Tollywood: అడవి బాట పట్టిన తెలుగు హీరోలు.. ఇప్పుడు ఇదే ట్రెండ్!
చాన్నాళ్లకు టాలీవుడ్లో అరణ్యంలో సందడి మొదలైంది. ప్రస్తుతం తెలుగులో అడవి నేపథ్యంగా రాబోతున్న సినిమాలేంటో చూద్దాం.
అడవి.. జంతువులు/పక్షులకు నివాసం.. ఔషధ మొక్కలకు ఆలవాలం.. అది పచ్చగా ఉంటేనే మానవాళికి జీవన గమనం.. ఇక తెలుగు చిత్ర పరిశ్రమకు అడవే కథా వస్తువు. రామాయణం, భారతం గాథ ఏదైనా అడవిని దాటి రావాల్సిందే. తెలుగు కథలకు కమర్షియాలిటీకి అడవి అదనపు బలం. మారుతున్న కాలం, ప్రేక్షకుల అభిరుచులకు తగినట్లుగా ట్రెండ్ మారుతూ అడవి నేపథ్యంలో అనేక సినిమాలు తెరకెక్కాయి. మళ్లీ చాన్నాళ్లకు ఇప్పుడు అరణ్యంలో సందడి మొదలైంది. మన దర్శక-నిర్మాతలు అడవి బాట పట్టారు. ముఖ్యంగా ‘మెగా’ హీరోలు నటిస్తున్న చిత్రాలు అధికభాగం అడవి నేపథ్యంలో సాగేవే. ప్రస్తుతం టాలీవుడ్లో అడవి నేపథ్యంగా రాబోతున్న ఆ సినిమాలేంటో చూద్దామా!
జక్కన్న అడవి దారి
కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రూ. 400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రాజమౌళి దీన్ని తెరకెక్కిస్తున్నారు. కొమరం భీమ్, అల్లూరి ఇద్దరి జీవితాలు అడవితో పెనవేసుకున్నవే. వారిద్దరూ మన్యం, గిరిజన గూడేల్లో చైతన్యం నింపిన వీరులు. అందుకే ఈ సినిమా సింహభాగం చిత్రీకరణ అడవిలోనే సాగింది. విడుదలైన టీజర్, మేకింగ్ వీడియోల్లోనూ ఈ విషయం తెలిసిపోతోంది. క్లైమాక్స్‌లో వచ్చే పోరాటాలు హోరాహోరీగా జరగనున్నాయి. ఈ ఫైట్లు ఒళ్లు గగురుపొడవటమే కాదు, ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తాయని కథా రచయిత విజయేంద్రప్రసాద్ చెప్పేశారు. ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులకు అడవిలో పసందైన వినోద విందు దక్కనుందని తెలిసిపోతుంది. ఈ చిత్రం కోసం బాలీవుడ్ నుంచి నటీనటులు, హాలీవుడ్ నుంచి సాంకేతిక నిపుణులు చేరడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.
క్లాస్‌లో పాఠాలు.. అడవిలో గుణపాఠాలు
చిరంజీవి కథానాయకుడిగా శివ కొరటాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్ కథానాయిక. రామ్‌చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలపై పోరాడే ‘ఆచార్య’గా చిరంజీవి కనిపించనున్నారు. ఇక ఆయనకు తోడు ‘సిద్ధ’ పాత్రలో రామ్‌చరణ్ నక్సలైట్‌గా పోరాటం చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అడవిలో జరిగే యాక్షన్ సన్నివేశాలు, ఛేజింగ్‌లు మాస్‌తో విజిల్స్ వేస్తాయని టాక్. మరి అడవిలో తండ్రీకొడుకులు చేసే యుద్ధం చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే!
‘పుష్పరాజ్’ ఎర్రచందనం వేట
సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘పుష్ప’. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్‌గా భయపెట్టనున్నాడు. ఇది కూడా పూర్తిగా అడవిలో జరిగే క్రైమ్ కథతో తెరకెక్కుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ పుష్పరాజ్‌గా బన్నీ ఓ భిన్నమైన రోల్‌ని పోషిస్తున్నారు. మొత్తం రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎర్రచందనాన్ని దొంగిలించే క్రమంలో వచ్చే పోరాట సన్నివేశాలు ఊహకందవని అంటున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగుతో పాటే హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ పాటతో సినిమాకు హైప్ పెరిగింది. పోస్టర్లతో అభిమానులకు కాక పుట్టిస్తున్న పుష్ప తొలిభాగాన్ని డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక కథానాయిక.
‘భీమ్లా నాయక్’ అరణ్య వాసం
పవన్ కల్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ సినిమా కొంత భాగం అడవి నేపథ్యంలోనే సాగనుంది. ఇందులో పవన్ పోలీసాఫీసర్ ‘భీమ్లానాయక్’గా కనిపిస్తున్నారు. మాతృక చిత్రమైన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’లో కేరళ ఆదివాసి మహిళలు, అక్కడి జీవన విధానాన్ని చిత్ర దర్శకుడు శచి అద్భుతంగా చిత్రీకరించారు. కేరళ గిరిజనులు మాట్లాడుకునే ఇరుల భాషలోనే పాటలు కూడా ఉన్నాయి. అవి సూపర్ హిట్‌గా నిలిచాయి. ‘భీమ్లానాయక్’లోనూ దర్శకుడు సాగర్ కె. చంద్ర నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని , అక్కడి జీవన విధానాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. పవన్ కల్యాణ్ ఇందులో పవర్‌ఫుల్‌గా కనిపిస్తాడనే విషయం తాజాగా విడుదలైన టీజర్ చూస్తే తెలిసిపోతుంది. మాతృకలో పృథ్వీరాజ్ సుకుమారన్ పోషించిన పాత్రలో రానా నటించనున్నారు.
కొండపొలం కుర్రాడి కథ
సన్నపురెడ్డి వెంకట్‌రెడ్డి రాసిన నవల కొండపొలం. పాఠకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ నవల ఇప్పుడు దృశ్యరూపం దాల్చబోతోంది. క్రిష్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. అడవి నేపథ్యంలోనే సాగే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లు. అడవిలో హీరో చేసే సాహసాలు అదిరిపోయేలా ఉంటాయని సమాచారం. ఇటీవలే విడులైన టీజర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. వికారాబాద్ అడవుల్లో సినిమా షూటింగ్ జరుపుకొంది. ఈ సినిమా కోసం కీరవాణి స్వరపరిచిన ఓబులమ్మ పాట కూడా అడవిలో దొరికే పుట్టతేనెలా మధురంగా ఉంది. అడవి జీవితం, అక్కడి అందాలను మరింత అందంగా ‘కొండపొలం’లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు క్రిష్.
వనంలో విప్లవం
వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా ‘విరాట పర్వం’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం కోసం 90లనాటి కథాంశాన్ని ఎంచుకున్నారు. ఇందులో రానా నక్సలైట్ గా కనిపించనున్నారు. అరణ్యంలో జరిపే పోరాటాలు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం. ఇందులో ఓ అందమైన ప్రేమకథనూ భాగం చేశారు దర్శకుడు వేణు. ప్రేమించినవాడిని వెతుక్కుంటూ సాయిపల్లవి అరణ్యంలోకి వెళ్తుందని ఇప్పటికే విడుదలైన ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. అడవిలో ఆ ప్రేమ, విప్లవాల కలయిక ఎంత మేరకు అలరిస్తుందో తెలియాలింటే సినిమా చూసి తీరాల్సిందే. ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా నటిస్తుండగా బాలీవుడ్ నటి నందితాదాస్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘విరాటపర్వం’ విడుదల తేదీ ఇంకా ఖరారు కాలేదు. రానా హీరోగా ఈ ఏడాది ‘అరణ్య’ అనే చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో ఎంచుకున్న కథాంశం, రానా నటనలకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అరణ్యాల నేపథ్యంలో సినిమాలు తెరకెక్కిస్తూ అడవి పరిమళాన్ని తెరకు అద్దుతుండటం ఇప్పటి ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందంటున్నారు టాలీవుడ్ నిపుణులు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
న్యాయవ్యవస్థపై ఒత్తిడి తీసుకొస్తున్నారు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య