Cinema News: ముగింపు మెరుపులు వీళ్లవే!
చిరంజీవి - బాలకృష్ణ.. సంక్రాంతి బరిలో తలపడేందుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్, ప్రభాస్, రామ్‌చరణ్, నాని... వేసవి రేసుపై గురి పెట్టారు.
‘అవతార్ 2’పై ఎన్నో ఆశలు
చిరంజీవి - బాలకృష్ణ.. సంక్రాంతి బరిలో తలపడేందుకు సిద్ధమయ్యారు. పవన్ కల్యాణ్, ప్రభాస్, రామ్‌చరణ్, నాని... వేసవి రేసుపై గురి పెట్టారు. నాగార్జున, వెంకటేష్, మహేష్‌బాబు, ఎన్టీఆర్.. వీరి రాక ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేం. మరి ఈ ఏడాదికి శుభం కార్డు వేసేది ఎవరు? ఇప్పుడీ బాధ్యతను అగ్ర హీరో రవితేజతో కలిసి భుజానికెత్తుకున్నారు యువ కథానాయకులు. విజయాలతో జోరు చూపాలన్నా.. మెరుపులాంటి ముగింపు అందించాలన్న వీరి చేతుల్లోనే ఉంది. మరి ఆయా తారల సినిమాల సత్తా ఎంత? ఎవరిపై ఎన్ని అంచనాలున్నాయి? తెలుసుకుందాం.
ముగింపులో అగ్రతారల మెరుపులు కనిపిస్తే ఆ ఉత్సాహం మరోస్థాయిలో ఉంటుంది. ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాలతో గతేడాది తెలుగు చిత్రసీమకు మెరుపు లాంటి ముగింపే దక్కింది. ఈసారి ఆ స్థాయిలో పెద్ద చిత్రాల సందడి కనిపించకున్నా.. వినోదాలకు ఏ లోటు లేదంటున్నారు యువ కథానాయకులు. ఎందుకంటే ఈ ఏడాదికి శుభం కార్డు వేయనుంది వీళ్లే. ఇటీవలే ‘మేజర్’గా పాన్ ఇండియా స్థాయిలో మెరుపులు మెరిపించారు కథానాయకుడు అడివి శేష్. ఇప్పుడాయన ‘హిట్2’తో (HIT 2) థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. హీరో నాని సమర్పణలో రూపొందిన చిత్రమిది. విజయవంతమైన ‘హిట్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కింది. తొలి భాగాన్ని తెరకెక్కించిన శేలేష్ కొలను ఈ రెండో భాగానికీ దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతోనే ఆసక్తిరేకెత్తిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో శేష్ తన జైత్ర యాత్ర కొనసాగిస్తారా? లేదా? తెలియాలంటే డిసెంబరు 2వరకు వేచి చూడక తప్పదు. ఇదే తేదీకి ‘మట్టి కుస్తీ’తో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనున్నారు విష్ణు విశాల్. ఆయన రెజ్లర్‌గా నటించిన క్రీడా నేపథ్య చిత్రమిది. చెల్లా అయ్యావు తెరకెక్కించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఏక కాలంలో విడుదల కానుంది. ఈ చిత్ర నిర్మాణంలో హీరో రవితేజ కూడా భాగస్వామిగా ఉండటంతో దీనిపైనా ప్రేక్షకుల్లో చక్కటి అంచనాలే నెలకొని ఉన్నాయి.
మాస్‌గా రవితేజ.. క్లాస్‌గా నిఖిల్!
మాస్ యాక్షన్ చిత్రాలకు చిరునామా రవితేజ. ఇప్పుడాయన ‘ధమాకా’తో సరికొత్త మాస్ యాక్షన్ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రమిది. ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రాలతో ఈ ఏడాది వరుస పరాజయాలు అందుకున్నారు రవితేజ. అందుకే ఆయన ఈ సినిమాతో విజయం దక్కించుకోవాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో డిసెంబరు 23న విడుదల కానుంది. ఇదే తేదీకి ‘18 పేజిస్’ (18 Pages) రూపంలో ఓ అందమైన ప్రేమకథను ప్రేక్షకులకు చూపించనున్నారు యువ కథానాయకుడు నిఖిల్. పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన చిత్రమిది. సుకుమార్ రైటింగ్స్, జీఏ2 పిక్చర్స్ పతాకాలపై నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. ‘కార్తికేయ2’ వంటి పాన్ ఇండియా హిట్ తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.
వీళ్లూ వచ్చేనా?
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని.. డిసెంబర్లో బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న చిత్రాల్లో ‘రంగమార్తాండ’, ‘అహింస’, ‘హంట్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రమే ‘రంగమార్తాండ’. కొవిడ్ పరిస్థితుల వల్ల చాలా ఆలస్యమైన ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. డిసెంబరు మూడో వారంలో బాక్సాఫీస్ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. నిర్మాత సురేష్‌బాబు రెండో తనయుడు అభిరామ్‌ను హీరోగా పరిచయం చేస్తూ.. తేజ తెరకెక్కించిన చిత్రం ‘అహింస’ (Ahimsa). యువతరం మెచ్చే కొత్తదనం నిండిన ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా.. డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హంట్’. మహేష్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్లోనే బాక్సాఫీస్ ముందుకు రానున్నట్లు సమాచారం.
‘పంచతంత్రం’ వినోదం
డిసెంబరు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాల్లో... కాస్త అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న సినిమా ‘పంచతంత్రం’. ఐదు కథల సమాహారంగా హర్ష పులిపాక తెరకెక్కించిన చిత్రమిది. బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి, శివాత్మిక రాజశేఖర్, నరేష్ అగస్త్య, రాహుల్ విజయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆహ్లాదభరితంగా ఆకట్టుకునేలా ఉండటంతో క్లాస్ ప్రేక్షకుల్లో దీనిపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా డిసెంబరు 9న విడుదల కానుంది. అదే తేదీన ‘రాజయోగం’ అనే మరో చిన్న సినిమా కూడా బాక్సాఫీస్ బరిలో అదృష్టం పరీక్షించుకోనుంది. ఇక ప్రపంచ సినీప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2’ (Avatar 2). ‘అవతార్’కు సీక్వెల్‌గా జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యంపై ఇటు ప్రేక్షకుల్లోనూ.. అటు ట్రేడ్ వర్గాల్లోనూ ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తొలి భాగం 2.92 బిలియన్ డాలర్ల వసూళ్లతో ప్రపంచ సినీ చరిత్రలో సరికొత్త రికార్డులు సృష్టించగా.. ఇప్పుడొస్తున్న ఈ రెండో భాగం ఏస్థాయిలో వసూళ్లు దక్కించుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది డిసెంబరు 16న బాక్సాఫీస్ ముందుకు రానున్న నేపథ్యంలో ఇంత వరకు ఆ తేదీపై మరో తెలుగు చిత్రమేదీ కన్నేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మనసంతా.. ఫాంటసీ
చిత్ర పరిశ్రమలో సోషియో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే కొత్త ప్రపంచాలు.. -
‘విక్రమార్కుడు2’ కోసం కథ సిద్ధమైంది
‘‘తెలుగులో ‘విక్రమార్కుడు 2’, హిందీలో ‘రౌడీ రాథోడ్ 2’ చిత్రాల కోసం కథ సిద్ధమైంది. నటుల ఎంపిక పూర్తవ్వగానే సినిమాని పట్టాలెక్కిస్తాం’’ -
గురుశిష్యులుగా తండ్రీకూతుళ్లు?
సినిమాల్లో నటనతో మెప్పించే కథానాయకులు.. వారి వారసులను తెరపైకి ఎప్పుడెప్పుడు తీసుకొస్తారా? అనే ఆసక్తితో ఎదురుచూస్తుంటారు సినీప్రియులు. -
ఈ వేసవిలో... ‘మనమే’
‘చాలా మంచోడిగా కనిపిస్తా, కానీ మంచోడినా? కాదు’ అని చెప్పుకునే ఓ అబ్బాయి. ‘ఒకరికి మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండటమే మన క్యారెక్టర్’ అని నమ్మే ఓ అమ్మాయి. -
నిర్ణయించుకో.. నిన్నెవరు పాలించాలో!
‘రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే... మీ ఆస్తులు మాత్రం ఎలా పెరుగుతున్నాయి సర్?’ అంటూ సూటిగా ప్రశ్నించాడు ఓ పాత్రికేయుడు. మరి సదరు నాయకుడి సమాధానం ఏమిటో తెలియాలంటే ‘ప్రతినిధి2’ చూడాల్సిందే. -
రెట్టింపు నవ్వులతో... ‘మ్యాడ్ స్క్వేర్’
‘టిల్లు స్క్వేర్’తో విజయాన్ని సొంతం చేసుకున్న సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ... మరో కొనసాగింపు చిత్రాన్ని పట్టాలెక్కించింది. -
బేబి కీర్తి.. సెట్లో సందడి
ఇతర భాషల్లో నటించి మంచి క్రేజ్‌ని సొంతం చేసుకున్న నాయకానాయికలు ఎందరో. ఇప్పుడదే జాబితలో చేరింది అందాల కథానాయిక కీర్తి సురేశ్. ‘బేబి జాన్’తో ఆమె బాలీవుడ్లో అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. -
‘బాక్’.. వారం వెనక్కి
సుందర్. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్’. ఖుష్బు సుందర్, ఏసీఎస్ అరుణ్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు. -
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయిన ‘ప్రేమలు’ చిత్రానికి సీక్వెల్ రానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan).
తాజా వార్తలు (Latest News)
-
వేధింపులు.. ఊడిగంలో తగ్గేదే లేదు
-
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
-
ఒలింపిక్స్‌లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్‌లో నిక్ష్లిప్తం
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్‌రెడ్డి