Telugu Movies: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

upcoming telugu movies: వేసవి వినోదాల విందు మొదలైంది. ఈ వారం అటు థియేటర్‌తో పాటు ఇటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి.

Published : 10 Apr 2023 10:29 IST

Telugu Movies: తెలుగులో వరుస సినిమాల సందడి మొదలైంది. ప్రతివారం ఆసక్తికర మూవీలు ప్రేక్షకులను పలకరిస్తుండగా, ఈ వారం ఆ జోష్‌ మరింత పెరగనుంది. అలాగే ఓటీటీలో అలరించే చిత్రాలు సిద్ధమయ్యాయి. మరి ఆ సినిమాలేంటో చూసేయండి.

సరికొత్త పాత్రలో సమంత

మంత కీలక పాత్రలో రూపొందిన పౌరాణిక ప్రేమకథ ‘శాకుంతలం’ (Shaakuntalam). గుణశేఖర్‌ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. 3డీ వెర్షన్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుండటం గమనార్హం. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల - దుష్యంతుల ప్రేమకావ్యం ఆధారంగా గుణశేఖర్‌ (Guna Sekhar) తెరకెక్కించిన చిత్రమిది. టైటిల్‌ పాత్రను సమంత (Samantha) పోషించగా.. దుష్యంతుడిగా దేవ్‌మోహన్‌ (Dev Mohan) నటించారు. మోహన్‌బాబు, సచిన్‌ ఖేడ్కర్‌, ప్రకాష్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ.


‘రుద్రుడు’ ఏం చేశాడు?

రాఘవ లారెన్స్‌ (Lawrence Raghavendra) హీరోగా కతిరేశన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘రుద్రుడు’ (Rudhrudu). ప్రియా భవానీ శంకర్‌ కథానాయిక. శరత్‌ కుమార్‌, పూర్ణిమ భాగ్యరాజ్‌, నాజర్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 14వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదల చేసిన ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి ఇదొక రొమాంటిక్‌ యాక్షన్‌ డ్రామా చిత్రమని అర్థమవుతోంది. ‘‘ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కుటుంబంతో హాయిగా గడిపేస్తున్న కథానాయకుడి జీవితంలోకి ఓ నేరస్థుడు ప్రవేశించడం వల్ల కష్టాలు మొదలవుతాయి. అయినా తను ధైర్యంగా నిలబడి, నేరస్థుణ్ని పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు. మరి ఈ క్రమంలో అతనికెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని తనెలా ఎదుర్కొన్నాడు? అన్నది ఆసక్తికరం. ఈ సినిమాకి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్


తెలుగులోనూ అలరించేందుకు..

తర భాషల్లో విడుదలై విజయవంతమైన చిత్రాలను కాస్త ఆలస్యంగానైనా తెలుగు ప్రేక్షకులకు ముందుకు తీసుకొస్తున్నారు మన నిర్మాతలు. అలా ఈ వారం విడుదల కాబోతున్న పీరియాడిక్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘విడుదల: పార్ట్‌-1’ (viduthala part 1). సూరి, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల తమిళంలో విడుదలై ప్రేక్షకులకుతో పాటు విమర్శకులను సైతం మెప్పించింది. ఏప్రిల్‌ 15వ తేదీన తెలుగులో విడుదల కానుంది. ‘కాంతారా’ వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాన్ని తెలుగువారికి అందించిన గీతా ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఈ చిత్రాన్ని కూడా విడుదల చేస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే ప్రజాదళం ఏంటి? దాని మాస్టర్‌ పెరుమాళ్‌ (విజయ్‌ సేతుపతి) అతడి అనుచరులను పట్టుకునేందుకు పోలీసులు ఏం చేశారు? ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? నిజాయతీ కలిగిన కానిస్టేబుల్‌ కుమార్‌ (సూరి) పట్ల  ఉన్నతాధికారులు ఎలా ప్రవర్తిస్తారు? పెరుమాళ్‌ను పట్టుకునేందుకు కుమార్‌ చేసిన ప్రయత్నం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


ఈ వారం ఓటీటీ విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

‘అసలు’ఏం జరిగింది?

ఓ దారుణమైన హత్య... ఓ తెలివైన హంతకుడు.. నలుగురు అనుమానితులు...నాలుగు రహస్యాలు... ఒకే ఒక్క నిజం.... వీటన్నింటిని చేధించే ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారి... ఇలాంటి ఓ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘అసలు’ (Asalu ott release date). ఈటీవీ విన్‌ సమర్పణలో ఏ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ ప్రొడక్షన్‌ పతాకంపై రవిబాబు పోలీస్‌ పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రమిది. ఉదయ్‌, సురేష్‌ దర్శకత్వం వహించారు. పూర్ణ, సూర్యకుమార్‌, సత్యకృష్ణన్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఈటీవీ విన్‌ ద్వారా ఈ నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


థియేటర్‌లలో అలరించి..

విష్వక్‌సేన్ (Vishwak Sen) కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘దాస్‌ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద పర్వాలేదనిపించింది. విష్వక్‌ నటన, నివేదా అందాలు యువతను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ(Das ka dhamki ott release date)లో  స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ‘ఆహా’ వేదికగా ఏప్రిల్‌ 14వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.


నెట్‌ఫ్లిక్స్‌

  • ఫ్లోరియా మాన్‌ (వెబ్‌సిరీస్) ఏప్రిల్‌ 13
  • అబ్సెషన్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 13
  • క్వీన్‌ మేకర్‌ (కొరియన్‌ సిరీస్‌) ఏప్రిల్‌ 14
  • ది లాస్ట్‌ కింగ్‌డమ్‌ (హాలీవుడ్) ఏప్రిల్‌ 14

అమెజాన్‌

  • ది మార్వెలస్‌ మిస్సెస్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 14
    జీ5
  • మిస్సెస్‌ అండర్‌కవర్‌ (హిందీ) ఏప్రిల్‌ 14

డిస్నీ+హాట్‌స్టార్‌

  • టైనీ బ్యూటిఫుల్‌ థింగ్స్‌ (వెబ్‌సిరీస్‌) ఏప్రిల్‌ 9
  • ఓ కల (తెలుగు) ఏప్రిల్‌ 13


ఎంఎక్స్‌ ప్లేయర్‌

  • ది సాంగ్‌ ఆఫ్‌ గ్లోరీ (హిందీ సిరీస్‌) ఏప్రిల్‌ 12
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని