Ott Movies: ఈ వారం ఓటీటీలో సినిమాల సందడే సందడి!

Telugu ott movies: ఈ వారం వివిధ ఓటీటీల వేదికగా స్ట్రీమింగ్‌ కాబోతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

Published : 18 May 2023 10:10 IST

Telugu Ott Movies: ప్రతి వారం సరికొత్త సినిమాలు థియేటర్‌లలో సందడి చేసేందుకు సిద్ధమవుతుంటే, ఇప్పటికే ప్రేక్షకులను అలరించిన చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు వస్తున్నాయి. అలా ఈ వీకెండ్‌లో వినోదాలను పంచడానికి సిద్ధమైన సినిమాలు/వెబ్‌సిరీస్‌లు ఏంటి? ఎక్కడ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి?

‘విరూపాక్ష’.. థియేటర్‌లో మెప్పించి..

సాయిధరమ్‌ తేజ్‌ (Sai Dharamtej) కథానాయకుడిగా కార్తీక్‌ దండు తెరకెక్కించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘విరూపాక్ష’ (Virupaksha). గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఇప్పటికీ థియేటర్‌లో మంచి టాక్‌తో నడుస్తోంది. ఈ క్రమంలోనే ఓటీటీలో అలరించేందుకు ‘విరూపాక్ష’ సిద్ధమయ్యాడు. మే 21వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. థియేటర్‌లో విడుదలైన సరిగ్గా నెల రోజులకు ఓటీటీలో వస్తుండటం గమనార్హం. కథానాయిక సంయుక్త నటన ఈ చిత్రానికి మరో హైలైట్‌.


మూడు వారాలకే ‘ఏజెంట్‌’

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో అఖిల్‌ (Akhil) నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్‌’(Agent). భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సోనీలివ్‌ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు.


నటిగా మరోసారి..

మెగా కుటుంబం నుంచి నటిగా వచ్చిన వారిలో నిహారిక  (Niharika konidela)ఒకరు. ఒకట్రెండు సినిమాల తర్వాత వెండితెరకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె వెబ్‌సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. నిహారిక కీలక పాత్రలో నటించిన తాజా సిరీస్‌ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ (Dead Pixels) వైవా హర్ష, అక్షయ్‌ లింగుస్వామి, సాయి రోణక్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నారు.


ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

 • అయాలవాషి  (మలయాళం)మే 19
 • కథల్‌ : ఏ జాక్‌ఫ్రూట్‌ మిస్టరీ (హిందీ) మే 19

 • బయీ అజైబి (ఇంగ్లీష్‌) మే 19
 • సెల్లింగ్‌ సన్‌సెట్‌ (సీజన్‌-6) మే 19
 • మ్యూటెడ్‌ (ఇంగ్లీష్‌) మే 19

సోనీ లివ్‌

 • కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) మే 19

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

 • బ్యాక్‌డోర్‌ (తెలుగు) స్ట్రీమింగ్‌ అవుతోంది

 • మోడ్రన్‌ లవ్‌ చెన్నై (తమిళ్‌) మే 18

ఆహా

 • మారుతీ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ (తమిళ్‌)) మే19
 • ఏమి సేతురా లింగ (తెలుగు) మే 19
 • తెలుగు ఇండియన్‌ ఐడల్‌ (ఎపిసోడ్‌ 24, 25) మే 19, 20
 • సర్కార్‌ 3 (ఎపిసోడ్‌ 4, 5) మే 19, 20


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు