Kushi: అప్‌డేట్‌ ఇచ్చిన దర్శకుడు.. విజయ్‌, సమంత ఫ్యాన్స్‌ ‘ఖుషి’

‘ఖుషి’ సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు శివ నిర్వాణ. దాంతో, విజయ్‌ దేవరకొండ, సమంత అభిమానులు సర్‌ప్రైజ్‌ అవుతున్నారు.

Published : 05 Mar 2023 22:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), సమంత (Samantha Ruth Prabhu) జంటగా దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ (Kushi) చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతంలోనే విడుదలైన టైటిల్‌, హీరోహీరోయిన్ల ఫస్ట్‌ లుక్‌ చూసిన చాలామంది అభిమానులు అదొక పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రమని భావించారు. డైరెక్టర్‌ ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో వారంతా సర్‌ప్రైజ్‌ అవుతున్నారు. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌, ఎడిటర్‌ ప్రవీణ్‌ పూడితో కలిసి ఫొటో దిగిన శివ దాన్ని షేర్‌ చేస్తూ ఆ చిత్రంలో పోరాటాలు ఉన్నట్టు వెల్లడించారు. ‘‘ఖుషి’ తదుపరి షెడ్యూల్‌ చిత్రీకరణ ప్రారంభం కాబోతుంది. యాక్షన్‌ మోడ్‌ ఆన్‌’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌ చూసిన విజయ్‌, సమంత ఫ్యాన్స్‌.. ‘యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయా? సూపర్‌’, ‘లవ్‌+ యాక్షన్‌ అదుర్స్‌’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

‘లైగర్‌’ తర్వాత విజయ్‌ హీరోగా నటిస్తోన్నచిత్రమిది. గతేడాది డిసెంబరులోనే ఈ సినిమాని విడుదల చేయాలని చిత్ర బృందం భావించినా సాధ్యపడలేదు. సమంత అనారోగ్యానికి గురికావడంతో చిత్రీకరణ వాయిదా పడింది. మయో సైటిస్‌ వ్యాధి నుంచి క్రమంగా కోలుకుంటున్న ఆమె త్వరలోనే ‘ఖుషి’ చిత్రీకరణ పాల్గొంటారని సమాచారం. ఇప్పటికే 60శాతానికిపైగా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 8న పునఃప్రారంభం కానుందని తెలుస్తోంది. మరోవైపు, విజయ్‌ దేవరకొండ రెండు చిత్రాలను ప్రకటించారు. వాటిల్లో ఒకదానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా మరోదానికి పరశురామ్‌ డైరెక్షన్‌ చేయనున్నారు. సమంత నటించిన ‘శాకుంతలం’ ఏప్రిల్‌ 14న విడుదలకానుంది. ప్రస్తుతం ఆమె ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని