upcoming movies: అందరి కళ్లూ ఈ చిత్రంపైనే.. ఈ వారం థియేటర్‌లో ఒకే ఒక్కటి..!

పాన్‌ ఇండియా మూవీతో  ఈ వారం బాక్సాఫీస్‌కు సరికొత్త కళ రానుంది. మరోవైపు ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు రాబోతున్నాయి.

Published : 24 Jun 2024 10:01 IST

ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఎపిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, కమల్‌హాసన్‌, దిశాపటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌, తారాగణంతో రూపొందిన ఈ మూవీ జూన్‌ 27న (Kalki 2898 AD Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్‌ విడుదల చేస్తోంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. కాశీ, కాంప్లెక్స్‌, శంబల అనే మూడు ప్రపంచాల మధ్య జరిగే కథకు పురాణగాథ, పాత్రలను జత చేసి నాగ్‌ అశ్విన్‌ ఈ మూవీని తీర్చిదిద్దారు. ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న ప్రభాస్‌ ఈ సినిమాతో పాన్‌ వరల్డ్‌ స్టార్‌ కావడం ఖాయమని చిత్ర బృందం చెబుతోంది. జనవరి తర్వాత బాక్సాఫీస్‌ వద్ద భారీ చిత్రాలేవీ సందడి చేయలేదు. వేసవి కాలమంతా చిన్న, మధ్యస్థాయి సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ క్రమంలో ‘కల్కి’ వంటి విజువల్‌ వండర్‌ వస్తుండటంతో భారతీయ సినీ పరిశ్రమ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లివే!

నవదీప్‌ కథానాయకుడిగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఫంకూరీ గిద్వానీ (Pankhuri Gidwani) కథానాయిక. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదికగా ‘ఆహా’లో జూన్‌ 27వ తేదీ నుంచి (Love Mouli ott) స్ట్రీమింగ్‌ కానుంది.


 • నెట్‌ఫ్లిక్స్‌
 • వరస్ట్‌ రూమ్మేట్‌ ఎవర్‌2 (వెబ్‌ సిరీస్‌) జూన్‌ 26
 • సుపాసెల్‌ (వెబ్ సిరీస్‌) జూన్‌ 27
 • దట్‌ నైన్టీస్‌ (వెబ్‌సిరీస్‌2) జూన్‌ 27
 • మై లేడీ జానీ (వెబ్‌సిరీస్) జూన్‌ 27
 • ఎ ఫ్యామిలీ ఎఫైర్‌ (హాలీవుడ్) జూన్‌ 28
 • ఓనింగ్‌ మాన్‌ హట్టన్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌ 28
 • ది వర్ల్‌ విండ్‌ (కొరియన్‌ సిరీస్‌) జూన్‌ 28
 • అమెజాన్‌ప్రైమ్‌
 • సివిల్‌వార్‌ (తెలుగు డబ్బింగ్‌) జూన్‌ 28
 • శర్మాజీ కీ బేటీ (హిందీ) జూన్‌ 28
 • జీ5
 • రౌతూ కా రాజ్‌ (హిందీ) జూన్‌ 28
 • డిస్నీ+హాట్‌స్టార్‌
 • ది బేర్‌ (వెబ్‌సిరీస్‌) జూన్‌27
 • ఆపిల్‌ టీవీ ప్లస్‌
 • ల్యాండ్‌ ఆఫ్‌ ఉమెన్‌ (హాలీవుడ్‌) జూన్‌ 26
 • ఫ్యాన్సీ డ్యాన్స్‌(హాలీవుడ్‌) జూన్‌28
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు