Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!

Telugu movies: ఈ వారం థియేటర్‌తో పాటు ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?

Updated : 27 Feb 2023 16:09 IST

Telugu Movies: ఫిబ్రవరి నెల ముగిసేందుకు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. ఈ మాసంలో అనేక చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద ప్రేక్షకులను అలరించాయి. అయితే, ఎక్కువగా చిన్న చిత్రాలే విడుదలయ్యాయి. విద్యార్థుల పరీక్షల నేపథ్యంలో మరో రెండు, మూడు వారాల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది. మరి ఈ వారం అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో వస్తున్న సినిమాలేంటో చూసేయండి.

పల్లెటూరు నేపథ్యంతో..

ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌, సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌ గౌడ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘బలగం’ (Balagam). వేణు ఎల్దండి దర్శకుడు. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ పతాకంపై  హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 3న థియేటర్‌లలో విడుదల కానుంది. తెలంగాణ పల్లెటూరు నేపథ్యంలో సాగే కథతో, ప్రతి పాత్ర ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా సినిమాను తీర్చిదిద్దారు. భీమ్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


మామ అల్లుళ్ల కథ..

రాజేంద్ర ప్రసాద్‌, సోహైల్‌, మీనా, మృణాళిని ప్రధాన పాత్రల్లో ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘ఆర్గానిక్‌ మామ హైబ్రీడ్‌ అల్లుడు’ (Organic Mama Hybrid Alludu). కోనేరు కల్పన నిర్మించారు. ఈ సినిమా కూడా మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ ప్రేక్షకులను అలరించడంతో పాటు, వాణిజ్య అంశాలనూ మేళవించి ఎస్వీ కృష్ణారెడ్డి శైలిలో సినిమాను తెరకెక్కించినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. కేవలం 44రోజుల్లోనే ఈ సినిమా తెరకెక్కించడం గమనార్హం.


రిచిగాడి పెళ్లి కథేంటి?

సత్య.ఎస్‌.కె, చందనరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘రిచిగాడి పెళ్లి’ (RichieGadi Pelli). కె.ఎస్‌.హేమరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కేఎస్‌ ఫిల్మ్‌ వర్క్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మానవ సంబంధాల్ని ఆవిష్కరించే కథతో ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం తెలిపింది. చిన్నప్పుడు ఆడుకున్న చిన్న చిన్న ఆటల్ని ఆధారంగా చేసుకుని ఈ కథని మలిచినట్లు వివరించింది. మార్చి 3న ‘రిచిగాడి పెళ్లి’ విడుదల కానుంది.


నిజ జీవిత కథతో..

బిందు అనే యువతి నిజ జీవిత గాథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సాచి’ (Saachi). సంజన రెడ్డి, గీతిక రధన్‌ కథానాయికలు. చెల్లి స్వప్న, అశోకరెడ్డి మూల విరాట్‌, టి.వి.రామన్‌, ఏవీఎన్‌ ప్రదీప్‌ ముఖ్య పాత్రలు పోషించారు. వివేక్‌ పోతగోని దర్శకత్వం వహించడంతోపాటు, ఉపేన్‌ నడిపల్లితో కలిసి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహిళా సాధికారతకు సంబంధించిన కథాంశంతో రూపొందినట్టు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది.


గ్రంథాలయంలో ఏం జరిగింది?

విన్ను మద్దిపాటి, స్మిరిత రాణి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘గ్రంథాలయం’ (Grandhalayam). వైష్ణవి శ్రీ నిర్మిస్తున్నారు. సాయి శివన్‌ జంపన దర్శకుడు. ఈ మూవీ కూడా మార్చి 3న విడుదల కానుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌ జానర్‌లో ఓ సరికొత్త ప్రయత్నం చేశామని చిత్ర బృందం చెబుతోంది.


ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

* వాల్తేరు వీరయ్య (తెలుగు) స్ట్రీమింగ్‌ మొదలైంది

* హీట్‌వేవ్‌ (హాలీవుడ్‌) మార్చి 1

* సెక్స్‌ లైఫ్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 2

* థలైకూతల్‌ (తమిళం) మార్చి 3


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

* డైసీ జోన్స్‌ అండ్‌ ద సిక్స్‌ (వెబ్‌సిరీస్‌) మార్చి 3


జీ5

* తాజ్‌: డివైడెడ్‌ బై బ్లడ్‌ (వెబ్‌ సిరీస్‌) మార్చి 3


డిస్నీ+హాట్‌స్టార్‌

* ది మాండలోరియన్‌ (వెబ్‌సిరీస్‌-3) మార్చి 1

* ఎలోన్‌ (మలయాళం/తెలుగు) మార్చి 3

* గుల్మొహర్‌ (హిందీ) మార్చి 3Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు