Upendra: ఉపేంద్రకు అనారోగ్యమంటూ వార్తలు.. స్పందించిన నటుడు

తాను ఆరోగ్యంగానే ఉన్నానని అన్నారు నటుడు ఉపేంద్ర. తన ఆరోగ్య పరిస్థితిపై వస్తోన్న వార్తల గురించి ఆయన స్పందించారు.

Updated : 25 Nov 2022 12:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన ఆరోగ్య పరిస్థితిపై సోషల్‌మీడియా, పలు వెబ్‌సైట్లలో వస్తోన్న వార్తల గురించి ప్రముఖ నటుడు ఉపేంద్ర (Upendra) స్పందించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు తన తదుపరి సినిమా సెట్‌ నుంచి ఓ వీడియో షేర్‌ చేశారు. ‘యూఐ’ సినిమా షూట్‌లో బిజీగా ఉన్న ఉపేంద్ర.. గురువారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడ్డారని, చిత్రబృందం ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించిందని పేర్కొంటూ పలు వార్తలు బయటకు వచ్చాయి. దీంతో ఆందోళనకు గురైన ఆయన అభిమానులు ‘గెట్‌ వెల్‌ సూన్‌’ అంటూ నెట్టింట పోస్టులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఉపేంద్ర తాజాగా వీడియో షేర్‌ చేశారు. షూట్‌ చేస్తోన్న లొకేషన్‌లో దుమ్ము ఎక్కువగా ఉండటంతో కాస్త ఇబ్బందికి గురయ్యానని.. దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి వచ్చానని ఆయన వివరించారు. ‘రా’, ‘ఉపేంద్ర’, ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ వంటి చిత్రాలతో ఆయన తెలుగు వారికీ సుపరిచితులయ్యారు. ప్రస్తుతం ఆయన ‘కబ్జా’, ‘త్రిశూలం’, ‘యూఐ’ చిత్రాల్లో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని