందులో కల్యాణ్‌ రామ్‌ బింబిసారుడిగానే కాక మరో స్టైలిష్‌ అవతారంలోనూ కనిపించనున్నారు. కల్యాణ్‌రామ్‌ తొలిసారి ఇలాంటి జోనర్‌లో నటిస్తుండటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.


యుద్ధంతో రాసిన ప్రేమకథ

మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో నటిస్తున్న ప్రేమకథా చిత్రం. ‘సీతా రామం’. మృణాళిని ఠాకూర్‌ కథానాయిక. రష్మిక కీలకపాత్రలో నటిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. ఆగస్టు 5న ‘సీతారామం’ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘చాలా గొప్ప కథ ఇది. ప్రేమకథతో పాటు యుద్ధం లాంటి సంఘర్షణ కనిపిస్తుంది’ అని చిత్ర బృంద చెబుతోంది. ఈ చిత్రంలో సుమంత్‌, గౌతమ్‌ మేనన్‌, ప్రకాష్‌ రాజ్‌ తదితరులు కనిపించనున్నారు.


ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

ఓటీటీలో ‘కమర్షియల్‌’

చిత్రం: పక్కా కమర్షియల్‌; నటీనటులు: గోపిచంద్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, రావు రమేశ్‌ తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; దర్శకత్వం: మారుతి; స్ట్రీమింగ్‌ వేదిక: ఆహా; విడుదల: 05-08-2022


పృథ్వీరాజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌

చిత్రం: కడువా; నటీనటులు: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, సంయుక్త మేనన్‌ తదితరులు; సంగీతం: జేక్స్‌ బిజోయ్‌; దర్శకత్వం: షాజి కైలాస్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో; విడుదల: 04-08-2022


‘డార్లింగ్స్‌’ అంటున్న అలియా

చిత్రం: డార్లింగ్స్‌; నటీనటులు: అలియా భట్‌, షెఫ్లీ షా, విజయ్‌ వర్మ, రోషన్‌ మాథ్యూ తదితరులు; సంగీతం: విశాల్‌ భరద్వాజ్‌; దర్శకత్వం: జస్మీత్‌ కె.రీన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌; విడుదల: 05-08-2022


అమెజాన్‌ ప్రైమ్‌

* ఆల్‌ ఆర్‌ నథింగ్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 04

* క్రాష్‌ కోర్స్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 05

* థర్టీన్‌ లైవ్స్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 05


నెట్‌ఫ్లిక్స్‌

* కార్టర్‌ (కొరియన్‌ మూవీ) ఆగస్టు 05

* ద శాండ్‌ మాన్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 05


డిస్నీ+హాట్‌ స్టార్‌

* లైట్‌ ఇయర్‌ (తెలుగు డబ్బింగ్‌) ఆగస్టు 03


ఆహా

* మహా (తమిళ చిత్రం )ఆగస్టు 05


వూట్‌

* ద గ్రేట్‌ వెడ్డింగ్‌ ఆఫ్‌ మున్నేస్‌ (హిందీ) ఆగస్టు 04


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని