Telugu Movies:ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
telugu movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో అలరించే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేయండి.
Telugu Movies: వేసవి సినిమాల సందడి షురూ అయినట్లే. ఇప్పటికే విద్యార్థులు పరీక్షలు ముగింపునకు వస్తున్న నేపథ్యంలో ప్రతి వారం ఓ ఆసక్తికర చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు చిన్న చిత్రాలు ఎలాగూ వస్తాయి. మరి మార్చి ఆఖరి వారం అలరించడానికి సిద్ధమైన సినిమాలేంటో చూసేయండి.
ఈ ‘దసరా’ నిరుడు లెక్క ఉండదు
విభిన్న కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు నాని (Nani). ఆయన కీలక పాత్రలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తిసురేశ్ కథానాయిక. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే రివేంజ్ డ్రామాగా ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాను మార్చి 30న విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ప్రచార చిత్రాలు సినిమాపై మంచి హైప్ తీసుకొస్తున్నాయి.
మూడు కాలాలు.. మూడు పాత్రలు
ఆదిత్య ఓం కథానాయకుడిగా... ఆడారి మూర్తి సాయి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దహనం’. శ్రీపెతకంశెట్టి సతీష్ కుమార్ నిర్మాత. ఈ నెల 31న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘నీరు, నిప్పు, గాలితోపాటు.. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో ముడిపడిన కథ ఇది. కొన్ని తరాలు పూజలందుకుని మూతపడిన శివాలయంలో మళ్లీ పూజలు మొదలుపెట్టే భైరాగిగా ఆదిత్య ఓం కనిపిస్తాడు. మూడు పాత్రల చుట్టూ సాగే ఈ కథ ఆసక్తిని రేకెత్తిస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది.
- పరారీ మార్చి 30
- వీరఖడ్గం మార్చి 31
- ఏజెంట్ నరసింహా-117 మార్చి 31
- సత్యంవధ.. ధర్మం చెర మార్చి 31
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు/వెబ్‌సిరీస్
నెట్‌ఫ్లిక్స్
- క్రైసిస్ (హాలీవుడ్) మార్చి 26
- అన్‌సీన్ (హాలీవుడ్) మార్చి 29
- ఎమర్జెన్సీ ఎన్‌వైసీ (వెబ్‌సిరీస్) మార్చి 29
- ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ) మార్చి 31
- కిల్ బాక్సూన్ (కొరియన్) మార్చి 31
- మర్డర్ మిస్టరీ2 (హాలీవుడ్) మార్చి 31
- అమిగోస్ (తెలుగు) ఏప్రిల్ 1
- షెహజాదా (హిందీ) ఏప్రిల్ 1
అమెజాన్ ప్రైమ్ వీడియో
- ది పవర్ (వెబ్‌సిరీస్) మార్చి 31
జీ5 - అగిలన్ (తమిళ) మార్చి 31
- అయోధ్య (తమిళ) మార్చి 31
- యునైటెడ్ కచ్చే (హిందీ) మార్చి 31
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
- సక్సెషన్ (వెబ్‌సిరీస్4) మార్చి 26
- శ్రీదేవి శోభన్‌బాబు (తెలుగు) మార్చి 30
- డూగీ కామియలోహ ఎండీ (హిందీ) మార్చి 31
- గ్యాస్‌లైట్ (హిందీ) మార్చి 31
- సెల్ఫీ (హిందీ) మార్చి 31
ముబి
- ప్లీజ్ బేబీ ప్లీజ్ (హాలీవుడ్) మార్చి 31
ఆహా
- సత్తిగాని రెండెకరాలు (తెలుగు) ఏప్రిల్ 1
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Train accident: గూడ్స్ రైలును ఢీకొట్టిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
-
Crime News
Cyber Crime: రూ.5 జీఎస్టీ కట్టాలని చెప్పి.. రూ.లక్ష కాజేశాడు!
-
World News
Imran Khan: రూ.1500 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇమ్రాన్‌ఖాన్
-
Crime News
Hyderabad: పెట్రోల్ బంకు సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం
-
India News
Amit Shah: మణిపుర్ కల్లోలం.. అమిత్ షా వార్నింగ్ ఎఫెక్ట్ కనిపిస్తోందా..?
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వానికి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు