Bollywood: ఆమిర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కలయికలో

ఆమిర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారని కొంతకాలంగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి అనురాగ్‌ బసు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది.

Updated : 07 May 2022 11:23 IST

మిర్‌ఖాన్‌, రణ్‌బీర్‌ కపూర్‌ కలసి ఓ చిత్రంలో నటిస్తున్నారని కొంతకాలంగా బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనికి అనురాగ్‌ బసు దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇది చివరి దశకు వచ్చిందని, దీనిపై ఆమిర్‌, రణ్‌బీర్‌ సంతృప్తి వ్యక్తం చేసినట్లు బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. వీలైనంత త్వరగా మిగిలిన పనులు పూర్తిచేసి సెట్స్‌పైకి తీసుకెళ్లాలని చిత్రబృందం యోచిస్తోంది. ఇప్పటికే ఆమిర్‌, రణ్‌బీర్‌ కలసి ‘పీకే’ చిత్రంలో కనిపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని