‘ఉప్పెన’ ట్రైలర్‌ వచ్చేసిందోచ్‌..!

‘నీ కళ్లు నీలి సముద్రం’.. ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను ముగ్దుల్ని చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఆ సినిమా పాటలు అందర్నీ ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటిస్తున్న ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

Updated : 04 Feb 2021 18:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘నీ కళ్లు నీలి సముద్రం’, ‘జల జల జలపాతం నువ్వూ’ అంటూ వినసొంపైన పాటలతో సంగీత ప్రేమికులను మంత్ర ముగ్దుల్ని చేసిన చిత్రం ‘ఉప్పెన’. ఆ సినిమా పాటలు ఎంతలా ఆకట్టుకున్నాయో అందరికీ తెలిసిందే. మెగా హీరో వైష్ణవ్‌తేజ్‌, కృతిశెట్టి జంటగా నటించిన ఈ ప్రేమకథా చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్‌సేతుపతి విలన్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌ సైతం ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. తాజాగా.. సినిమా ట్రైలర్‌ను ఎన్టీఆర్‌ విడుదల చేశారు. ‘‘ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌’’ అని తారక్‌ అన్నారు.

రాక్‌స్టార్‌ దేవీశ్రీప్రసాద్‌ ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో నిరూపించారు. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకొన్న ‘ఉప్పెన’ గతేడాది విడుదల కావాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఫిబ్రవరి 12న విడుదల కానుంది.

ఇవీ చదవండి..

నా నోటికి తొందరెక్కువ: ‘మంచు’ దెబ్బ వెనుక కథ!

ఒక్క డైలాగ్‌ లేకుండా ‘పవర్‌ప్లే’ ట్రైలర్‌!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని