Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Telugu Movies: ఈ వారం థియేటర్లో అలరించే చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, సిరీస్‌లు ఇవే!
Telugu Movies: గత రెండు వారాలుగా చిన్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అదే పంథాలో ఈ వారం కూడా నడవనుంది. అయితే, ఈసారి కాస్త పేరున్న నటులు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. వారెవరు? ఆ సినిమాలేంటి చదివేయండి
న్యాయం కోసం ఎదిరించేవాడే బలవంతుడు అంటున్న అల్లరి నరేష్
అన్యాయంగా బెదిరించేవాడికన్నా... న్యాయం కోసం ఎదిరించేవాడే బలమైనవాడు అంటున్నాడు ఓ యువ అధికారి. ఎన్నికల విధుల కోసం గిరిజన ప్రాంతానికి వెళ్లిన ఆయన, ప్రజల కోసం ఏం చేశాడో తెలియాలంటే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) చూడాల్సిందే. అల్లరి నరేష్ (Naresh) కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఏఆర్ మోహన్ దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ నెల 25న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా అల్లరి నరేష్ ఇందులో కనిపించనున్నారు.
వ్యక్తి తోడేలుగా మారితే...
ప్రమాదవశాత్తూ ఓ వ్యక్తి తోడేలుగా మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అతడు మళ్లీ సాధారణమైన మనిషిగా మారాడా? లేదా? అనే ఆసక్తికర అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రం ‘భేడియా’ (Bhediya). వరుణ్ ధావన్ (Varun Dhawan) - కృతిసనన్ (Kriti Sanon) జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ‘తోడేలు’ పేరుతో అల్లు అరవింద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. అమర్ కౌశిక్ ఈచిత్రానికి దర్శకత్వం వహించారు.
ఫోన్లు మార్చుకోవడం వల్ల తల్లకిందులైన జీవితాలు
తమిళంలో సూపర్ హిట్టయిన ‘లవ్‌టుడే’ (Love today) అదే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత దిల్‌రాజు. ప్రదీప్ రంగనాథన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో ఘన విజయం సాధించింది. నవంబరు 25న థియేటర్లలో ‘లవ్‌టుడే’ విడుదల కానుంది. ఇవానా కథానాయిక. యువన్ శంకర్‌రాజా సంగీతం అందించారు.
రణం ఎవరి మధ్య?
ధర్మ, చాందినిరావు జంటగా నటించిన చిత్రం ‘రణస్థలి’(Ranasthali). ‘అశ్వద్థామ’ చిత్రానికి రచయితగా పనిచేసిన పరశురాం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. అనుపమ సూరెడ్డి నిర్మాత. నవంబరు 26న ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచే చిత్రమిది. ఈ కథలో హింస అంశాన్ని స్పృశించిన తీరు ఆలోచన రేకెత్తిస్తుంది. దర్శకుడు చిత్రాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుంది. ఈ కథలో రణం ఎవరెవరి మధ్య, ఎందుకు సాగిందన్నది కీలకం’ అని చిత్ర బృందం చెబుతోంది.
ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలివే!
నెట్‌ఫ్లిక్స్
📽️వెన్స్డే (వెబ్‌సిరీస్) నవంబరు 23
📽️ద స్విమ్మర్స్ (హాలీవుడ్) నవంబరు 23
📽️ గ్లాస్ ఆనియన్ (హాలీవుడ్) నవంబరు 23
📽️ బ్లడ్, సెక్స్ అండ్ రాయల్టీ (డ్యాకుమెంటరీ సిరీస్) నవంబరు 23
📽️ద నోయల్ డైరీ (హాలీవుడ్) నవంబరు 25
📽️ ఖాకీ: ది బిహార్ చాప్టర్ (హిందీ సిరీస్) నవంబరు 25
📽️ పడవేట్టు (మలయాళం) నవంబరు 25
అమెజాన్ ప్రైమ్
📽️ గుడ్ నైట్ ఊపీ (మూవీ) నవంబరు 23
జీ5
📽️ చుప్ (బాలీవుడ్) నవంబరు 25
డిస్నీ+హాట్‌స్టార్
📽️ ప్రిన్స్ (తెలుగు) నవంబరు 25
📽️ ద గార్డియన్ ఆఫ్ ది గెలాక్సీ హాలిడే స్పెషల్ (హాలీవుడ్) నవంబరు 25
ఆహా
📽️ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (తెలుగు మూవీ) నవంబరు 25
📽️ఎన్బీకే అన్‌స్టాపబబుల్ (సీజన్-2 ఎపిసోడ్ 4) నవంబరు 25
సోనీ లివ్
📽️ గర్ల్స్ హాస్టల్ (హిందీ సిరీస్) నవంబరు 25
📽️మీట్ క్యూట్ (తెలుగు మూవీ) నవంబరు 25
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్‌పై ప్రశాంత్ వర్మ
తన సినిమాటిక్ యూనివర్స్‌పై దర్శకుడు ప్రశాంత్‌వర్మ ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్‌వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
హనుమాన్ జన్మోత్సవ్ సందర్భంగా ‘జై హనుమాన్’కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని ప్రశాంత్‌వర్మ పంచుకున్నారు. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు. -
10 వేల పదాలతో విజయ్‌పై కవిత.. అవార్డు దక్కించుకున్న అభిమాని
తమిళ స్టార్ హీరో విజయ్‌పై ఓ అభిమాని వినూత్న రీతిలో తన అభిమానాన్ని చాటుకున్నారు. -
రజనీకాంత్- లోకేశ్ కాంబో టైటిల్ వచ్చేసింది.. ఈ పేరు ఊహించారా?
రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఖరారైంది. అదేంటంటే? -
చిరు ‘విశ్వంభర’.. హైలైట్ షెడ్యూల్ పూర్తి!
చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’లో ఇంటర్వెల్ సన్నివేశాలు హైలైట్ కానున్నాయి. దీని షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు సమాచారం. -
ఈ వారం థియేటర్లో ఆసక్తికర మూవీస్.. ఓటీటీలో డబుల్ ఫన్..
ఏప్రిల్ చివరి వారంలో ప్రేక్షకులను అలరించడానికి థియేటర్‌కు ఆసక్తికర చిత్రాలు రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ వినోదాన్ని పంచడానికి పలు చిత్రాలు, సిరీస్‌లు సిద్ధమయ్యాయి. -
ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ గ్లింప్స్.. అమితాబ్ బచ్చన్ పాత్ర ఇదే!
‘కల్కి 2898 ఏడీ’లోని అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. -
25 రోజుల్లో రూ.150 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న ‘ఆడు జీవితం’
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన సర్వైవల్ థ్రిల్లర్ ‘ఆడు జీవితం’ (Aadujeevitham). ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. -
‘శబరి’ చేయడానికి ఆమె ప్రధాన కారణం: నిర్మాత మహేంద్రనాథ్
‘శబరి’ సినిమా మే 3న ప్రేక్షకుల ముందుకురానున్న సందర్భంగా నిర్మాత మీడియాతో ముచ్చటించారు. -
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
రాజమౌళి - మహేశ్ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని నిర్మాత గోపాల్‌రెడ్డి కోరారు. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
రెండు హిట్ సినిమాల సీక్వెల్స్‌పై నిర్మాత రాధామోహన్ మాట్లాడారు. వాటి స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందన్నారు. -
సూపర్‌హిట్ చిత్రానికి సీక్వెల్ ప్రకటించిన సితార ఎంటర్టైన్మెంట్స్
ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ తెరంగేట్రం చేసిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. -
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?
‘హనుమాన్’తో ఘన విజయాన్ని అందుకున్నారు నటుడు తేజ సజ్జా (Teja Sajja). తాజాగా ఆయన తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేశారు. -
మాటిస్తున్నా..: ‘జై హనుమాన్’పై ప్రశాంత్ వర్మ పోస్ట్
ప్రశాంత్ వర్మ (Prasanth varma) - తేజ సజ్జా (Teja Sajja) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ (Hanuman). ఈ చిత్రానికి కొనసాగింపుగా ‘జై హనుమాన్’ (Jai hanuman) రానున్న విషయం తెలిసిందే. -
ఐపీఎల్, ఎన్నికల ఎఫెక్ట్.. వెనక్కి తగ్గుతున్న సినిమాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల కానుండటంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. దీంతో పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. -
చిత్ర పరిశ్రమలో ‘ఏఐ’ ట్రెండ్.. విజయ్ సినిమాలో దివంగత నటుడు!
విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఇందులో దివంగత నటుడు విజయకాంత్ కనిపించనున్నారు. -
మహేశ్-రాజమౌళి మూవీ.. ముందే ఆ విషయం చెప్పబోతున్నారా?
మహేశ్, రాజమౌళి సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం సామాజిక మాధ్యమాల వేదికగా చక్కర్లు కొడుతోంది. -
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో.. అధికారికంగా ప్రకటించిన టీమ్..
‘కన్నప్ప’లో బాలీవుడ్ స్టార్ హీరో భాగమైనట్లు చిత్రబృందం తెలిపింది. -
ఈ వారమూ చిన్న చిత్రాలదే హవా.. మరి ఓటీటీలో..?
ఈ వారం కూడా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాలే సందడి చేయనున్నాయి. మరోవైపు ఓటీటీలో అలరించే చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్‌గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్