Upendra: మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్‌ కల్యాణ్‌పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌పై కన్నడ నటుడు ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Published : 16 Jun 2024 18:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిత్ర పరిశ్రమ నుంచి రాజకీయ రంగంలో అడుగు పెట్టి అక్కడా విజయం అందుకున్న పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను చూస్తే గర్వంగా ఉందన్నారు కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra). ఆయన సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్‌లో మార్పొస్తుందని ఆశిస్తున్నానన్నారు. అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. తాను గతంలో నటించిన ‘ఏ’ (A) సినిమా రీరిలీజ్‌ కానున్న సందర్భంగా ఉపేంద్ర హైదరాబాద్‌ వచ్చారు. సినిమా ప్రచారంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. పవన్‌ కల్యాణ్‌ గురించి ప్రశ్న ఎదురవగా స్పందించారు. గతంలో ఒకసారి మాత్రమే పవన్‌ను కలిశానని గుర్తుచేసుకున్నారు.

పవన్‌ కల్యాణ్‌కు సాయిధరమ్‌ తేజ్‌ గిఫ్ట్‌.. అదేంటంటే?

‘మీరు పార్టీని వదిలిపెట్టి పూర్తిస్థాయిలో సినిమాలకే పని చేస్తున్నారా?’ అని యాంకర్‌ అడగ్గా.. ‘‘నేను పార్టీని చూసుకుంటేనే నటిస్తున్నా. ఫండ్స్‌, లీడర్స్‌, ఫేమ్‌, వ్యక్తుల పేరు చూసి ఓటెయ్యడం.. పాలిటిక్స్‌ అంటే చాలామంది అభిప్రాయం ఇదే. నా ఉద్దేశంలో ఫండ్‌ లేకుండా పార్టీ ముందుకెళ్లాలి. ఆ విషయంలో ప్రజలే చొరవ తీసుకోవాలి. అప్పుడే అది అసలైన పీపుల్స్‌ పార్టీ అవుతుంది. నేను ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ అధ్యక్షుడిగా పని చేస్తున్నానే తప్ప ఎన్నికల్లో పోటీ చేయను. నా కుటుంబ సభ్యులూ చేయరు’’ అని ఉపేంద్ర సమాధానమిచ్చారు.

రొమాంటిక్‌ సైకలాజికల్‌గా థ్రిల్లర్‌గా కన్నడలో రూపొందిన ‘ఏ’.. అదే పేరుతో 1998లో తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఉపేంద్రకు విశేష క్రేజ్‌ తీసుకొచ్చింది. ఆ చిత్రానికి ఆయనే దర్శకత్వం వహించడం విశేషం. ఈ నెల 21న తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో రీరిలీజ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని