Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
Telugu Movies: ఈ వారం అటు థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
upcoming telugu movies: వరుస చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాయి. తెలుగు సినిమాలతో పాటు, డబ్బింగ్ చిత్రాలూ అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అలా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలేంటో చూసేయండి.
రెండు కుటుంబాల కథ ‘అన్నీ మంచి శకునములే’
ఈ వేసవిలో కుటుంబ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన చిత్రం ‘అన్నీ మంచి శకునములే’ (Anni Manchi Sakunamule). సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రమిది. యువ నిర్మాతలు స్వప్నదత్, ప్రియాంకదత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేసవిలో అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఓ పది రోజులు గడిపి వస్తే ఆ జ్ఞాపకాలు ఎలాంటి హాయిని పంచుతాయో అలాంటి మూవీ అని చిత్ర బృందం చెబుతోంది.
మరోసారి అలరించేందుకు ‘బిచ్చగాడు’
‘బిచ్చగాడు’ సినిమాతో తన కెరీర్‌లోనే భారీ విజయాన్ని అందుకున్నారు హీరో విజయ్ ఆంటోని (Vijay Antony). ఇప్పుడాయన ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘బిచ్చగాడు-2’ (Bichagadu 2)ని సిద్ధం చేశారు. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రమిది. కావ్య థాపర్ కథానాయిక. ఈ సినిమా మే 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగంలో రెండు కోణాలున్న పాత్ర పోషించిన ఆయన.. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. యాక్షన్‌తో పాటు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చారు.
యాక్షన్ ప్రియుల కోసం..
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులకు పరిచయమున్న సిరీస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’. అందులో నటించిన విన్ డీజిల్ అంటే అందరికీ పిచ్చి క్రేజ్. ఆ సిరీస్‌లో రాబోతున్న తర్వాతి చిత్రం ‘ఫాస్ట్ ఎక్స్’. జస్టిన్ లిన్ దర్శకుడు. జాసన్ మొమోవా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇది రెండు భాగాలుగా రానుంది. వీటిలో మొదటి భాగమైన ‘ఫాస్ట్ ఎక్స్’ 2023 మే 19న విడుదల కానుంది.. కార్లతో దుమ్ము రేపే పోరాటాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ ఎపిసోడ్లతో ప్రేక్షకులను సీటు అంచులకు తీసుకొచ్చే ఈ సిరీస్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
థియేటర్‌లో మెప్పించలేదు.. మరి ఓటీటీలో..?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’(Agent). భారీ అంచనాల మధ్య ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు సోనీలివ్ వేదికగా మే 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాక్షి వైద్య కథానాయిక. ప్రముఖ కథానాయకుడు మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో కనిపించారు.
నటిగా మరోసారి అలరించేందుకు సిద్ధమైన నిహారిక
వివాహానంతరం నిహారిక కొణిదెల (Niharika konidela) ‘డెడ్ పిక్సెల్స్’ (Dead Pixels) వెబ్ సిరీస్‌తో నటిగా రీ ఎంట్రీ ఇస్తున్నారు. వైవా హర్ష, అక్షయ్ లింగుస్వామి, సాయి రోణక్ తదితరులు ప్రధాన పాత్రలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య మండల దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్ ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’ (Disney+ Hotstar)లో ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. వీడియో గేమ్‌లకు యువత ఎంతగా ప్రభావితమవుతుందో ఈ సిరీస్‌లో చూపించబోతున్నట్టు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది.
నెట్‌ఫ్లిక్స్
- అయాలవాషి (మలయాళం)మే 19
- కథల్ (హిందీ) మే 19
- బయీ అజైబి (ఇంగ్లీష్) మే 19
- మ్యూటెడ్ (ఇంగ్లీష్) మే 19
- నామ్ (సీజన్-2) మే 1
సోనీ లివ్
- కడిన కదోరమీ అంద కదహం (మలయాళం) మే 19
అమెజాన్ ప్రైమ్ వీడియో
- మోడ్రన్ లవ్ చెన్నై (తమిళ్) మే 18
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashok Gehlot: మ్యాజిక్ షోలు చేసైనా డబ్బులు సంపాదిస్తా.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
viral News: సిగరెట్లు తాగొద్దన్నందుకు రణరంగంగా మారిన యూనివర్శిటీ..!
-
Movies News
Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీరిలీజ్‌కు అతిథిగా చినజీయర్ స్వామి
-
India News
పునరుద్ధరించిన పట్టాలపై గూడ్స్ రైలు.. ఊపిరి పీల్చుకున్న రైల్వే మంత్రి..!
-
General News
TS High Court: భారాస ఎంపీ ఫౌండేషన్‌కు భూ కేటాయింపు.. రద్దు చేసిన హైకోర్టు