Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!

Telugu Movies: ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలో అలరించే చిత్రాలేంటో తెలుసా?

Updated : 14 Mar 2023 15:15 IST

Telugu movies: గత కొన్ని రోజులుగా బాక్సాఫీస్‌ వద్ద చిన్న చిత్రాలు అలరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నుంచి ప్రతి వారం పలు ఆసక్తికర చిత్రాలు విడుదలకానున్నాయి. అలాగే ఓటీటీలోనూ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రాలేంటో చూసేయండి

కేజీయఫ్‌ను తలపించేలా!

‘‘చరిత్ర ఎప్పుడూ తెగిపడిన తలల కంటే... ఆ తలల్ని తీసిన చేతుల్నే పొగుడుతుంది. అలాంటి ఒక చెయ్యి సృష్టించిన కథే ‘కబ్జ’ (KABZAA). ఆ కథ వెనక సంగతులేమిటో తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే. ఉపేంద్ర (Upendra), సుదీప్‌ (Sudeep), శివరాజ్‌ కుమార్‌(Shiva Rajkumar) కథానాయకులుగా నటించిన మల్టీస్టారర్‌ చిత్రమిది. ఆర్‌.చంద్రు దర్శక నిర్మాణంలో రూపొందుతోంది. ప్రముఖ కథానాయకుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని కన్నడ, తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ఈనెల 17న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా..

నాగశౌర్య (NagaShaurya), మాళవిక నాయర్‌(Malavika Nair) జంటగా... శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఫలానా అబ్బాయి - ఫలానా అమ్మాయి’ (Phalana Abbayi Phalana Ammayi). టి.జి.విశ్వప్రసాద్‌, దాసరి పద్మజ  నిర్మాతలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 17న థియేటర్‌లలో విడుదల కానుంది. మనకు తెలిసిన కథలా, మనలో ఒకరి కథలా ఉంటుందని, ఇంటిల్లిపాదినీ  అలరిస్తుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు

థియేటర్‌లో అలరించి..

ధనుష్‌ (Dhanush) కీలక పాత్రలో నటించిన చిత్రం ‘సార్‌’ (SIR). వెంకీ అట్లూరి దర్శకుడు. విద్య గొప్పతనాన్ని, విద్యావ్యవస్థలోని లోటుపాట్లను తెలియజేస్తూ తెరకెక్కిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ నెల 17 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఇది అందుబాటులో ఉండనుంది.

రైటర్ పద్మభూషణ్‌ కూడా వస్తున్నాడు!

సుహాస్‌, టీనా శిల్పరాజ్‌ జంటగా షణ్ముఖ ప్రశాంత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రైటర్‌ పద్మభూషణ్‌’. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. అంతేకాదు, ఫీల్‌గుడ్‌ మూవీగా విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ వేదికగా(Writer Padmabhushan ott) స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 17వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది.


ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

  • మనీషాట్‌ (ఒరిజినల్‌ మూవీ) మార్చి 15
  • కుత్తే (హిందీ) మార్చి 16

  • షాడో అండ్‌ బోన్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) మార్చి 16
  • మేస్ట్రో (వెబ్‌సిరీస్‌) మార్చి 17
  • ఇన్‌ హిజ్‌ షాడో మార్చి (మూవీ) మార్చి 17
  • ది మెజీషియన్‌ ఎలిఫెంట్‌ (యానిమేటెడ్‌ ఫిల్మ్‌) మార్చి 17

అమెజాన్‌ ప్రైమ్‌వీడియో

  • బ్లాక్‌ ఆడమ్‌ (ఇంగ్లీష్‌)  మార్చి 15
  • డోమ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌2) మార్చి 17
  • గందధగుడి (కన్నడ) మార్చి 17

జీ5

  • లాక్‌ (తమిళ్‌) మార్చి 17

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • పాప్‌ కౌన్‌ (హిందీ సిరీస్‌) మార్చి 17

సోనీ లివ్‌

  • రాకెట్‌ బాయ్స్‌ (హిందీ సిరీస్‌2) మార్చి 16

ఆహా

  • సత్తిగాని రెండెకరాలు (తెలుగు) మార్చి 17
  • లాక్డ్‌ (వెబ్‌సిరీస్‌ సీజన్‌2) మార్చి 17

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని