Telugu Movies: ఈ వారం థియేటర్‌లో చిన్న సినిమాలు.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్స్‌..

ఈ వారం థియేటర్‌లో అన్నీ చిన్న చిత్రాలు సందడి చేయనుండగా, ఓటీటీలో మాత్రం సంక్రాంతి చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Updated : 21 Feb 2023 10:12 IST

Telugu Movies: ఫిబ్రవరి చివరి వారంలో థియేటర్‌లను చిన్న చిత్రాలే పలకరించబోతున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షల నేపథ్యంలో పెద్ద చిత్రాలేవీ సందడి చేసేందుకు రావడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఈ వారం బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు అలరించనున్నాయి.

ఎవరీ ‘మిస్టర్‌ కింగ్‌’

నటి, దర్శకురాలు విజయనిర్మల మనవడు శరణ్‌కుమార్‌ కథానాయకుడిగా... శశిధర్‌ చావలి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’ (Mr. King). యశ్విక నిష్కల, ఊర్వి సింగ్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 24న థియేటర్‌లలో సందడి చేయనుంది. ‘కూతురు ఉన్న ప్రతి కుటుంబం, ఆత్మగౌరవం ఉన్న ప్రతి అబ్బాయి చూడాల్సిన సినిమా ఇది’ అని చిత్ర బృందం చెబుతోంది.


దేనికి ‘డెడ్‌లైన్‌’

అజయ్‌ ఘోష్‌ ప్రధాన పాత్రధారిగా... బొమ్మారెడ్డి.వి.ఆర్‌.ఆర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘డెడ్‌లైన్‌’ (Dead line). తాండ్ర గోపాల్‌ నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 24న థియేటర్‌లలో సందడి చేయనుంది. ‘సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యల్ని చర్చించే చిత్రమిది. నేటి యువత అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించాం. కథనం ఊహకు అందని రీతిలో సాగుతుంది’ అని చిత్ర సభ్యులు చెబుతున్నారు.


ఇంతకీ కోనసీమ ‘థగ్స్‌’ ఏం చేశారు!

నృత్య దర్శకురాలు బృందా గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘థగ్స్‌’ (konaseema thugs). ప్రముఖ నిర్మాత శిబు తమీన్స్‌ తనయుడు హ్రిదు హరూన్‌ కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. రియా శిబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో ‘కోనసీమ థగ్స్‌’ పేరుతో ఫిబ్రవరి 24న విడుదల కానుంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్‌ సంస్థ విడుదల చేస్తోంది. ‘ఆద్యంతం ఉత్కంఠని రేకెత్తిస్తూ యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమని ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలివే!

‘వారసుడు’ వచ్చేస్తున్నాడు!

తమిళ స్టార్‌ విజయ్‌ (Vijay) కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వారిసు’. సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ కథా చిత్రంగా పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ఫిబ్రవరి 22 నుంచి స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది.


‘వీరసింహారెడ్డి’ యాక్షన్‌ హంగామా!

బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడిగా గోపీ చంద్‌ మలినేని దర్శకత్వం వహించిన యాక్షన్‌ డ్రామా ఫిల్మ్‌ ‘వీరసింహారెడ్డి’ (veera simha reddy). శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి రేసులో నిలిచిన తొలి చిత్రం కాగా, బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. బాలకృష్ణ ద్విపాత్రాభినయం, దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విలనిజం సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. ఫిబ్రవరి 23 సాయంత్రం 6గంటల నుంచి ‘వీరసింహారెడ్డి’ డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.


‘మైఖేల్‌’ మెరుపులు..

సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మైఖేల్‌’ (michael ott release date). ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ వేదికగా ఫిబ్రవరి 24వ  తేదీ నుంచి ఈ చిత్రాన్ని అందుబాటులోకి రానుంది.


‘వీరయ్య’ వస్తున్నాడు!

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ కీలక పాత్రలో నటించారు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఫిబ్రవరి 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* థంకమ్‌ (మలయాళం) ఫిబ్రవరి 20

నెట్‌ఫ్లిక్స్‌

* ద స్ట్రేస్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 22

* నన్‌పకల్‌ నేరట్టు మయక్కం (మలయాళం) ఫిబ్రవరి

* అవుటర్‌ బ్యాంక్‌ (వెబ్‌సిరీస్‌3) ఫిబ్రవరి 23

* వియ్‌ హేవ్‌ ఎ ఘోస్ట్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24

* ఎ క్వైట్‌ ప్లేస్‌2 (హాలీవుడ్‌) ఫిబ్రరి 24

డిస్నీ+హాట్‌స్టార్‌

* రబియా అండ్‌ ఒలీవియా (హాలీవుడ్‌) ఫిబ్రవరి 24

సోనీలివ్‌

* పొట్లక్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 24

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని