Pawan Kalyan and Prabhas: ఇటు పవన్‌కల్యాణ్.. అటు ప్రభాస్.. తగ్గేదే లే!
ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న టాలీవుడ్ అగ్ర హీరోలు.. పవన్ కల్యాణ్, ప్రభాస్. ఏ కథానాయకుడు ఎన్ని చిత్రాల్లో నటిస్తున్నారంటే?
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడూలేనిది అగ్ర హీరోలు పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రభాస్ (Prabhas) వరుస చిత్రాలు ప్రకటించడమే కాకుండా విరామమే లేకుండా షూటింగ్స్‌లో పాల్గొంటూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అభిమానుల్ని వెంటవెంటనే అలరించేందుకు ఎంతో కష్టపడుతున్నారు. ఎవరి ప్రాజెక్టుల్లో వారు పోటాపోటీగా నటిస్తూ ‘తగ్గేదే లే’ అనిపిస్తున్నారు. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారో మీకు తెలుసా..?
రీ ఎంట్రీలో పవన్ జోరు..
అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన అభిమానులకు మరింత నిరాశ ఎదురైనట్టైంది. ‘ఇక పవన్ నటనకు గుడ్‌బై చెబుతారేమో!’ అని అంతా అనుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశంతో కొన్నాళ్ల విరామం తీసుకున్న అనంతరం ‘వకీల్‌సాబ్’ (Vakeelsab)తో రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ మంచి విజయాన్ని అందుకున్నారు. అదే ఉత్సాహంలో ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak)లో నటించి, అలరించారు. ప్రస్తుతం ఆయన నాలుగు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu) ఇప్పటికే విడుదలకావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడింది. చరిత్రాత్మక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో పవన్ మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించనున్నారు. వీరోచితమైన ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు ఆయన యుద్ధ విన్యాసాల్లో శిక్షణ తీసుకున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయిక. బాలీవుడ్ నటులు నర్గిస్ ఫక్రి, బాబీ దేవోల్ కీలక పాత్రలు పోషించారు. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు హరీశ్ శంకర్‌తో పవన్ కొన్నాళ్ల క్రితమే ఓ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎప్పుడో పట్టాలెక్కాల్సిన ఆ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇటీవల ప్రారంభమైంది. ఆ మూవీకి తొలుత ఖరారు చేసిన ‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరును ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustaad Bhagat Singh)గా మార్చారు. ఈ సినిమా కోసం పవన్ మరోసారి ఖాకీ ధరించారు. ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయింది. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఖరారుకాలేదు.
ఇక సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న ‘PKSDT’ (వర్కింగ్ టైటిల్) చిత్రీకరణలోనూ పవన్ పాల్గొన్నారు. తమిళ్ హిట్ మూవీ ‘వినోదాయ సీతం’ రీమేక్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో పవన్ మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తున్నారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లు. ఈ మల్టీస్టారర్ ఈ ఏడాది జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సాహో’తో యావత్ సినీ ప్రియుల్ని ఆకర్షించిన దర్శకుడు సుజీత్‌తో పవన్ ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) (OG) సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక. మరికొందరు దర్శకులు పవన్‌తో సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారు. కానీ, రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆయన ప్రస్తుతం కమిట్ అయిన చిత్రాల్ని పూర్తి చేసే ఆలోచనలోనే ఉన్నారు.
ఇదీ ప్రభాస్ తీరు..
పీరియాడికల్ లవ్‌స్టోరీ ‘రాధేశ్యామ్’ (Radhe Shyam)తో అభిమానుల్ని నిరాశపరిచిన ఆయన ఆ లోటును భర్తీ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ‘ఆదిపురుష్’ (Adipurush), ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్ట్ కె’ (Project K).. ఇలా వరుస పాన్ ఇండియా స్థాయి చిత్రాలే కాకుండా మధ్యలో ఓ చిన్న చిత్రంలోనూ నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ చిత్రీకరణ పూర్తయింది. విజువల్స్‌ను మరింత మెరుగ్గా చూపించేందుకు చిత్ర బృందం.. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమాని వాయిదా వేసింది. ఈ ఏడాది జూన్ 16న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అంతకంటే ముందే.. ఈ సినిమా జూన్ 13న ప్రతిష్ఠాత్మక ‘ట్రిబెకా ఫెస్టివల్’లో ప్రదర్శితంకానుంది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్.. రాఘవగా, కృతిసనన్.. జానకిగా, సైఫ్ అలీఖాన్.. లంకేశ్‌గా నటించారు. ‘కేజీయఫ్’ ఫేం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ ఈ ఏడాది సెప్టెంబరు 28న విడుదలవుతుంది. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశలో ఉంది. రెండు భాగాలు ఈ మూవీని తీసుకొస్తున్నారు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ (వర్కింగ్ టైటిల్).. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌కానుంది. సైన్ ఫిక్షన్ నేపథ్యంలో సుమారు రూ. 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాలో దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అది సంచలనం అవుతోంది. వీటిల్లోని పవర్ఫుల్ రోల్స్ నుంచి కాస్త రిలాక్స్ అయ్యేందుకేమో.. మారుతి డైరెక్షన్లో వినోదాత్మక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు ప్రభాస్. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా చిత్ర బృందం శరవేగంగా చిత్రీకరణ సాగిస్తోంది. అందులో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్, రిద్ది కుమార్ తదితరులు నటిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేం సందీప్ వంగా రెడ్డితో ప్రభాస్ ప్రకటించిన పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ (Spirit) త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. అందులో ప్రభాస్ పోలీసు అధికారిగా కనిపిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్‌రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్