Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Upcoming Telugu Movies: ఈ వారం థియేటర్‌ సందడి చేయడానికి సినిమాలతో పాటు, ఓటీటీలోనూ అలరించే చిత్రాల జాబితా ఏంటో చూసేయండి.

Published : 13 Feb 2023 09:50 IST

Telugu Movies: ఫిబ్రవరిలో ఇప్పటికే రెండు శుక్రవారాలు పలు ఆసక్తికర చిత్రాలు బాక్సాఫీస్‌ను పలకరించాయి. మహాశివరాత్రి సందర్భంగా ఈ వారం కూడా కొత్త చిత్రాలు థియేటర్‌లో సందడి చేయనున్నాయి. సమంత ‘శాకుంతలం’ వాయిదా పడటంతో మిగిలిన చిత్రాలకు ఎక్కువ థియేటర్లు దొరికే అవకాశం ఏర్పడింది. అలాగే ఓటీటీలో ఈ వారం సినిమాల సందడి నెలకొంది. మరి అటు థియేటర్‌, ఇటు ఓటీటీలో రాబోతున్న చిత్రాలేవో చూసేయండి.

‘సార్‌’ చెప్పే పాఠాలేంటి?

‘అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఉన్న ప్రతి స్టూడెంట్‌ క్లాస్‌ రూమ్‌లో ఉంటాడు. ఛాలెంజ్‌ చేసి చెబుతున్నా’ అంటున్నారు ధనుష్‌. (Dhanush) ఆయన కీలక పాత్రలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సార్‌’ (SIR). సంయుక్త మేనన్‌ కథానాయిక. విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలను ప్రస్తావిస్తూ సందేశాత్మకంగా ‘సార్‌’ను తీర్చిదిద్దినట్లు ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఫిబ్రవరి 17న ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


హిందీలో బంటు సందడి!

అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’. ఇప్పుడు ఈ సినిమాను ‘షెహ్‌జాదా’ (shehzada) ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమైంది. కార్తిక్‌ ఆర్యన్‌ కథానాయకుడిగా రోహిత్‌ ధావన్‌ ఈ చిత్రాన్ని రీమేక్‌ చేశారు. కృతి సనన్‌ కథానాయిక. తెలుగులో విశేషంగా అలరించిన ఈ సినిమాను హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా మార్పులు చేసి, విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 17న విడుదల కానుంది.


విభిన్న కథతో వస్తున్న కిరణ్‌ అబ్బవరం

మన చుట్టూ ఉన్న వాళ్లే కాదు, మన ఫోన్‌ నంబర్లకు అటూ ఇటూ ఉన్న వాళ్లు కూడా స్నేహితులే అంటున్నారు యువ కథానాయకుడు కిరణ్‌ అబ్బవరం(kiran abbavaram). అలా తన మొబైల్‌ నెంబర్‌కు అటూ ఇటూ ఉన్న నెంబర్లు కలిగిన వారితో స్నేహం చేయాలనుకున్న యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? తెలియాలంటే ‘వినరో భాగ్యము విష్ణుకథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) చూడాల్సిందే. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఫిబ్రవరి  18న ప్రేక్షకుల ముందుకు రానుంది. కశ్మీరా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మురళీ తెరకెక్కించారు.ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 • కార్నివల్‌ రో (వెబ్‌సిరీస్‌2) ఫిబ్రవరి 15

డిస్నీ+హాట్‌స్టార్‌

 • మాలికాపురం (తెలుగు) ఫిబ్రవరి 15

 • సదా నన్ను నడిపే (తెలుగు) ఫిబ్రవరి 16
 • జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌(కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17
 • ద నైట్‌ మేనేజర్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 17

ఆహా

 • కళ్యాణం కమనీయం (తెలుగు) ఫిబ్రవరి 17


నెట్‌ఫ్లిక్స్‌

 • స్క్వేర్డ్‌ లవ్‌ ఆల్‌ ఓవర్‌ ఎగైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 13
 • ఏ సండే ఎఫైర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 14
 • పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14
 • ది రొమాంటిక్స్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 14
 • ఆఫ్రికన్‌ క్వీన్స్‌: జింగా (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15
 • ఫుల్‌ స్వింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15
 • రెడ్‌ రోజ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15
 • సర్కస్‌ (హిందీ) ఫిబ్రవరి 17
 • గ్యాంగ్‌లాండ్స్‌ (వెబ్‌సిరిస్‌) ఫిబ్రవరి 17
 • అన్‌లాక్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17

లయన్స్‌గేట్‌ ప్లే

 • మైనస్‌ వన్‌ (హిందీ సిరీస్‌-2) ఫిబ్రవరి 14
 • లవ్‌ ఆన్‌ ది రాక్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 17

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు