Tollywood: ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలివే!

Tollywood: ఇటు వెండితెరపై, అటు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలివే!

Updated : 24 Nov 2022 16:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు రాష్ట్రాల్లో నెమ్మదిగా థియేటర్‌లో విడుదలవుతున్న సినిమాల సంఖ్య పెరగడం శుభపరిణామం. ముఖ్యంగా దసరా నవరాత్రి ఉత్సవాలు, సెలవుల నేపథ్యంలో కొత్త సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి కాస్త మంచి గుర్తింపు ఉన్న కథానాయకులు వెండితెరపై సందడి చేసేందుకు వస్తున్నారు. మరోవైపు ఇప్పటికే విడుదలై థియేటర్‌లో అలరించిన పలు చిత్రాలతో పాటు, వెబ్‌సిరీస్‌లు సైతం ఓటీటీల్లో విడుదలవుతున్నాయి. మరి ఈ వారం ప్రేక్షకులను అలరించే ఆ చిత్రాలేంటో చూసేద్దామా!

గతవారం అన్న.. ఈ వారం తమ్ముడు..

తవారం ‘రిపబ్లిక్‌’తో ప్రేక్షకులను పలకరించారు సాయితేజ్‌. ఈ వారం ఆ సినీ సందడిని ఆయన సోదరుడు వైష్ణవ్‌తేజ్‌ కొనసాగించనున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ జంటగా నటించిన చిత్రం ‘కొండపొలం’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 8న థియేటర్‌లలో విడుదల కానుంది. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. గొర్రెల కాపరిగా, ఉన్నత విద్య అభ్యసించిన వ్యక్తి రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్‌ తేజ్‌, ఓబులమ్మగా రకుల్‌ అలరించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీతం బాగుంది. ఈ ఏడాది ‘ఉప్పెన’తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వైష్ణవ్‌తేజ్‌ ‘కొండపొలం’లో ఎలా అలరిస్తారో చూడాలి!


ఎట్టకేలకు వస్తున్న ‘ఆరడుగుల బుల్లెట్‌’

గోపీచంద్‌, నయనతార జంటగా నటించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. బి.గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం పలు కారణాల వల్ల ఇంతకాలం విడుదలకు నోచుకోలేదు. అక్టోబర్‌ 8న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేశ్‌ నిర్మించారు.


‘నేను లేని... నా ప్రేమకథ’ అంటున్న నవీన్‌ చంద్ర

వీన్‌చంద్ర కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘నేను లేని నా ప్రేమకథ’. గాయత్రి ఆర్‌.సురేష్‌, అదితి మ్యాకల్‌ కథానాయికలు. సురేష్‌ ఉత్తరాది దర్శకత్వం వహిస్తున్నారు. కల్యాణ్‌ కందుకూరి, నిమ్మకాయల దుర్గాప్రసాద్‌రెడ్డి, అన్నదాత భాస్కర్‌రావు నిర్మాతలు. ‘‘మనసుల్ని హత్తుకునే ప్రేమకథ ఇది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది. కరోనా విరామం సమయంలో ఈ చిత్రానికి దర్శకుడు ప్రత్యేకంగా మెరుగులు దిద్దారు. రాంబాబు గోసాల పాటలు, ఎన్‌.కె.భూపతి కెమెరా పనితనం చిత్రానికి ప్రధానబలం.’’ అని చిత్ర బృందం ఇటీవల తెలిపింది. అక్టోబరు 8న ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


తుపాకీ పట్టిన వైద్యుడు ‘వరుణ్‌ డాక్టర్‌’

మిళంతో పాటు, తెలుగులోనూ అలరిస్తున్న నటుడు శివ కార్తికేయన్‌. ఆయన నటించిన పలు సినిమాలు అనువాదమై ఇక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. నీల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో శివ కార్తికేయన్‌ నటించిన తాజా మెడికల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘వరుణ్‌ డాక్టర్‌’. ప్రియాంక అరుళ్‌ మోహన్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. అక్టోబరు 9న ఈ సినిమాను థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. అమ్మాయిల కిడ్నాప్‌లను అడ్డుకునేందుకు ఓ డాక్టర్‌ ఏం చేశాడు? ఎవరెవరి సాయం తీసుకున్నాడు? చివరకు అమ్మాయిలను కిడ్నాప్‌ చేసే ముఠా ఆటకట్టించాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


ఓటీటీలో రాబోతున్న చిత్రాలివే!

 మనసు దోచనున్న ‘రాజరాజ చోర’

కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకి మంచి వినోదం పంచిన చిత్రం ‘రాజ రాజ చోర’. కామెడీ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాకి విశేష స్పందన లభించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. అక్టోబరు 8 నుంచి ‘జీ 5’లో స్ట్రీమింగ్‌కానుంది. శ్రీ విష్ణు కథానాయకుడిగా హసిత్‌ గోలి తెరకెక్కించిన సినిమా ఇది. మేఘా ఆకాశ్‌, సునయన కథానాయికలు.


అంధాదున్‌.. ఇప్పుడు మలయాళంలో..

బాలీవుడ్‌లో ఘన విజయాన్ని అందుకుని, ఇప్పుడు చిత్ర పరిశ్రమల్లోనూ సందడి చేసిన, చేయడానికి వస్తున్న చిత్రం ‘అంధాదున్‌’. ఇప్పటికే తెలుగులో నితిన్‌ కీలక పాత్రలో ‘మ్యాస్ట్రో’గా విడుదలైన మంచి విజయాన్ని అందుకుంది. ఈ వారం మలయాళ ప్రేక్షకులను ‘భ్రమమ్‌’ పేరుతో అలరించడానికి సిద్ధమైంది. వైవిధ్య కథా చిత్రాలను ఎంచుకునే పృథ్వీరాజ్‌ సుకుమార్‌ కీలక పాత్రలో ఈ సినిమా తెరకెక్కింది. రవి.కె చంద్రన్‌ దర్శకత్వం వహించారు. హిందీలో టబు పోషించిన పాత్రను మలయాళంలో మమతా మోహన్‌దాస్ చేస్తున్నారు. పృథ్వీ గర్ల్‌ఫ్రెండ్‌గా రాశీఖన్నా కనిపించనుంది. అక్టోబరు 7న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మరి మాతృకతో పోలిస్తే ఏమైనా మార్పులు చేశారా? లేదా? తెలియాలంటే ‘భ్రమమ్‌’ చూడాల్సిందే!


ఆహాలో ‘కోల్డ్‌ కేస్‌’

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ ‘కోల్డ్‌ కేస్‌’. తను బాలక్‌ దర్శకుడు.  జూన్‌ 30న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మలయాళం భాషలో విడుదలైంది. కాగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా  అక్టోబరు 8వ తేదీ నుంచి ‘కోల్డ్ కేస్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. పృథ్వీరాజ్‌ ఇందులో పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు.


అమెజాన్‌ ప్రైమ్‌

📺 మాడ్రెస్‌- అక్టోబరు 08

📺 జస్టిన్‌ బీబర్‌ ఔర్‌ వరల్డ్‌- అక్టోబరు 08

నెట్‌ఫ్లిక్స్‌

📺 ఎస్కేప్‌ ది అండర్‌ టేకర్‌- అక్టోబరు 5

📺 డేర్స్‌ సమవన్‌ ఇన్‌సైడ్‌ యువర్‌ హౌస్‌- అక్టోబర్‌ 6

📺 హౌస్‌ ఆఫ్‌ సీక్రెట్స్‌- అక్టోబరు8

డిస్నీ+హాట్‌ స్టార్‌

📺 ముప్పెట్స్‌ హంటెడ్‌ మాన్షన్‌- అక్టోబరు 8

సోనీ లివ్‌

📺 అప్పథావా ఆట్టయా పొట్టుటాంగా- అక్టోబరు 8

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని