Published : 08 Aug 2022 12:43 IST

Telugu movies: ఈ వారం అటు థియేటర్‌.. ఇటు ఓటీటీలో సినిమాలే సినిమాలు..!

Upcoming telugu movies: ఒక్క విజయం కూడా లేకుండా టాలీవుడ్‌ను జులై ఉసూరుమనిపిస్తే, ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సీతారామం’, ‘బింబిసార’ చిత్రాలు విజయోత్సాహాన్ని ఇచ్చాయి. అదే ఊపును కొనసాగించేందుకు తాము సిద్ధమంటూ ఆగస్టు రెండో వారంలో కొన్ని చిత్రాలు సందడి చేసేందుకు వస్తున్నాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా!

మరో వైవిధ్య చిత్రంతో ఆమిర్‌ఖాన్‌

నాలుగేళ్ల తర్వాత ఆమిర్‌ఖాన్‌ (Aamir khan) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లాల్‌ సింగ్‌ చడ్డా’. అద్వైత్‌ చందన్‌ తెరకెక్కిస్తున్న ఈ కామెడీ డ్రామాలో యువ నటుడు నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. హాలీవుడ్‌ మూవీ ‘ఫారెస్ట్‌ గంప్‌’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. వైవిధ్య పాత్రలో మెప్పించే ఆమిర్‌ నుంచి వస్తున్న సినిమా కావటం, నాగచైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే, తెలుగులో చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.


రక్షాబంధన్‌తో అక్షయ్‌..

అక్షయ్‌కుమార్‌, భూమి పెడ్నేకర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘రక్షాబంధన్‌’. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకుడు. ఆగస్టు 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రం రూపొందింది. నలుగురు అక్కాచెల్లెళ్లకు లాల్‌ కేదార్‌నాథ్‌(అక్షయ్‌) ఒక్కడే అన్నయ్య. వారి బాధ్యతలు పూర్తయ్యే వరకూ తాను పెళ్లి చేసుకోనని, తల్లికి మాట ఇస్తాడు. మరి కేదార్‌నాథ్‌ తన చెల్లెళ్లకు వివాహం చేసేందుకు ఏం చేశాడు? ఎలాంటి కష్టాలు పడ్డాడు? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!


ప్రభుత్వాధికారిగా నితిన్‌

నితిన్‌ కథానాయకుడిగా ఎం.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘మాచర్ల నియోజకవర్గం’. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. ఆగస్టు 12న ఈ సినిమా విడుదల కానుంది. నితిన్‌ ఇందులో ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌లు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. అంజలి ఐటమ్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతోంది.


ద్వారకలో దాగిన రహస్యం

నిఖిల్‌-చందూ మొండేటి కాంబినేషన్‌ వచ్చిన ‘కార్తికేయ’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి చేస్తున్న మరో మిస్టరీ థ్రిల్లర్‌ ‘కార్తికేయ2’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకృష్ణుడి ద్వారక నగరం చుట్టూ అల్లుకున్న కథగా ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఆగస్టు 13న ‘కార్తికేయ2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ద్వారకలో దాగిన రహస్యం ఏంటి? దాన్ని కార్తికేయ ఎలా కనిపెట్టాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే! ఇవి కాకుండా ‘అఖండ భారత్‌’అనే చిత్రం కూడా ఆగస్టు12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు!

నెట్‌ఫ్లిక్స్‌

* నరూటో: షిప్పుడెన్‌ సీజన్‌-1 ఆగస్టు 8

* హ్యాపీ బర్త్‌డే (తెలుగు) ఆగస్టు 8

* ఐ జస్ట్‌ కిల్డ్‌ మై డాడ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 9

* ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ సీజన్‌2 (వెబ్ సిరీస్‌) ఆగస్టు 10

* లాకీ అండ్‌ కీ సీజన్‌-3 (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 10

* బ్యాంక్‌ రాబర్స్‌: ది లాస్ట్ గ్రేట్‌ హెయిస్ట్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 10

* దోతా: డ్రాగన్స్‌ బ్లడ్‌: బుక్‌ 3 (హాలీవుడ్‌) ఆగస్టు 11

* నెవ్వర్‌ హేవ్‌ ఐ ఎవర్‌ సీజన్‌-3 (వెబ్‌ సిరీస్‌)  ఆగస్టు 12

* బ్రూక్లిన్‌ నైన్‌-నైన్‌: సీజన్‌-8 (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 13

* గాడ్జిల్లా vs కాంగ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 14


డిస్నీ+హాట్‌ స్టార్‌

* ది వారియర్‌ (తెలుగు/తమిళ్‌) ఆగస్టు 11

అమెజాన్‌ ప్రైమ్‌

* సోనిక్‌ ది ఎడ్జ్‌హాగ్‌2 (హాలీవుడ్‌) ఆగస్టు 10

* ది లాస్ట్‌ సిటీ (హాలీవుడ్‌) ఆగస్టు 10

* మలయాన్‌ కుంజు (మలయాళం) ఆగస్టు 11

* ఎ లీగ్‌ ఆఫ్‌ దైర్‌ వోన్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 12

* కాస్మిక్‌ లవ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 12


సోనీ లివ్‌

* గార్గి (తెలుగు) ఆగస్టు 12


ఆహా

* మాలిక్‌ (తెలుగు) ఆగస్టు 12

* మహా మనిషి (తెలుగు) ఆగస్టు 12

* ఏజెంట్‌ ఆనంద్‌ సంతోష్‌-4 (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 12


జీ5

* హలో వరల్డ్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 12


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని